వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. యాభై కోట్ల ఫైజర్ వ్యాకిన్ డోసులను కొనుగోలు చేసి.. పేద దేశాలకు ఉచితంగా పంచాలని నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయంపై ఇప్పటికే కసరత్తులు పూర్తయ్యానని, బైడెన్ నోటి నుంచి అధికారిక ప్రకటన వెలువడడమే తరువాయి అని వైట్‌హౌజ్ ఉటంకించినట్లు అమెరికాలోని ప్రముఖ వెబ్‌సైట్స్ ఒక కథనం ప్రచురించాయి.
కాగా, ఫైజర్ బయోఎన్‌టెక్ కొవిడ్ 19 వ్యాక్సిన్ 500 మిలియన్ల డోసులు కొనుగోలు చేయాలని బైడెన్ పాలనా విభాగం ప్రణాళిక వేసింది. వీటిని వంద పేద దేశాలకు వీటిని పంచబోతోంది. ఈ ఏడాది చివరికల్లా 200 మిలియన్ డోసులు, మిగిలిన 300 మిలియన్ డోసులు వచ్చే ఏడాది కల్లా అందించాలని నిర్ణయించుకుంది. ఇక ఈ భారీ సాయంపై పోయిన నెలలోనే బైడెన్ నిర్ణయం తీసుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. ‘‘కరోనాను అంతం చేయాల్సిన అవసరం ఉంది. అది అమెరికాలోనే కాదు.. ప్రపంచంలో నలుమూలలా. వ్యాక్సిన్ డోసుల డొనేషన్లో మీరు పాల్గొనండి. ముందుకు రండి’’ అని ప్రపంచదేశాలను ఉద్దేశించి బైడెన్ వ్యాఖ్యానించినట్లు వాషింగ్టన్ పోస్ట్ వెబ్ సైట్ పేర్కొంది.
ప్రపంచం మొత్తం వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటున్న తరుణంలో బైడెన్ భారీ సాయంపై హర్షం వ్యక్తం అవుతోంది. కాగా, అమెరికా ఇదివరకే 300 మిలియన్ల ఫైజర్ డోసుల కోసం ఒప్పందం చేసుకోగా.. ఇప్పుడు సాయం ప్రకటన నేపథ్యంలో అదనంగా 500 మిలియన్ల డోసుల కొనుగోలు కోసం మరో ఒప్పందం చేసుకుంది. యూఎస్, యూకేలో 42 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తికాగా, ఆఫ్రికాదేశాల్లో ఒక్క శాతం కంటే తక్కువ జనాభాకు వ్యాకినేషన్ జరిగింది. దీంతో ముందుగా ఆఫ్రికన్ దేశాలకే అందించాలని బైడెన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కోవాక్స్ ద్వారా 75 శాతం డోసుల్ని పంపిణీ చేయనున్నట్లు వైట్‌హౌజ్ ప్రకటించింది. ఇక ప్రపంచం మొత్తం మీద వ్యాక్సిన్ కొరత తీరాలంటే పదకొండు బిలియన్ల డోసులు అవసరమని డబ్ల్యూహెచ్‌వో భావిస్తుండగా.. బైడెన్ సాయం ప్రకటన కొంతలో కొంత ఊరట ఇచ్చేదే. జీ7 సమ్మిట్‌లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
బైడెన్ భేష్: పేద దేశాలకు 50 కోట్ల ఫ్రీ డోసులు
Published Thu, Jun 10 2021 2:43 PM | Last Updated on Thu, Jun 10 2021 5:01 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment