అమ్మకాల కోసం లిక్కర్ లో 'వయాగ్రా'! | Chinese businessman detained for selling 'Viagra liquor | Sakshi
Sakshi News home page

అమ్మకాల కోసం లిక్కర్ లో 'వయాగ్రా'!

Published Sun, Aug 17 2014 3:45 PM | Last Updated on Sat, Sep 2 2017 12:01 PM

అమ్మకాల కోసం లిక్కర్ లో 'వయాగ్రా'!

అమ్మకాల కోసం లిక్కర్ లో 'వయాగ్రా'!

బీజింగ్: మద్యం సేల్స్ ను పెంచుకునేందుకు సరికొత్త బాట పట్టాడు చైనా వ్యాపారవేత్త. వయాగ్రా తరహాలో పనిచేసే ఒక రసాయన పదర్థాన్ని మద్యంలో కలుపుతూ వ్యాపారం చేపట్టాడు. చైనాకు చెందిన హంగ్ అనే  వ్యాపారవేత్తకు ఒక మద్యం ఫ్యాక్టరీ ఉంది. ఆ క్రమంలో అతనికి తన వ్యాపారాన్ని పెంచాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు మగతానాన్ని పెంపొందించుకునేందుకు ఉపయోగపడే వయాగ్రా తరహాలో పనిచేసే ఒక రసాయన పదార్థాన్ని లిక్కర్ లో కలపాలని నిశ్చయించాడు. అందుకు అనుగుణంగానే ఇంగ్లిష్ మందుల్లో కలిపే సిల్డినఫీ అనే రసాయనాన్ని మద్యంలో వాడటం మొదలు పెట్టాడు. ఈ రకంగా సరికొత్త వ్యాపారానికి తెరలేపిన అతను వాన్ రాష్ట్ర రాజధానితో పాటు పలు ప్రాంతాల్లో విక్రయం మొదలు పెట్టాడు.

 

గత ఫిబ్రవరిలో లిక్కర్ ఫ్యాక్టరీ పెట్టిని అతనికి ఈ వ్యాపారం బానే ఉందనుకుని మరింత విస్తరించాడు. 100 మిల్లీ లీటర్ల మద్యంలో 130 మిల్లీ గ్రాముల ప్రభావిత పదార్థాన్ని కలపసాగాడు. అది కాస్తా 750 లీటర్ల లిక్కర్ ద్రావకంగా మారుతుంది. ఈ క్రమంలోనే 1000 పైగా బాటిళ్లను అమ్మాడు. ఇక్కడ కూడా వాంగ్ తన స్నేహితులపై ప్రేమ కురిపించాడు. వారికి 810 బాటిళ్లను కానుకగా ఇచ్చాడు. ఈ రసాయనం రోగులపై అధిక దుష్ర ప్రభావం చూపడమే కాకుండా, అక్రమం కావడంతో వాంగ్ చేసే వ్యాపారాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement