బీజింగ్: ప్రపంచ వ్యాప్తంగా కరనా వైరస్ బారిన పడి ప్రజలు లక్షల్లో మరణించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో కరోనా రోగులకు వైద్యం అందిస్తూ వైద్యులు సైతం మహామ్మారికి బలైపోయారు. ఈ నేపథ్యంలో చైనాలోని వుహాన్‌కు చెందిన ఓ డాక్టర్ కోవిడ్ బారిన పడి మరణించగా మరికొంతమంది కోలుకుని తిరిగి పూర్వ స్థితికి చేరుకున్నారు. అదే విధంగా యీ ఫాన్ అనే హృద్రోగ నిపుణుడు కోవిడ్-19 బాధితులకు వైద్యం అందిస్తూ మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ఆయన 39 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్సలో పోందారు. ఈ క్రమంలో ఆయన శరీరం నీలి రంగులోకి మారిపోయింది. ఆయనను చూసిన వైద్యులందరూ షాక్‌కు గురయ్యారు. చివరకు యాంటిబయాటిక్స్ మందుల వల్ల శరీరం నీలి రంగులోకి మారినట్లు గుర్తించారు. డాక్టర్ యీ ఫాన్ కూడా ఈ రంగు శాశ్వతంగా ఉండిపోతుందని భయాందోళనకు గురయ్యారు .(చదవండి: మళ్లీ లాక్‌డౌన్ దిశగా యూరప్ దేశాలు)
ఆయన కోలుకుని డాశ్చార్జ్ అయిన అనంతరం కొన్ని నెలల తర్వాత డాక్టర్ తన మునుపటి రంగును తిరిగి పొందారు. దీంతో ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. ‘కరోనా చికిత్సలో భాగంగా ఎక్కువ మోతాదులో యాంటిబయాటిక్స్ తీసుకోవడం వల్ల నా శరీరం డార్క్ బ్లూలోకి మారింది. అదే రంగు నాకు శాశ్వతంగా ఉండిపోతుందని ఆందోళన పడ్డాను. కానీ కోలుకున్న అనంతరం కొన్ని నెలల తర్వాత నా మునుపటి రంగును పొందాను. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే కరోనా పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, మహమ్మారి చాలా ప్రమాదకరం’ అని ఆయన హెచ్చరించారు. (చదవండి: నవంబర్ 30 వరకూ అన్‌లాక్ 5.0 పొడిగింపు)
Comments
Please login to add a commentAdd a comment