బీట్‌రూట్ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో సందేహంలేదు. ఈ దుంపకూరలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి. దీన్ని ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో ఆహారంగా తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. బీట్‌రూట్ తింటే మూత్రం ఎరుపు లేదా ఊదా రంగులో (బీటూరియా) వస్తుంది. కానీ ఇది సాధారణంగా ప్రమాదకరం కాదు. బీట్‌రూట్ వల్లన పెద్దగా దుష్ప్రభావాలు పెద్దగా ఏమీలేవు.
అయితే ఇటీవల ఒక న్యూస్ వైరల్‌గా మారింది. స్త్రీ పురుషుల లైంగిక సామర్థ్యాన్ని బాగా పెంపొందిస్తుందనే వార్త వైరల్ అయింది. వయాగ్రాలా పనిచేస్తుందని వార్తలొచ్చాయి. దీంతో డిమాండ్ బాగా పెరిగింది. ఆస్ట్రేలియన్ సూపర్ మార్కెట్ బీట్‌రూట్ కొరత ఏర్పడింది. ఒక సమయంలో, ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం ఈబేలో ఎక్కువ ధరకు అమ్ముడైందిట. అయితే దీనిపై యూకే టీవీ డాక్టర్ మైఖేల్ స్పందించారు.ఇది వయాగ్రాలా పనిచేస్తుందనడానికి శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవని కొట్టిపారేశారు. కాని ఇది సహజ సిద్ధంగా లభించే సూపర్ ఫుడ్ అని ముఖ్యంగా విటమిన్ బీ, సీ, మినరల్స్, ఫైబర్ , యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయని ఆయన చెప్పారు. రక్త ప్రసరణకు బాగా ఉపయోగపడుతుందన్నారు.
అయితే రోమన్లు బీట్‌రూట్ , దాని రసాన్ని కామోద్దీపనగా ఉపయోగించారని చెబుతారు.బీట్‌రూట్ తిన్నప్పుడు, బ్యాక్టరియా ఎంజైమ్‌లతో కూడిన రసాయన ప్రతిచర్యలు బీట్‌రూట్‌లోని నైట్రేట్‌ను నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుస్తాయి ఈ నైట్రిక్ ఆక్సైడ్ రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. పలు అధయనాల ప్రకారం ఫుడ్ ఆధారిత నైట్రిక్ ఆక్సైడ్ పురుషులలో లైంగిక జీవితానికి అవసరమైన టెస్టోస్టెరాన్ హార్మోన్‌కు సపోర్ట్ చేస్తుందని అంచనా
బీట్‌రూట్‌లోని రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచే సామర్థ్యం గుండె, రక్తనాళాల ప్రసరణ వ్యవస్థకు ప్రయోజనం చేకూరుస్తుంది దీన్ని జ్యూస్ చేసుకుని తాగినా, కూర చేసుకుని తిన్నా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. డీహైడ్రేషన్ సమస్యతో బాధపడేవారికి బీట్ రూట్ ఒక వరం లాంటిది. శరీరానికి అవసరమయిన నీటి శాతాన్ని బీట్‌రూట్ అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment