Wuhan Scientists Warn, New Corona NeoCov Found in South Africa: కరోనా మహమ్మారి, ఒమిక్రాన్ వేరియంట్‌లతో సతమతమై ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న వేళ చైనా మరో బాంబ్ పేల్చింది. కరోనా పుట్టినిల్లుగా భావిస్తున్న వూహాన్ ల్యాబ్ శాస్త్రవేత్తలే ఈ కొత్త మహమ్మారి గురించి వార్నింగ్ బెల్స్ మోగించారు. కొత్తరకం కరోనా వైరస్ నియోకోవ్‌తో పెను ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఇది అత్యంత వేగంగా వ్యాపించగలదని, మరణాలు రేటు ఎక్కువగా ఉంటుందని సైంటిస్టుల వార్నింగ్ ఇచ్చారు. వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోయే ప్రమాదం ఉందని వూహాన్ ల్యాబ్ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉండగా, నియో కోవ్ వైరస్ కొత్తదేమీ కాదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 2012-15 పశ్చిమాసియాలో వ్యాపించిన మెర్సికోవ్‌కు నియోకోవ్‌కు సంబంధం ఉందని వెల్లడించారు. నియోకోవ్‌ను తొలుత దక్షిణాఫ్రికాలోని గబ్బిలాల్లో గుర్తించారని ఇప్పటివరకు మనుషులకు సోకలేదని వివరించారు. ప్రస్తుతం ఇది జంతువుల నుంచి జంతువులకు మాత్రమే పాకుతున్న వైరస్‌గా గుర్తించినట్లు తెలిపారు. అయితే ఇందులోని ఓ మ్యుటేషన్ కారణంగా వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉందని వ్యూహాన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో నిర్ధారణ అయింది. సార్స్‌కో-2 మాదిరిగా వేగంగా మనుషులకు సోకే ప్రమాదం ఉందని పరిశోధకులు అంటున్నారు. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్‌తో కలిసి వ్యూహాన్ యూనివర్శిటీ పరిశోధకులు చేసిన ఈ అధ్యయనం బయో ఆర్షయోలో ప్రచురితమైంది. అయితే ఈ అధ్యయనాన్ని ఇంకా పీర్ రివ్యూ చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment