గర్భస్థ శిశువు, నవజాత శిశువులు శ్వాస సంబధ సమస్యలు ఎదుర్కొటుంటారు. వారికి ట్రీట్‌మెంట్ అందించడం అనేది ఓ సవాలు. దీని వల్ల మెదడుకు సక్రమంగా ఆక్సిజన్ అందక బుద్ధిమాంద్య పిల్లల్లా లేదా మానసిక వికలాంగులులా మిగిలిపోతున్నారు. అలాంటి శిశువులకు వయాగ్రాతో చికిత్స అందిస్తే మెరుగైన ప్రయోజనం ఉంటుందని కెనడాలోని మాంట్రియల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. నిజానికి గర్భస్థ శిశువులు లేదా నవజాత శిశువులు ఎక్కువగా ఈ శ్వాస సంబంధ సమస్యలు ఎదుర్కొంటారు. ఈ పరిస్థితిని నియోనాటల్ ఎన్సెలోపతి అంటారు. నిజానికి ఇలాంటి సమస్యలతో బాధపడే చిన్నారులకు సాధారణంగా ఇప్పటి వరకు థెరప్యూటిక్ హైపోథెర్మీయా(అల్పోష్ణ స్థితి) చికిత్స మాత్రేమే అందిస్తున్నారు.
ఇది శరీరాన్ని కూల్ చేసే పద్ధతి. దీన్ని కార్డియాక్ అరెస్ట్‌కి గురయ్యి వ్యక్తి గుండె మళ్లీ కొట్టుకునేలా చేసిన తర్వాత ఆ వ్యక్తి శరీరాన్ని కూల్ చేయడానికి ఈ థెరప్యూటిక్ హైపోథెర్మీయా(అల్పోష్ణ స్థితి) చికిత్స విధానాన్నే అందించడం జరుగుతుంది. అయితే ఈ చికిత్స విధానాన్ని శిశువులకు అందిస్తుంటే వారిలో సుమారు 29% మంది శిశువులు నరాల సంబంధిత సమస్యలు ఎదురయ్యి మెదడు డెవలప్ అవ్వకపోవడం లేదా దెబ్బతినడం జరుగుతోంది. ఈ సమస్యకు సిల్డెనాఫిల్(వయాగ్రా)తో చెక్‌పెట్టొచ్చని కెనడాలోని మాంట్రియల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడయ్యింది.
ఇలా థెరప్యూటిక్ హైపోథెర్మీయా చికిత్స తీసుకుని మెదడు దెబ్బతిన్న చిన్నారులకు సిల్డెనాఫిల్(వయాగ్రా)తో చికిత్స అందించగా మెరుగైన ఫలితాలు కనిపించాయి. వారిలో కేవలం 30 రోజుల్లో బూడిదరండు పదార్థం పెరిగింది. పైగా 18 నెలల్లోనే న్యూరో డెవలప్‌మెంట్‌లో మంచి ఫలితాలు చూపించాయి. ఈ మేరకు మాంట్రియల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్య బృందం తీవ్రమైన నియోనాటల్ ఎన్సెఫలోపతితో బాధపడుతున్న మొత్తం 24 మంది శిశువులను తీసుకున్నారు. వారిలో ముగ్గురికి తప్పించి మిగతా అందరికి వయాగ్రాతో చికిత్స అందించారు.
ఈ వయగ్రా తీసుకున్న శిశువులందరిలో మెదుడలోని గాయాలు నయమవ్వడం, వాల్యూమ్ కోల్పోయిన మెదడులో బూడిద రంగు పదార్థం పెరగడం వంటివి జరిగాయని అన్నారు. తక్కువ టైంలోనే వారిలో న్యూరో డెవలప్‌మెంట్ మెరగయ్యిందని, అలాగే ఇది వారికి సురక్షితమైనదేనని పేర్కొన్నారు వైద్యులు. ప్రపంచవ్యాప్తంగా నియోనాటల్ ఎన్సెఫలోపతితో బాధపడుతున్న చిన్నారులకు ఈ చికిత్స విధానమే బెస్ట్ అని చెప్పారు.
(చదవండి: గంట ఆగిన గుండె... మళ్లీ కొట్టుకుంది!)
Comments
Please login to add a commentAdd a comment