Anti biotics
-
ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడినా.. ఇన్ఫెక్షన్స్ వస్తాయా?
సాధారణ వెజైనల్ డిశ్చార్జ్‌కి ఈస్ట్ ఇన్ఫెక్షన్కి తేడా ఏంటో చెప్తారా? – ఆలూరి సుష్మారెడ్డి, ఖానాపూర్వెజైనల్ డిశ్చార్జ్ అనేది నార్మల్‌గా కూడా ఉంటుంది. ఇది నెలసరి సమయాన్ని బట్టి మారుతుంది. సాధారణంగా నెల మధ్యలో అండాల విడుదల సమయానికి తీగలాగా తెలుపు అవుతుంది. ఇది రెండు నుంచి అయిదు రోజులు అవుతుంది. నెలసరికి ముందు రెండు నుంచి అయిదు రోజుల వరకు థిక్‌గా ఈ వైట్ డిశ్చార్చ్ అవుతుంది.ప్రెగ్నెన్సీలో మూడవ నెల నుంచి థిక్‌గా, లైట్‌గా, నీళ్లలా వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. ఈ డిశ్చార్జెస్ ఏవీ రంగు, వాసన ఉండవు. దురద, మంట, ఎరుపెక్కడం వంటివీ ఉండవు. జ్వరం రాదు. వీటినే నార్మల్ వెజైనల్ డిశ్చార్జ్ అంటారు. ఈస్ట్ ఇన్ఫెక్షన్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్లో చాలా వరకు వెజైనాలో దురద, మంట, దుర్వాసన, దద్దుర్లు, మూత్ర విసర్జనప్పుడు నొప్పి, జ్వరం రావడం వంటి లక్షణాలు ఉంటాయి. డిశ్చార్జ్.. పెరుగులా, థిక్‌గా, గ్రీన్, యెల్లో కలర్స్‌లో ఉంటుంది.తొడల మీద కూడా దద్దుర్లు వస్తాయి. అయితే ఇది లైంగిక వ్యాధి కాదు. ఏడాదిలో మూడు సార్లకన్నా ఎక్కువగా ఈస్ట్ ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని రికరెంట్ ఈస్ట్ ఇన్ఫెక్షన్ అంటారు. దీనికి దీర్ఘకాలిక చికిత్స అవసరం ఉంటుంది. మధుమేహం, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ ఇన్ఫెక్షన్స్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. వెజైనాలో సహజంగా ఉండే బ్యాలెన్స్ తప్పినప్పుడు ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడినా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. యాంటీఫంగల్ క్రీమ్స్, జెల్స్, టాబ్లెట్స్‌తో ఈ ఇన్ఫెక్షన్కు చికిత్సను అందిస్తారు. కొన్నిసార్లు వెజైనల్ స్వాబ్ అనే చిన్న స్మియర్ టెస్ట్ చేసి ఈస్ట్ ఇన్ఫెక్షన్ను నిర్ధారిస్తారు. పెల్విక్ పరీక్ష చేసినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ను గుర్తిస్తారు. – డా భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
చీటికి మాటికి యాంటీబయాటిక్స్ వాడుతున్నారా?మీరు డేంజర్లో ఉన్నట్లే!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రాణాలను కాపాడే యాంటీబయోటిక్స్ ఒక్కోసారి ప్రాణాంతకమవుతున్నాయి. విచ్చలవిడి వినియోగం కొంప ముంచుతోంది. ప్రతి చిన్న రోగానికీ పెద్ద మందు వేయడం శరీరానికి భారంగా మారింది. జలుబు, దగ్గు వంటి చిన్న చిన్న వాటికి కూడా ఖరీదైన, మోతాదుకు మించి యాంటీబయోటిక్స్‌ను వాడుతున్నారు. దీంతో కొన్ని రకాల బాక్టీరియా హై డోస్ (తీవ్ర మోతాదుతో కూడిన) యాంటీబయోటిక్స్కూ లొంగని పరిస్థితి ఎదురైంది. దీనివల్ల జరగాల్సిన నష్టం కంటే ఎక్కువగా జరుగుతున్నట్టు వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాంటీబయోటిక్స్ గురించి కొన్ని నిజాలు.. ►ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏటా రూ.240 కోట్ల విలువైన యాంటీబయోటిక్స్ వినియోగంలో ఉన్నట్టు అంచనా. ► డాక్టరు సూచించినవి కాకుండా నేరుగా కౌంటర్ సేల్ అంటే మందుల షాపు వద్దకెళ్లి వాడుతున్న వారు 30 శాతం మంది. ► ఉదాహరణకు ఒక వ్యాధి తగ్గాలంటే ఐదురోజుల కోర్సు పూర్తి చేయాలి. కానీ మూడురోజులకే జబ్బు తగ్గిందని ఆపేస్తున్నారు. ► చిన్న చిన్న జ్వరాలు, జలుబు, దగ్గు, విరేచనాలు వంటి జబ్బులకు యాంటీబయోటిక్స్ వాడేవాళ్లు ఎక్కువయ్యారు. ►యాంటీబయోటిక్స్‌కు జబ్బులు తగ్గకపోతే రోగం ముదిరి ఎక్కువ రోజులు ఆస్పత్రిలో ఉండాలి. దీనివల్ల ఆర్థికంగా చితికిపోతారు. ► ఎక్కువ వినియోగంలో ఉన్న యాంటీబయోటిక్స్...అజిత్రోమైసిన్, సెఫాక్సిమ్, సెఫడోక్సిమ్, నార్‌ఫ్లాక్సిన్, సెఫ్ట్రియాక్సోన్, ఆఫ్లాక్సోసిన్, సిప్రోఫ్లాక్సిన్, సిఫ్రాన్, సెప్ట్రాన్, మోనోసెఫ్, టాజోబ్యాక్టమ్ వంటివి. నియంత్రణ ముఖ్యం యాంటీ బయోటిక్స్ వాడేముందు డాక్టర్ ప్రిస్కిప్షన్ తప్పనిసరి. యాంటీ బయోటిక్స్ వాడేటప్పుడు కోర్సు పూర్తయ్యే వరకూ మధ్యలో మానెయ్యొద్దు. డాక్టర్ సూచించిన మోతాదే వాడాలి. మెడికల్ స్టోర్‌కు వెళ్లి మనకు మనమే యాంటీబయోటిక్ తెచ్చుకోకూడదు. చిన్న చిన్న జబ్బులకు యాంటీబయోటిక్స్ వాడటం మంచిది కాదు. యాంటీ బయాటిక్ ఎలా వాడాలి? బాధితులకు వచ్చిన వైద్య సమస్య ఆధారంగా, దాని తీవ్రతను బట్టి... దానికి ఏ తర్చహా యాంటీబయాటిక్స్ వాడాలి, అది కూడా ఎంత మోతాదులో వాడాలి, దాన్ని ఎంతకాలం పాటు వాడాలన్న విషయాలు వైద్యులకే తెలుస్తాయి. ఒకవేళ మందుల మోతాదును తక్కువగా ఇస్తుంటే... రోగకారక క్రిములు క్రమంగా యాంటీబయాటిక్స్ తమపై పనిచేయని విధంగా నిరోధకత (రెసిస్టెన్స్)ను పెంచుకోవచ్చు. అందుకే డాక్టర్లు నిర్దేశించిన మేరకు మాత్రమే, వారు చెప్పిన కాల వ్యవధి వరకే వాటిని వాడాలి.వ్యాధి తీవ్రతను బట్టి యాంటి బయాటిక్స్ వాడాల్సి ఉంది. కానీ చాలా మంది సొంత వైద్యం చేసుకుంటున్నారు. యాంటీ బయాటిక్స్ మందులు ఎక్కువగా వాడడం వల్ల కిడ్నీ, కాలేయ వ్యాధుల బారిన పడి మంచాన పడుతున్నారు. యాంటీ బయాటిక్స్ అధిక మోతాదులో వాడడం వల్ల ప్రస్తుతం కొత్త చిక్కు వచ్చి పడింది. బాక్టీరియాలు సైతం యాంటీ బయాటిక్స్ మందులకు అలవాటు పడడంతో శరీరంలో సహజ సిద్ధంగా ఉండే వ్యాధి నియంత్రణ వ్యవస్థ దెబ్బతింటుంది. ప్రమాదకర స్థాయికి యాంటీ బయాటిక్స్ వాడకం పెరిగిపోవడం వల్ల ఇప్పటికైనా నియంత్రణ చర్యలు చేపట్టాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి దేశంలోని చాలా కాంబినేషన్ యాంటీబయాటిక్స్‌ను వాడొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. రెండు మూడురకాలకు చెందిన యాంటీ బయాటిక్స్‌ను కలిపి (కాంబినేషన్) వాడటం సరైంది కాదని పేర్కొంది. కాంబినేషన్ మందులను కుష్టు, క్షయ వంటి వ్యాధులకు వాడాలి. కానీ మన వద్ద చిన్న చిన్న రోగాలకు కూడా కాంబినేషన్ ఔషధాలు వాడుతున్నారు. ఒకటి అవసరమైనచోట రెండు వాడటం వల్ల కూడా ఆ మందు పనిచేయని పరిస్థితి వస్తుంది లొంగకపోతే పెద్ద ప్రమాదం యాంటీబయోటిక్స్ మందులు పరిమితంగా ఉంటాయి. ఒక్కసారి ఈ మందులకు బ్యాక్టీరియా లొంగకపోతే తర్వాత కష్టం. కొత్త జబ్బులు వచ్చినప్పుడు ఈ మందులు పనిచేయవు. ఈ పరిస్థితులను అధిగమించడం చాలా కష్టమవుతుంది. పరిమిత మోతాదులో వాడాలి. – డా.సీహెచ్.ప్రభాకర్‌రెడ్డి,హృద్రోగ నిపుణులు మోతాదుకు మించి వాడితే... యాంటీబయోటిక్స్ పరిమితంగా వాడాలి. జబ్బును బట్టి డాక్టర్ ప్రిస్కిప్షన్ మేరకే కోర్సు వాడాలి. అలాగని రెండ్రోజులు వాడి వదిలేయకూడదు కూడా. పరిమిత మోతాదులో జబ్బును బట్టి వాడితేనే మంచిది. లేదంటే కొన్ని జబ్బులు మొండికేసే అవకాశం ఉంటుంది. –డా.ఫణి మహేశ్వరరెడ్డి, జనరల్ సర్జన్ -
Health: మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకొంటే జరిగే అనర్థాలివే! ముఖ్యంగా వర్కింగ్ వుమెన్..
సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో మూత్రసంబంధమైన సమస్యలు, యూరినరీ ఇన్ఫెక్షన్లు ఎక్కువ. శరీర నిర్మాణపరంగా వారి మూత్రవ్యవస్థ నిర్మితమైన తీరు వల్ల వారిలో ఈ సమస్యలు, ఇన్ఫెక్షన్లు అధికం. దీనికి తోడు బయటకు వెళ్లి ఆఫీసుల్లో పనిచేసే మహిళల్లో (వర్కింగ్ ఉమెన్)లో... వారికి ఉండే కొన్ని పరిమితుల వల్ల ఇన్ఫెక్షన్లు, మరికొన్ని ఇతర సమస్యలు పెరుగుతాయి. అలా ఎందుకు జరుగుతుందో తెలిపే కథనం. సాధారణ మహిళలైన గృహిణులకూ (హోమ్ మేకర్స్‌కూ), బయటికి వెళ్లి పనిచేసే మహిళలకూ (వర్కింగ్ ఉమెన్కూ) కొన్ని తేడాలు ఉంటాయి. వర్కింగ్ ఉమన్ నీళ్లు తక్కువగా తాగడం, అలాగే మూత్రానికి వెళ్లాల్సిన అవసరమొచ్చినా చాలాసేపు ఆపుకోవడం ఈ రెండు పనులూ చాలా ఎక్కువగా చేస్తుంటారు. దాంతో వారిలో కొన్ని సమస్యలు వస్తుంటాయి. అవి... 1. మూత్రంలో ఇన్ఫెక్షన్ (యూరినరీ ఇన్ఫెక్షన్స్), 2. మూత్ర విసర్జనలో సమస్యలు.... ఈ మూత్ర విసర్జన సమస్యలు మళ్లీ రెండు రకాలు. ►మొదటిది బ్లాడర్ సామర్థ్యం తగ్గి త్వరత్వరగా మూత్రానికి వెళ్లాల్సి రావడం. ►రెండోది మూత్రం వస్తున్నట్లు అనిపిస్తున్నా విసర్జన సాఫీగా జరగక నొప్పి రావడం. ఇక తక్కువగా నీళ్లు తాగడం వల్ల మూడో సమస్యగా మూత్రపిండాల్లో రాళ్లు కూడా రావచ్చు. ఎందుకీ సమస్యలు : మొదటి కారణం సాధారణంగా వర్కింగ్ ఉమెన్... మూత్రవిసర్జనను తప్పించుకోడానికి నీళ్లు చాలా తక్కువగా తాగుతుంటారు. నిర్వహణ బాగుండే పెద్ద పెద్ద ఆఫీసులు మినహాయిస్తే చాలా చోట్ల రెస్ట్‌రూమ్స్ బాగుండకపోవడం, కొన్ని చోట్ల మరీ అపరిశుభ్రంగా ఉండటం, శుభ్రం చేసుకోడానికి నీళ్లు అందుబాటులోకి లేకపోవడం, ఉన్నా అవి పరిశుభ్రంగా లేకపోవడం వంటి అనేక కారణాలతో నీళ్లు తక్కువగా తాగుతుంటారు. రెండో కారణం ఇక ఎంతగా మూత్రవిసర్జన చేయాల్సి వచ్చినా రెస్ట్రూమ్/బాత్రూమ్లు బాగుండవనే అభిప్రాయంతో మూత్రవిసర్జనను ఆపుకుంటారు. ఇలా ఎక్కువ సేపు బిగబట్టడం వల్ల బ్లాడర్ సామర్థ్యం తగ్గుతుంది. ఎప్పుడో ఒకసారి ఇలా బిగబట్టడం వల్ల పెద్దగా సమస్యలేవీ రావుగానీ... అదే పని పదేపదే చాలాకాలం పాటు కొనసాగుతున్నప్పుడు మహిళల్లో మూత్రసంబంధమైన సమస్యలొస్తాయి. ఎలాంటి సమస్యలొస్తాయంటే... మూత్ర సంబంధమైన ఇన్ఫెక్షన్లు మూత్రమార్గంలో వచ్చే ఇన్ఫెక్షన్ను ‘యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్’ (యూటీఐ) అంటారు. ఈ సమస్య ఎలా వస్తుందంటే... శరీరం తనలోని వ్యర్థాలను శుభ్రపరిచాక... వాటిని మూత్రం రూపంలో ఓ కండర నిర్మితమైన బెలూన్ లాంటి బ్లాడర్‌లో నిల్వ ఉంచుతుంది. ఈ బ్లాడర్ చివర స్ఫింక్టర్ అనే కండరాలు ఎప్పుడు బడితే అప్పుడు మూత్రస్రావం కాకుండా ఆపుతుంటాయి. చాలాసేపటి వరకు (దాదాపు నాలుగ్గంటలకు పైబడి) ఆపుకుంటే... అక్కడ చాలా పరిమాణంలో మూత్రం చాలాసేపు నిల్వ ఉండిపోతుంది. ఇలా దీర్ఘకాలం పాటు నిల్వ ఉంటే బ్యాక్టీరియా వృద్ధిచెంది... దాని కారణంగానే మూత్రంలో ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లు మూత్రపిండాలకీ పాకవచ్చు. ఇది కాస్త ప్రమాదకరమైన పరిణామం. మొదటిసారి ఇన్ఫెక్షన్ రావడాన్ని ‘ప్రైమరీ ఇన్ఫెక్షన్’ అంటారు. అవే ఇన్ఫెక్షన్లు మళ్లీ మళ్లీ వస్తుంటే వాటిని... ‘పర్సిస్టెంట్ బ్యాక్టీరియూరియా’ లేదా ‘రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్’ అని అంటారు. కిడ్నీల్లో వచ్చే ఇన్ఫెక్షన్ను పైలోనెఫ్రైటిస్ అంటారు. దీన్ని కొంచెం సీరియస్ సమస్యగా పరిగణించాల్సి ఉంటుంది. లక్షణాలు మూత్ర విసర్జన సమయంలో మంట, తరచూ విసర్జనకు వెళ్లాలనిపించడం, చలిజ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిర్ధారణ పరీక్షలు... సాధారణ మూత్ర సమస్యలకు పెద్దగా పరీక్షలేమీ అవసరం ఉండవు. కానీ సమస్య పదే పదే వస్తుంటే మాత్రం అందుకు కారణాలు నిర్ధారణ చేసుకోవడం కోసం కొన్ని పరీక్షలూ చేయిస్తుంటారు. సీయూఈ, యూరిన్ కల్చర్, అల్ట్రాసౌండ్ స్కానింగ్, సీటీ, ఎమ్మారై, ఎక్స్‌రే (ఐవీయూ, ఎంజీయూజీ లాంటివి), సిస్టోస్కోప్ (యూటీఐ). అవసరాన్ని బట్టి కొన్ని రక్తపరీక్షలు అవసరమవుతాయి. చికిత్స యూరినరీ ఇన్ఫెక్షన్లకు సాధారణంగా నోటి ద్వారా తీసుకునే యాంటీబయాటిక్ మందులతోనూ, అవసరాన్నిబట్టి ఒక్కోసారి అడ్వాన్స్డ్ యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి రావచ్చు. సమస్య ముదిరితే ఆసుపత్రిలో అడ్మిట్ చేసి, సమస్యకు అనుగుణంగా చికిత్స ఇస్తుంటారు. -డాక్టర్ లలిత, సీనియర్ కన్సల్టెంట్, యూరో గైనకాలజిస్ట్ చదవండి: అందమైన అమ్మాయి.. ఆమె ఓ డాక్టర్! టీనేజ్ అఫైర్‌ను గుర్తు చేసుకుని.. చివరికి Muscle Cramps: గుగ్గిల వృక్షం.. ఈ జిగురుతో కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు! రాత్రిపూట పదే పదే మూత్ర విసర్జన: కెఫిన్, శీతల పానీయాలు.. ఇంకా వీటికి దూరంగా ఉండకపోతే -
యాంటీబయోటిక్స్‌కు చికిత్స
సాక్షి, అమరావతి: ప్రాణాధార మందులు (యాంటీబయోటిక్స్) కొనుగోళ్లలో భారీ దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. దీంతో గత పదేళ్లుగా సీపీఎస్‌యూ (సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్)ల పేరుతో అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేస్తున్న దుస్థితి నుంచి రాష్ట్రానికి విముక్తి లభించింది. రాష్ట్రానికి వచ్చే చాలా రకాల యాంటీబయోటిక్స్.. సీపీఎస్‌యూలు మాత్రమే సరఫరా చేసేలా రిజర్వుడు ఐటెమ్స్‌గా ఉండేవి. సీపీఎస్‌యూలు ఎంత ధర నిర్ణయిస్తే అంతకే కొనాల్సి వచ్చేది. ఎలాంటి టెండరూ ఉండేది కాదు. ఈ విధానానికి ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం చెక్ పెట్టింది. రిజర్వుడు కేటగిరీలో ఉన్న యాంటీబయోటిక్స్ మందులను డీరిజర్వు చేస్తూ తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పుడు యాంటీబయోటిక్స్ రేట్లు 50 శాతానికి పైగానే తగ్గాయి. పదేళ్లలో రూ.200 కోట్లు నష్టం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల విలువ చేసే యాంటీబయోటిక్స్ మందులను సీపీఎస్‌యూల నుంచి కొనుగోలు చేస్తోంది. అధిక ధరల కారణంగా ఏటా రూ.20 కోట్ల వరకు రాష్ట్రానికి అదనపు భారం పడేది. ఇలా గత పదేళ్లలో ఒక్క యాంటీబయోటిక్స్ మందుల కారణంగానే రూ.200 కోట్ల వరకు ఆర్థిక భారాన్ని మోయాల్సి వచ్చింది. వీటిని డీరిజర్వు చేయడం ద్వారా ఇప్పుడు ఏటా రూ.20 కోట్లు ఆదా అవుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రాణాధార మందులను డీరిజర్వు చేయకుండా గత ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి కాంట్రాక్టర్లు భారీ లబ్ధి పొందారు. వీళ్లకు కొంతమంది నేతలు అండగా ఉండటంతో దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఇప్పుడు కూడా అదే రీతిలో యత్నించిన కాంట్రాక్టర్ల పాచికలు పారలేదు. ఇక ఎవరైనా టెండర్లలో పాల్గొనే అవకాశం.. యాంటీబయోటిక్స్ డీరిజర్వు నోటిఫికేషన్ ఇచ్చి ప్రభుత్వం టెండర్లకు వెళ్లింది. ఈ టెండరు చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. గతంలో కొనుగోలు చేసిన వాటికంటే కొన్ని మందులు వంద శాతం తక్కువ ధరకు లభించాయి. కొన్నిటిని 50 శాతం, మరికొన్నింటిని 40 శాతం తక్కువ ధరకే సరఫరా చేయడానికి ముందుకొచ్చారు. దీన్నిబట్టి ఇన్నాళ్లూ రాష్ట్రం ఎంతగా నష్టపోయిందో తెలుస్తోంది. మన రాష్ట్రంలో లేని సీపీఎస్‌యూల కోసం ఎంత అదనంగా చెల్లింపులు చేశారో అర్థమవుతోంది. కరోనా కారణంగా కొన్ని కంపెనీలు టెండరుకు రాలేకపోయాయని, భవిష్యత్‌లో మరిన్ని కంపెనీలు వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు. ఓపెన్ మార్కెట్‌కు వెళ్లినందువల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)/గుడ్ మ్యానుఫాక్చరింగ్ ప్రాక్టీస్ (జీఎంపీ) గుర్తింపు ఉన్న ఎవరైనా ఇకపై టెండర్లలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. అజిత్రోమైసిన్ కొనుగోళ్లలోనే రూ.1.28 కోట్లు మిగులు కరోనా సమయంలో ఏపీలో 40 లక్షల అజిత్రోమైసిన్ మాత్రలు కొన్నారు. ఒక్కో మాత్ర విలువ రూ.9.20. అదే మాత్ర ఇప్పుడు కొత్త రేట్ల ప్రకారం.. రూ.6కు దిగివచ్చింది. ఇంతకుముందు ఒక్కో మాత్రపైన రూ.3.20పైనే చెల్లించాల్సి వచ్చింది. అంటే.. రూ.1.28 కోట్లు అదనంగా చెల్లించారు. ఇప్పుడు ఇదంతా మిగిలినట్టే. భారీగా రేట్లు తగ్గాయి.. గతంలో సీపీఎస్‌యూల దగ్గర కొనుగోళ్ల వల్ల ఎక్కువ ధరలు చెల్లించాల్సి వచ్చేది. అందుకే ఆ విధానానికి స్వస్తి పలికాం. కొత్త విధానం ప్రకారం.. ప్రభుత్వ నిబంధనల మేరకు ఏ కంపెనీ అయినా టెండర్లలో పాల్గొనవచ్చు. తాజాగా టెండర్లకు వెళితే భారీగా రేట్లు తగ్గాయి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి మరింత చౌకగా యాంటీబయోటిక్స్ లభిస్తున్నాయి. – అనిల్‌కుమార్ సింఘాల్, ముఖ్య కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ -
కరోనా చికిత్సతో నీలి రంగులోకి శరీరం.. తర్వాత..
బీజింగ్: ప్రపంచ వ్యాప్తంగా కరనా వైరస్ బారిన పడి ప్రజలు లక్షల్లో మరణించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో కరోనా రోగులకు వైద్యం అందిస్తూ వైద్యులు సైతం మహామ్మారికి బలైపోయారు. ఈ నేపథ్యంలో చైనాలోని వుహాన్‌కు చెందిన ఓ డాక్టర్ కోవిడ్ బారిన పడి మరణించగా మరికొంతమంది కోలుకుని తిరిగి పూర్వ స్థితికి చేరుకున్నారు. అదే విధంగా యీ ఫాన్ అనే హృద్రోగ నిపుణుడు కోవిడ్-19 బాధితులకు వైద్యం అందిస్తూ మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ఆయన 39 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్సలో పోందారు. ఈ క్రమంలో ఆయన శరీరం నీలి రంగులోకి మారిపోయింది. ఆయనను చూసిన వైద్యులందరూ షాక్‌కు గురయ్యారు. చివరకు యాంటిబయాటిక్స్ మందుల వల్ల శరీరం నీలి రంగులోకి మారినట్లు గుర్తించారు. డాక్టర్ యీ ఫాన్ కూడా ఈ రంగు శాశ్వతంగా ఉండిపోతుందని భయాందోళనకు గురయ్యారు .(చదవండి: మళ్లీ లాక్డౌన్ దిశగా యూరప్ దేశాలు) ఆయన కోలుకుని డాశ్చార్జ్ అయిన అనంతరం కొన్ని నెలల తర్వాత డాక్టర్ తన మునుపటి రంగును తిరిగి పొందారు. దీంతో ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. ‘కరోనా చికిత్సలో భాగంగా ఎక్కువ మోతాదులో యాంటిబయాటిక్స్ తీసుకోవడం వల్ల నా శరీరం డార్క్ బ్లూలోకి మారింది. అదే రంగు నాకు శాశ్వతంగా ఉండిపోతుందని ఆందోళన పడ్డాను. కానీ కోలుకున్న అనంతరం కొన్ని నెలల తర్వాత నా మునుపటి రంగును పొందాను. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే కరోనా పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, మహమ్మారి చాలా ప్రమాదకరం’ అని ఆయన హెచ్చరించారు. (చదవండి: నవంబర్ 30 వరకూ అన్‌లాక్ 5.0 పొడిగింపు) -
అవి ఆరోగ్యంగా ఉంటే.. మనమూ ఉన్నట్టే!
జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను నివారించేందుకు మనకున్న మేలైన మార్గం పాడి పశువుల ఆరోగ్యాన్ని కాపాడటమేనని హెల్త్ ఫర్ యానిమల్స్ అనే సంస్థ చెబుతోంది. ఎందుకంటే కనీసం 13 వ్యాధులు మనుషుల నుంచి జంతువులకు కూడా సోకే అవకాశం ఉంది కాబట్టి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాడిపశువుల రంగానికి ఈ సంస్థ ప్రాతినిధ్యం వహిస్తుంది. పాడి పశువులు, పౌల్ట్రీ, మాంసం కోసం పెంచే మేక, గొర్రె వంటి జంతువులపై ఈ సంస్థ పరిశోధనలు చేస్తోంది. జంతువులకు అవసరమైన మందులు, వ్యాక్సిన్లను తయారు చేసే కంపెనీలు కూడా ఈ సంస్థలో భాగమే. ఏటా కొత్తగా బయటపడుతున్న ఐదు వ్యాధుల్లో మూడు జంతువుల నుంచి సంక్రమించేవే. వ్యాధుల కారణంగా ఏటా కనీసం 20 శాతం పాడిపశువులు మరణిస్తుంటాయని, దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనీసం వందకోట్ల మందిపై ఉంటుందని ఈ సంస్థ చెబుతోంది. (చదవండి: భవిష్యత్ మహమ్మారి జీ4..!) గత 12 ఏళ్లలో వ్యాధుల కారణంగా అంతర్జాతీయ స్థాయిలో ఆరుసార్లు పెద్దసంఖ్యలో పాడిపశువులు మరణించాయని, గాలికుంటు వ్యాధి, స్వైన్‌ఫ్లూ, ఏవియన్ బర్డ్ ఫ్లూ వంటి వాటి కారణంగా జరిగిన ఆర్థిక నష్టం దాదాపు ఆరు లక్షల కోట్ల రూపాయల వరకు ఉందని ఈ సంస్థ అంచనా. ఈ వ్యాధుల నియంత్రణకు, మనుషుల ప్రాణాలను రక్షించేందుకు 1995 నుంచి 2008 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు పది లక్షల కోట్ల రూపాయల వరకు ఖర్చయ్యాయి. యాంటీబయాటిక్‌లను అందివ్వడం ద్వారా జంతువ్యాధుల్ని చాలా వరకూ నివారించవచ్చునని తద్వారా వాటిని సంరక్షించుకోవడమే కాకుండా.. వాటిపై ఆధారపడ్డవారి నష్టాలను కూడా తగ్గించవచ్చునని ఈ సంస్థ చెబుతోంది. (జూనోసిస్ డే...) -
కరోనా నేపథ్యంలో యాంటీబయాటిక్స్?
యాంటీబయాటిక్స్‌ను విచ్చలవిడిగా వాడటం వల్ల ఎన్నో రకాల జబ్బులు మందుకు తమ నిరోధకత (డ్రగ్ రెసిస్టెన్స్) పెంచుకుంటున్నాయన్న విషయం మనం ఎంతోకాలంగా తెలుసు. అయినప్పటికీ మనలో చాలామంది కరోనా వైరస్ ప్రబలుతున్న ఈ కాలంలో అజిథ్రోమైసిన్ వంటి యాంటీబయాటిక్స్‌నే మళ్లీ మళ్లీ వాడుతూనే ఉన్నాం. అయితే అనవసరంగా యాంటీబయాటిక్స్ ఎందుకు వాడకూడదో... అదెంత ప్రమాదమో మరోసారి తెలుసుకుందాం. ఇకనుంచైనా అప్రమత్తంగా ఉందాం. మనకు వచ్చే సాధారణ జలుబు, దగ్గు వంటివి ప్రధానంగా వైరస్ వల్ల వస్తాయి. ఇక వైరల్ జ్వరాలూ, జలుబులూ అన్నవి ఇన్ఫ్లుయెంజా, పారా ఇన్ఫ్లుయెంజా, రైనోవైరస్, ఎడినోవైరస్, హ్యూమన్ రెస్పిరేటరీ నిన్సీషియల్ వైరస్‌లతో పాటు... కరోనా వైరస్‌తో వస్తూ ఉండటం మనకు ఎప్పట్నుంచో తెలిసిన విషయమే. అయితే... ఇక్కడ మనం పేర్కొన్న వైరస్ రకాల్లో చివరన పేర్కొన్న కరోనా వల ఇప్పుడు తాజాగా వస్తున్న నావల్ కరోనా లేదా సార్స్–సీవోవీ2 వైరస్ వల్ల వచ్చే కొత్తరకం వైరల్ జలుబు/జ్వరం అన్నది ప్రపంచంలోనే అన్ని చోట్లకూ పాకి ఓ పాండమిక్‌గా మారింది. నిన్నమొన్నటి వరకూ మనం దగ్గు, జలుబు వంటి మందులకు యాంటీబయాటిక్స్ వాడుతూనే వచ్చినట్లుగానే... ఇప్పుడు కోవిడ్–19 అనే కొత్త జబ్బును తెచ్చే ప్రస్తుత కరోనా వైరస్ ప్రబలడం మొదలు పెట్టీపెట్టగానే మళ్లీ మనం అదే పల్లవి అందుకున్నాం. అదే... హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో పాటు అజిథ్రోమైసిన్ వాడటం అనే పాత పాటనే కొత్తగా మళ్లీ అందిపుచ్చుకున్నాం. నిజానికి వైరల్ జ్వరాలకూ, ఆ సంబంధిత రుగ్మతలకు యాంటీబయాటిక్స్ ఎంతమాత్రమూ ఉపయోగకరం కాదు. అయినప్పటికీ గతంలో మనం జలుబు, దగ్గు వంటి సమస్యలకు అజిథ్రోమైసిన్, సెఫిక్సిమ్, సెపోడోక్సిమ్ వంటి యాంటీబయాటిక్స్ వాడుతూ వచ్చాం. ఇప్పుడూ అదే తరహా వాడకాన్ని కొనసాగిస్తున్నాం. విచ్చలవిడిగా మనం దురుపయోగం చేస్తున్న యాంటీబయాటిక్స్ ఇవే... మనం ఈ కింద పేర్కొన్న యాంటీబయాటిక్స్‌ను సాధారణంగా వాడేస్తూ ఉన్నాం. అవి... మాక్రోలైడ్స్ అని పిలిచేవి... అజిథ్రోమైసిన్, సెఫాలోస్పోరిన్, సెఫిక్సిమ్. ఇంజెక్షన్ ద్వారా వాడేవి... సెఫ్ట్రియాక్సోన్ వంటివి. క్వినలోన్స్ అని పేర్కొనే... అఫ్లాక్సోసిన్, సిప్రోఫ్లాక్సిన్తో పాటు... ఎరిథ్రోమైసిన్, నార్‌ఫ్లాక్సిన్, సిఫ్రాన్, సెప్ట్రాన్, మోనోసెఫ్, పైపర్‌సిలిన్, టాజోబ్యాక్టమ్ వంటి యాంటీబయాటిక్స్‌ను విచక్షణరహితంగా ఉపయోగిస్తున్నాం. సాధారణ జలుబు, దగ్గుకు అజిథ్రోమైసిన్, నీళ్లవిరేచనాలకు నార్‌ఫ్లాక్స్ వంటి మందులను చాలా మామూలుగా ఉపయోగిస్తుంటాం. ఇక ఇప్పుడు తాజాగా హైడ్రాక్సీక్లోరోక్విన్, అజిథ్రోమైసిన్ వంతు అన్నమాట. నష్టం ఎన్ని రకాలుగా అంటే... ఇలా మనం యాంటీబయాటిక్స్‌ను విచ్చలవిడిగా వాడేస్తుంటే మనకు ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఇలా మరెన్నో రకాలగా నష్టం జరుగుతుంది. అదెలాగో చూద్దాం. చర్మంపై అనేక రకాల బ్యాక్టీరియా జీవిస్తుంటాయి. వాస్తవానికి అవేవీ హాని చేసేవి కావు. అయితే యాంటీబయాటిక్స్ వాడేవారిలో చర్మంపై ఉండే ఈ హానిరహితమైన బ్యాక్టీరియా క్రమంగా తగ్గిపోతుంది. రకరకాల జబ్బుల నివారణకి మనం యాంటీ బయాటిక్స్ వాడుతున్న కొద్దీ... హానిరహిత బ్యాక్టీరియాతో పాటు హానికారక బ్యాక్టీరియా కూడా విపరీతంగా వృద్ధి చెంది అవి చర్మానికి, కొందరిలో యూరినరీ బ్లాడర్‌కూ హాని చేయవచ్చు. యాంటీబయాటిక్స్‌ను డాక్టర్లు నిర్దేశించిన కాలం పాటే వాడాలి. అలా వాడకుండా మధ్యలోనే వదిలేయడం వల్ల మనలోని హానికరమైన బ్యాక్టీరియా నిర్మూలన జరగకపోగా... వ్యాధికారక సూక్ష్మజీవులు ఆ మందు పట్ల తమ నిరోధకతను పెంచుకుంటాయి. టీబీ, శ్వాసకోశవ్యాధులు, మూత్రంలో ఇన్ఫెక్షన్స్ విషయంలోనూ ఇలా నిర్ణీతకాలంలో మందులు వాడకపోవడం వల్ల వచ్చే ప్రమాదాలు మరీ ఎక్కువ. అసలు మనం కొన్ని రకాల యాంటీబయాటిక్ కాంబినేషన్లను వాడకూడదు. కానీ ఆ కాంబినేషన్లు మనకు తెలియపోవడం వల్ల ఆన్ కౌంటర్ మెడిసిన్‌గా ఇచ్చే అనేక రకాల యాంటీబయాటిక్స్ వాడి ముప్పు పెంచుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఇక ఆర్థిక నష్టం ఎలాగంటే... మన దేహంలో యాంటీబయాటిక్స్ పట్ల నిరోధకత పెరగడం వల్ల ఇంకా ఎన్నో రకాల సూక్ష్మజీవుల వచ్చే ఇన్ఫెక్షన్లు మరింత వృద్ధి అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల హాస్పిటల్లో ఉండాల్సిన వ్యవధి పెరగాల్సి రావచ్చు. దాంతో ఆసుపత్రి ఖర్చులు తడిసి మోపెడవుతాయి. రోగ క్రిములు ఒక పట్టాన లొంగక ఒకవేళ రోగిని ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచాల్సి వస్తే... ఆ ఖర్చులూ... మరింత ప్రభావకరమైన మందులతో పాటు... అడ్వాన్స్డ్ మెడికల్ కేర్‌కు అవసరమైన వ్యయాలూ పెరుగుతాయి. ఇది ఆర్థిక నష్టం కాగా... ఒక్కోసారి ఇంతగా ఖర్చు చేసినప్పటికీ ప్రయోజనం లేక... మందుల దుష్ప్రభావాలూ, చికిత్సను తట్టుకోలేనంతగా దేహం బలహీనపడటంతో రోగి మృత్యువాత పడటం కూడా జరగవచ్చు. అవి డాక్టర్లకే తెలుసు రోగికి వచ్చిన జబ్బును బట్టి, దాని తీవ్రతను బట్టి... దానికి ఏ తరహా యాంటీబయాటిక్స్ వాడాలి, అది ఎంత మోతాదులో వాడాలి, ఆ మోతాదును ఎంత కాలం పాటు కొనసాగించాలన్న విషయాలు వైద్యులకే తెలుస్తాయి. ఈ నైపుణ్యాలను వారు తమ వైద్యవిద్యతోనూ, అనుభవంతోనూ గడిస్తారు. ఒకవేళ మందుల మోతాదును తక్కువగా ఇస్తుంటే... రోగకారక క్రిములు క్రమంగా యాంటీబయాటిక్స్ తమపై పనిచేయని విధంగా నిరోధకత (రెసిస్టెన్స్)ను పెంచుకోవచ్చు. లేదా మరీ ఎక్కువగా ఇచ్చి దానివల్ల కూడా దేహానికి ఇతరత్రా సైడ్ఎఫెక్ట్స్ కారణంగా ప్రమాదం సంభవించవచ్చు. అందుకే యాంటీబయాటిక్స్ ఉపయోగంలో కొన్ని నిర్దిష్టమైన మార్గదర్శకాలు (గైడ్‌లైన్స్) ఉంటాయి. అవి వైద్యులకే స్పష్టంగా తెలుస్తాయి కాబట్టి వారి సిఫార్సు మేరకే యాంటీబయాటిక్స్ వాడాలి. పైన చెప్పుకున్న నష్టాలను దృష్టిలో ఉంచుకుని, ఇకపై యాంటీబయాటిక్స్‌ను కేవలం డాక్టర్ల సలహాలు, సూచనలు, సిఫార్సుల మేరకే వాడాలని గుర్తుపెట్టుకుంటే భవిష్యత్తులో ఎన్నో జబ్బులు తమ తీవ్రతను పెంచుకోకుండా... తేలిగ్గానే అవి లొంగిపోయేలా చేసుకునే శక్తి మన చేతుల్లో ఉందని తెలుసుకోవడం ఎంతైనా మంచిది. విచక్షణరహితంగా ఎందుకు వాడకూడదంటే... గతంలో చాలా తేలిగ్గా... అంటే కేవలం ఓ చిన్న యాంటీబయాటిక్ వాడీ వాడగానే లేదా వాడకపోయినా కాస్త నిదానంగా తగ్గిపోయే వ్యాధులు ఇప్పుడు విపరీతంగా మొండికేస్తున్నాయి. తేలిగ్గా తుదముట్టించగల వ్యాధిక్రిములు సైతం తమ శక్తిని పెంచుకుంటున్నాయి. ఇదంతా యాంటీబయాటిక్స్‌ను దురుపయోగం చేయడం వల్లనే. ఒకప్పుడు చిన్న డోస్‌తో తగ్గేవి సైతం ఇప్పుడు డబుల్‌డోస్ ఇచ్చినా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. ఉదాహరణకు... యాంటీబయాటిక్స్‌కు నిరోధకత పెంచుకున్న క్లాస్ట్రీడియమ్ డిఫిసైల్ అనే పెద్ద పేగుల్లో పెరిగే బ్యాక్టీరియా కారణంగా వచ్చే నీళ్ల విరేచనాలు ఇప్పుడు పెద్దవయసు వారి ప్రాణాలకే ముప్పుగా పరిణమించేలా తయారయ్యాయి. గతంలో చిన్న పిల్లల్లో, పెద్దల్లో తరచూ వచ్చే సెగగడ్డలు అప్పట్లో మామూలు యాంటీబయాటిక్స్ తగ్గేవి. కానీ ఇప్పుడు అలాంటి చిన్నచిన్న గడ్డలు తేలిగ్గా తగ్గడం లేదు. అప్పట్లో యాంటీబయాటిక్స్‌కు తేలిగ్గా లొంగిపోయే.. టీబీ, క్లెబిసియెల్లా నిమోనియా, సూడోమొనాస్ వంటి సూక్ష్మక్రిములు సైతం ఇప్పుడు మరీ మొండిగా మారాయి. దాంతో గతంలో ఆయా సూక్ష్మజీవుల వల్ల తేలిగ్గా తగ్గే సమస్యలు సైతం ఇప్పుడు మొండిగా మారిపోయాయి... ఇంకా మారుతున్నాయి కూడా. దాంతో ఇది మనకు తీవ్రమైన నష్టంగా పరిణమిస్తోంది. - డాక్టర్ నందనా జాస్తి మెడికల్ స్పెషలిస్ట్, ఇంటర్నల్ మెడిసిన్ -
శుభవార్త ;అందుబాటులోకి యాంటీబయాటిక్
ఇటీవల చాలాకాలం నుంచి మనకు సరికొత్త యాంటీబయాటిక్స్ ఏవీ లభ్యం కాకపోవడం మానవాళిని ఆందోళనలో ముంచెత్తుతోంది. అలాంటి దుస్థితిని తొలగించేందుకు ‘మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’(ఎమ్ఐటీ) పరిశోధకులు నడుంకట్టారు. అక్కడి ఫలితాలూ ఆశాజనకంగానూ ఉన్నాయి. అతి త్వరలోనే మానవాళికి ‘హాలిసిన్’ పేరుతో ఓ సరికొత్త యాంటీబయాటిక్ లభ్యమయ్యే అవకాశాలు ఉన్నట్లు అక్కడి పరిశోధనల ద్వారా తెలుస్తోంది. చిన్న చిన్న ఇన్ఫెక్షన్లకు కూడా విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడేస్తూ ఉండటం మన అలవాటు. ఆన్ కౌంటర్ మెడిసిన్స్‌గా అమ్ముడయ్యే వాటిల్లో యాంటీబయాటిక్సే ఎక్కువ. దాంతో గతంలో చిన్న యాంటీబయాటిక్ వేస్తే తగ్గిపోయే వ్యాధులు కూడా మొండికేయడం మొదలుపెట్టాయి. మనం తేలిగ్గా తుదముట్టించగల వ్యాధిక్రిములూ తమ శక్తిని విపరీతంగా పెంచుకుంటూ పోయి‘ సూపర్‌బగ్స్’గా మారిపోతూ మానవాళిని బెంబేలెత్తించాయి. ఒకప్పుడు యాంటీబయాటిక్స్‌కు తేలిగ్గానే లొంగిపోయే ట్యూబర్క్యులోసిస్ (టీబీ) వంటి వ్యాధులు కలిగించే సూక్ష్మజీవులు... తమ నిరోధకశక్తిని పెంచుకొని రెసిస్టెంట్ వెరైటీ టీబీని కలిగిస్తూ సూపర్‌బగ్స్‌గా రూపొందాయి. దాంతో ప్రస్తుతం లభ్యమవుతున్న యాంటీబయాటిక్ మందులను డబుల్‌డోస్ ఇచ్చినా ఆ సూపర్‌బగ్స్‌ను నిర్మూలించలేకపోతున్నాం. ఇలాంటి దుస్ధితి వల్ల మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లే పరిస్థితులు వస్తాయేమోనని అటు వైజ్ఞానికులూ, ఇటు వైద్యవర్గాలు ఆందోళన చెందుతున్న ప్రస్తుత తరుణంలో అలాంటి సూపర్‌బగ్స్‌ను తుదముట్టించే యాంటీబయాటిక్‌కు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఓ భరోసా లభించింది. హాలిసిన్ అనే పేరుతో రాబోతున్న ఈ సరికొత్త యాంటీబయాటిక్ ఔషధం కోసం ఇప్పుడు ప్రపంచమంతా ఎదురు చూస్తోందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. -
యాంటీ‘భయో’టిక్స్
సాక్షి, హైదరాబాద్: కాయిల్స్ వెలిగించినా దోమలు వచ్చి దాని చుట్టూ ఎగురుతుంటే ఏమంటాం? దోమలకు కాయిల్స్‌ను తట్టుకునే శక్తి వచ్చిందనుకుంటాం. అంటే దోమల నివారణకు వాడే కాయిల్స్ పనిచేయడంలేదన్న మాట. అలాగే మనుషుల్లో వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మక్రిములకు కూడా యాంటీ బయోటిక్స్ మందులను తట్టుకునే శక్తి వచ్చేసింది. దీంతో జబ్బులు నయం కాకుండా పోతున్నాయి. అలా ఎన్ని యాంటీ బయోటిక్స్ మందులు వాడినా తట్టుకొని నిలబడే సూక్ష్మక్రిముల వల్ల జబ్బులు తగ్గకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా ఏడు లక్షల మంది చనిపోతున్నారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెలువరించిన నివేదికలో వెల్లడించింది. అంతేకాదు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2050 నాటికి ప్రతీ ఏడాది కోటి మంది చనిపోతారని హెచ్చరించింది. అంతేకాదు 2030 నాటికి యాంటీ బయోటిక్ పనిచేయని పరిస్థితి ఏర్పడటం, కుటుంబాల్లో ఎవరో ఒకరు చనిపోవడం తదితర కారణాలతో 2.40 కోట్ల మంది నిరుపేదలుగా మారిపోతారని పేర్కొంది. విచ్చలవిడిగా యాంటీబయోటిక్స్ వాడకంలో వివిధ దేశాలతోపాటు భారత్ కూడా ముందుంది. ఇక్కడ ఏటా లక్ష మంది వరకు చనిపోతున్నట్లు అంచనా వేస్తున్నారు. 2050 నాటికి మన దేశంలో 15 లక్షల మంది ఈ కారణంగా చనిపోతారని అంచనా. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన తాజా నివేదికను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అధ్యయనం చేస్తున్నారు. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక మెడికల్ ప్రాక్టీషనర్లు విచ్చలవిడిగా యాంటీ బయోటిక్స్ మందులను ఇస్తున్నారని, అవి పనిచేయని పరిస్థితులు ఏర్పడటంతో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని అంటున్నారు. చిన్నచిన్న జబ్బులకు అధిక డోస్.. నానాటికీ సూక్ష్మక్రిములు యాంటీ బయోటిక్స్‌కు నిరోధకత పెంచుకుని మొండిగా తయారవుతుండటంతో ఇప్పుడు చాలా రకాల వ్యాధులకు అత్యవసర మందులు కూడా పనిచేయకుండా పోతున్నాయి. చిన్నా చితకా జబ్బులకు కూడా మందుల్లేని పరిస్థితి ఏర్పడుతోంది. క్షయ, మలేరియా, గనేరియా, న్యూమోనియా, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వంటి సర్వసాధారణ వ్యాధులు కూడా పెను సమస్యలుగా పరిణమిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెప్పింది. దీనివల్ల వైద్యులు ఎప్పుడో చిట్టచివరి అస్త్రంగా వాడాల్సిన యాంటీ బయోటిక్ మందులను తొలి దశలోనే వాడేయాల్సి వస్తుంది. మరీ దారుణమైన విషయం ఏంటంటే జలుబు, దగ్గు, జ్వరం వంటివి వచ్చినా ఇప్పుడు యాంటీ బయోటిక్స్ వాడటం సాధారణమై పోయింది. సాధారణ మందులతో తగ్గే అవకాశమున్నా త్వరగా కోలుకోవాలన్న ఆతృతతో బాధితులు కూడా వైద్యులపై ఒత్తిడి తెస్తున్నారు. వైద్యులు కూడా వాటినే వాడేలా ఒత్తిడి చేస్తున్నారు. రెండు దశాబ్దాల క్రితం పెన్సిలిన్ అనే యాంటీ బయోటిక్స్ వేస్తే ఎటువంటి మొండి జబ్బు అయినా ఇట్టే తగ్గేది. కానీ అవి ఇప్పుడు పనిచేయడంలేదు. ఆ తరువాత అధిక డోస్ కలిగిన యాంటీ బయోటిక్స్ మార్కెట్లోకి వచ్చాయి. ఈ పరిస్థితి ప్రపంచానికే సవాల్‌గా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సూక్ష్మక్రిములు మన యాంటీ బయోటిక్స్‌కు నిరోధకత పెంచుకుంటూ పోతే మున్ముందు చిన్నచిన్న గొంతు ఇన్ఫెక్షన్లు, చిన్నపాటి దెబ్బల వంటివి కూడా ప్రాణాలను కబలించడం ఖాయం. తెలంగాణలో వైద్య ఆరోగ్యశాఖ అంచనా ప్రకారం దాదాపు 25 వేల మెడికల్ షాపులున్నాయి. గ్రామాల్లో అనర్హులైన అనేకమంది మెడికల్ ప్రాక్టీషనర్లూ ఉన్నారు. ప్రతి చిన్న అనారోగ్యానికి కూడా యాంటీ బయోటిక్స్ ఇవ్వడంతో అవి పనిచేయక జబ్బులు ముదురుతున్నాయి. పైగా వైద్యుల ప్రిస్కిప్షన్ లేకపోయినా మందుల దుకాణాలు యాంటీ బయోటిక్స్ మందులను ఇచ్చేస్తున్నాయి. ఈ పరిస్థితిపై వైద్య ఆరోగ్యశాఖ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. పురుగుమందుల వాడకం.. వ్యవసాయ పంటలకు విచ్చలవిడిగా పురుగుమందులను చల్లుతున్నారు. కూరగాయలు, ధాన్యపు గింజలకూ వాడేస్తున్నారు. అటువంటి ఆహార పదార్థాలను తిన్నాక మనుషుల్లోనూ వాటి ఆనవాళ్లు ఉండిపోతున్నాయి. దీంతో ఏదైనా జబ్బు వస్తే యాంటీ బయోటిక్స్ పనిచేసే పరిస్థితి ఉండటం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడించింది. దీనివల్ల కూడా మరణాలు సంభవిస్తున్నాయి. ఇక గేదెలు అధికంగా పాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో యాంటీబయోటిక్స్ విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. కోళ్లకూ వాడుతున్నారు. తద్వారా పాల ఉత్పత్తులు వినియోగించడం, చికెన్ తినడం వల్ల మనుషుల్లోనూ ఈ సూక్ష్మక్రిములు చేరుతున్నాయి. ఇది మానవాళికి ప్రమాదకరంగా మారింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక నేపథ్యంలో తెలంగాణలోనూ నిఘా ఏర్పాటుపై వైద్య ఆరోగ్యశాఖ దృష్టి సారిస్తుందని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. మన దేశంలో గుర్తించిన సమస్యలు - యాంటీబయోటిక్స్‌ను విచ్చలవిడిగా అమ్మేయడం, అవసరం లేకున్నా వాడేయడం - వేగంగా కోలుకోవాలని, తక్కువ ఖర్చులో రోగం నయం అయిపోవాలని తాపత్రయపడడం - పశువులకు ఉద్దేశించిన యాంటీ బయోటిక్స్ కూడా తేలికగా దొరకడం - వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా ఇవ్వకూడని యాంటీ బయోటిక్ మందులు మెడికల్ షాపుల్లో సులభంగా లభించడం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతిపాదనలు... - యాంటీ బయోటిక్స్ వాడకం తగ్గించేందుకు ఆయా దేశాల్లో జాతీయ స్థాయిలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. అందుకు అవసరమైన నిధులను కేటాయించాలి. - యాంటీ బయోటిక్స్ వాడకాన్ని తగ్గించేందుకు, వ్యవసాయంలో పురుగు మందులను, పశువులకు ఇష్టారాజ్యంగా ప్రేరేపిత యాంటీ బయోటిక్స్ వాడకుండా చూసేందుకు ఒక పటిష్టమైన రెగ్యులేటరీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. - యాంటీ బయోటిక్స్‌ను తట్టుకొని నిలబడుతున్న సూక్ష్మక్రిములపై యుద్ధం చేసేలా సరికొత్త పరిజ్ఞానంతో కూడిన మందులను తీసుకురావాలి. అందుకు అవసరమైన నిధులను ఆయా దేశాలు కేటాయించాలి. -
పాపకు తరచూ విరేచనాలు... ఎందుకిలా?
మా పాప వయసు పదేళ్లు. గత కొద్ది నెలలుగా పదే పదే విరేచనాలు అవుతున్నాయి. కొద్దిపాటి మందులతో తగ్గినట్లే తగ్గినా... మళ్లీ సమస్య తిరగబెడుతోంది. మరీ చెప్పాలంటే... పాప భోజనం తిన్న వెంటనే మల విసర్జనకు వెళ్లాల్సి వస్తోంది. ఎప్పుడైనా కొద్దిగా నీరసంగా ఉంటోంది. మా పాప సమస్య ఏమిటి? ఎందుకిలా జరుగుతోంది. పరిష్కారం ఉందా? మీరు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే మీ పాపకు రికరెంట్ డయేరియల్ ఎపిసోడ్స్ ఉన్నట్లు చెప్పవచ్చు. పిల్లల్లో వారు సాధారణంగా విసర్జనకు వెళ్లే టాయిలెట్స్ హాబిట్స్‌తో పోల్చినప్పుడు... వారు మలవిసర్జనకు వెళ్లాల్సిన విడతలు ఎక్కువైనా లేదా వారి క్రమబద్ధమైన వేళల్లో మార్పువచ్చినా దాన్ని డయేరియా అని నిర్వచించవచ్చు. అలాగే అది ఒకేసారి ఎక్కువగా విరేచనాలు (అక్యూట్ డయేరియా), లేదా పదే పదే విరేచనాలు కావడం లేదా దీర్ఘకాలికంగా ఉండే డయేరియా అయినా కావచ్చు. మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తూంటే మీ అమ్మాయిది రికరెంట్ డయేరియా అని చెప్పవచ్చు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. వాటిల్లో ఒకటి ఇన్ఫెక్షన్ అంటే బ్యాక్టీరియల్ లేదా ప్రోటోజోవా (అమీబిక్) కావచ్చు. లేదా నాన్ ఇన్ఫెక్షియస్ డయేరియా కూడా కావచ్చు. మీరు చెబుతున్న లక్షణాలతో మీ అమ్మాయిది నాన్ ఇన్ఫెక్షియస్ డయేరియా అయ్యేందుకు అవకాశం ఎక్కువ. ఇలాంటి కండిషన్‌కు చాలా అంశాలు కారణం కావచ్చు. ఉదాహరణకు... ►తిన్న తిండి ఒంటికి పట్టడంలో సమస్యలు (మాల్ అబ్జార్ప్షన్). ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ లేదా ప్రోటీన్స్ లేదా ఫ్యాట్ అబ్జార్ప్షన్లో సమస్యలు. ►ఎండోక్రైన్ సమస్యలు, కొన్ని ఆటో ఇమ్యూన్ సమస్యలు, నిర్దిష్టమైన ఎంజైమ్స్‌లో లోపాలు, ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజెస్ (ఐబీడీ), ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) వంటి ఏదైనా కారణం వల్ల కూడా ఆమెకు సమస్య వచ్చి ఉండవచ్చు. తిన్న తిండి ఒంటికి పట్టకపోవడం (మాల్ అబ్జార్ప్షన్) ఉన్న పిల్లల్లో నీళ్ల విరేచనాలు, పొట్ట ఉబ్బరంగా ఉండటం, ఎదుగుదల లోపాలు రావడం, కడుపునొప్పి ఎక్కువగా ఉండటం, దుర్వాసనతో కూడిన మలం, కొన్నిసార్లు ముఖం–కాళ్లూ చేతుల్లో వాపురావడం, కొన్ని విటమిన్ (ముఖ్యంగా ఎ, డి, ఈ, కె, బి12) లోపాలతో కనిపించే లక్షణాలు ఎక్కువగా చూస్తుంటాం. కొన్ని అరుదైన ఉదంతాల్లో కౌమార వయసులో (అడాలసెంట్) పిల్లల్లో కెఫిన్ పాళ్లు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకున్నప్పుడు లేదా చాలా ఎక్కువగా శారీరక శ్రమ చేసినప్పుడు, రుతుస్రావంలో మార్పుల (మెనుస్ట్రువల్ డిస్టర్బెన్సెస్)తో కూడా డయేరియా లక్షణాలు కనిపిస్తుంటాయి. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే మీ పాపకు ఉన్న రికరెంట్ డయేరియాకు కారణం చెప్పడానికి కూలంకషమైన పరీక్షలు, డిటెయిల్డ్ స్టూల్ ఇవాల్యుయేషన్, హార్మోన్స్, ఎంజైమ్స్ అండ్ ఇమ్యూనోగ్లోబ్యులిన్ ఎస్సేతో పాటు... అవసరమనిపిస్తే తప్పనిసరిగా కొలనోస్కోపీ, ఎండోస్కోపీ చేయించడం కూడా ముఖ్యం. ఇటువంటి పిల్లల్లో ఆహారంలో మార్పులు – అంటే ముఖ్యంగా వాళ్లకు ఏది సరిపడటం లేదో, లేదా ఏది తింటే సరిగా జీర్ణం కావడం లేదో గుర్తించి, ఆ ఆహారంలో మార్పులు చేయడంతో పాటు కొవ్వు పదార్థాలు, మసాలాలు తగ్గించడం వల్ల చాలావరకు మెరుగుదల కనిపిస్తుంది. కొన్ని ఎంజైమ్ సప్లిమెంట్లు ఇవ్వడంతో పాటు వైటమిన్లు, జింక్ ఇవ్వడం, యాంటీమొటిలిటీ డ్రగ్స్ (పేగుల కదలికలను తగ్గించే మందులు), యాంటీ సెక్రిటరీ డ్రగ్స్ (జీర్ణవ్యవస్థలో ఊరే రసాయనాలను తగ్గించే మందులు), అబ్జార్బెంట్స్, ప్రోబయాటిక్స్ (శరీరంలో మేలు చేసే బ్యాక్టీరియాను పెంచే మందులు) ఇవ్వడం వల్ల పాపకు డయేరియా లక్షణాలు తగ్గుతాయి. అయితే ఇలా విరేచనాలు ఎక్కువగా అవుతున్నప్పుడు కారణం లేకుండా యాంటీబయాటిక్స్ వాడటం జరిగితే వ్యాధి తీవ్రత మరింత పెరగడానికి (యాంటీబయాటిక్ ఇండ్యూస్డ్ డయేరియాకు) దారితీయవచ్చు. కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన చెందకుండా ఒకసారి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదించి మీ పాప సమస్యకు తగిన చికిత్స తీసుకోండి. ముర్రుపాలు,తల్లిపాలు, పోతపాలు –ప్రయోజనాలు కొత్తగా తల్లి అయిన చాలామందిలో ఒక సందేహం ఉంటుంది. మొదట ఊరిన పాలు (ముర్రుపాలు) పట్టించాల్సిందేనని కొందరు, అవి బిడ్డకు మంచిది కాదని మరికొందరు అంటుంటారు. కానీ బిడ్డకు ముర్రుపాలు తప్పక తాగించాలి. బిడ్డ పుట్టిన తర్వాత తల్లిలో ఊరే ముర్రుపాలను కొలెస్ట్రమ్ అంటారు. ఈ ముర్రుపాలలో చాలా శక్తిమంతమైన యాంటీబాడీస్ ఉంటాయి. అవి బిడ్డలోని రోగనిరోధకశక్తిని స్వాభావికంగా పెంచుతాయి. ఆ నేచురల్ ఇమ్యూనిటీ వల్ల జీవితకాలంలో బిడ్డ ఎన్నో ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని సమకూర్చుకుంటుంది. అంతేకాదు... వయసు పెరిగాక కనిపించే ఎన్నో జబ్బులు... ఈ ముర్రుపాల కారణంగా రాకపోవచ్చు లేదా చాలా ఆలస్యం రావచ్చు. అందుకే బిడ్డకు ముర్రుపాలు తప్పక పట్టించాలి. ఇక ఆ తర్వాత కూడా పిల్లలకు సాధ్యమైనంతవరకు తల్లిపాలే ఇవ్వాలి. కేవలం తల్లికి తగినన్ని పాలు పడనప్పుడు మాత్రమే పోతపాలకు వెళ్లాలి తప్ప... ఒకవేళ తల్లి దగ్గర పుష్కలంగా పాలు ఉంటే పిల్లలకు కడుపు నిండా తల్లిపాలు తాగించడం మంచిది. దీనివల్ల బిడ్డలకు ఎన్నో లాభాలు చేకూరుతాయి. బిడ్డల్లో రోగనిరోధక శక్తి పెరగడం, వాళ్లు పెద్దయ్యాక వచ్చే అనేక డీజనరేటివ్ డిసీజెస్ ఆలస్యం కావడం వంటి ప్రయోజనాలు తల్లిపాల వల్ల సమకూరుతాయి. మరి పోతపాలు వాడవచ్చా? ఇటీవలి కొన్ని నిరూపితమైన అధ్యయనాల ప్రకారం... పోతపాల (యానిమల్ మిల్క్)పై పెరిగే పిల్లల్లో కడుపునొప్పి వంటి ఉదరసంబంధమైన సమస్యలు, ఆస్తమా వంటి అలర్జిక్ వ్యాధులు ఎక్కువగా వస్తాయని తేలింది. పిల్లల్లో చెవి ఇన్ఫెక్షన్లు, స్థూలకాయం వంటి అనేక సమస్యలకు కూడా పోతపాలు ఒక ప్రధాన కారణమని కూడా తెలుస్తోంది. పైగా ఇటీవల పశువుల్లో పాల ఉత్పత్తి పెంచడానికి అనేక హార్మోన్లు, మందులు, యాంటీబయాటిక్స్ ఉపయోస్తున్నారు. కాబట్టి ఇలాంటి పాలపై పెరిగిన పిల్లల్లో వాళ్ల దీర్ఘకాలిక ఆరోగ్యంపై ఆ రసాయనాల దుష్ప్రభావం కనిపిస్తోంది. కాబట్టి పోతపాలు వాడటం సరికాదు. ఒకవేళ తల్లికి తగినన్ని పాలు పడకపోవడం లేదా బిడ్డకు పాలుసరిపడకపోవడం వంటి పరిస్థితుల్లో (అంటే లాక్టోజెన్ ఇన్టాలరెన్స్, ప్రోటీన్ ఇన్టాలరెన్స్ వంటి సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే). మార్కెట్లో దొరికే కొన్ని ఫార్ములా ఫీడ్స్ ఉపయోగించవచ్చు. కానీ తల్లి వద్ద సరిపడా పాలు లేనప్పుడు పోత పాలు లేదా ఆవు లేదా గేదె పాలు పట్టించడం కంటే తల్లిలోనే పాలు పెరిగేలా కొన్ని స్వాభావిక విధానాలు (ప్రోటీన్లు పుష్కలంగా ఉండే పుష్టికరమైన ఆహారం ఇవ్వడం వంటివి) అనుసరించడం మంచిది. అలా చేయడం వల్ల కూడా తల్లిలో పాలు పడకపోతే అప్పుడు మాత్రమే డాక్టర్ సలహామేరకు తల్లిలో పాలు పెరిగేందుకు కొన్ని మందులు ఉపయోగించాల్సి ఉంటుంది. అందుకే... ముర్రుపాలు తప్పనిసరి. తల్లిపాలు కంపల్సరీ. తల్లి దగ్గర తగినన్ని పాలు లేనప్పుడు మాత్రమే పోతపాలు. పాపకు నోట్లో పుండ్లు... తగ్గేదెలా? మా పాప వయసు ఏడేళ్లు.ఈమధ్య ఒకసారి గొంతులో నొప్పి ఉందని చెప్పింది. వెంటనే డాక్టర్‌కు చూపించాం. పాప నోట్లో, నాలుక మీద, గొంతులోపలా పుండ్లలాగా వచ్చాయి. గొంతులో ఇన్ఫెక్షన్లా కొంచెం పుండులాగా ఎర్రబారింది. ఏదైనా తినడానికి పెడితే గొంతులో నొప్పి అంటూ ఏడుస్తోంది. ఏమీ తినలేకపోతోంది. మా పాప సమస్యకు పరిష్కారం చూపండి. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు పదే పదే నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్స్) వస్తున్నాయని తెలుస్తోంది.ఈ సమస్యను చాలా సాధారణంగా చూస్తుంటాం. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు... ఉద్వేగాలపరమైన ఒత్తిడి బాగా నీరసంగా అయిపోవడం ∙విటమిన్లు, పోషకాల లోపం... (ఇందులోనూ విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్‌ల వంటి పోషకాలు లోపించడం) వైరల్ ఇన్ఫెక్షన్లు (ముఖ్యంగా హెర్పిస్ వంటివి) గాయాలు కావడం (బ్రషింగ్‌లో గాయాలు, బాగా ఘాటైన పేస్టులు, కొన్ని ఆహారపదార్థాల వల్ల అయ్యే గాయాల కారణంగా). పేగుకు సంబంధించిన సమస్యలు, రక్తంలో మార్పులు, గ్లూటిన్ అనే పదార్థం పడకపోవడం, తరచూ జ్వరాలు రావడం... వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యల వల్ల పిల్లలకు తరచూ నోటిలో పుండ్లు వస్తుంటాయి. లెటర్లో చెప్పిన కొద్ది పాటి వివరాలతో నిర్దిష్టంగా ఇదీ కారణం అని చెప్పలేకపోయినా... మీ పాపకు విటమిన్ల వంటి పోషకాల లోపం లేదా తరచూ వచ్చే ఇన్ఫెక్షన్స్తో ఈ సమస్య వస్తున్నట్లు విశ్లేషించవచ్చు. ఇలాంటి పిల్లలకు నోటిలో బాధ తెలియకుండా ఉండేందుకు పైపూతగా వాడే మందులు, యాంటిసెప్టిక్ మౌత్ వాష్‌లు, విటమిన్ సప్లిమెంట్స్ వాడాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లల్లో చాలా అరుదుగా స్టెరాయిడ్ క్రీమ్స్ వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది. మీరు మరోసారి మీ పిల్లల వైద్య నిపుణుడినిగానీ లేదా దంత వైద్య నిపుణుడినిగానీ సంప్రదించి వారి ఆధ్వర్యంలో తగిన చికిత్స తీసుకోండి. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్,రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
ఏ రొయ్యలో ఏ'మందో'..
పశ్చిమగోదావరి, భీమవరం టౌన్: రొయ్యల ఇగురు.. చూడగానే ఎవరికైనా లొట్టలేస్తూ తినేయాలనిపిస్తుంది. ఇక ఆక్వాకు పేరుపడ్డ పశ్చిమగోదావరి జిల్లాల్లో రొయ్యల వంటకాలు భోజన ప్రియుల నోరూరిస్తుంటాయి. అయితే కొందరు ఆక్వా రైతులు ఇష్టానుసారం యాంటీ బయాటిక్స్ వాడడంతో రొయ్యల్లో ఉండిపోతున్న వాటి అవశేషాలు మన శరీరంలోకి నేరుగా చేరి అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. యాంటీ బయోటిక్స్ మన శరీరంలోకి ప్రవేశిస్తున్నా అంతకుముందే వాటిని గుర్తించే వ్యవస్థ మన వద్ద లేదు. జిల్లాలో యాంటీ బయోటిక్స్‌ను విచ్చలవిడిగా వాడుతూ వేలాది టన్నుల రొయ్యలు ఉత్పత్తి చేస్తూ విక్రయిస్తున్నా పట్టించుకునే వారు లేరు. ప్రజారోగ్యంతో చెలగాటమాడే మందుల తయారీ సంస్థలపై చర్యలు లేవు. సరుకు తిప్పిపంపాక అప్రమత్తం నిషేధిత యాంటీబయోటిక్స్‌పై రైతులకు అవగాహన లేక దుకాణాల నుంచి వాటిని ద్రావణం, పొడి రూపంలో తెచ్చి చెరువుల్లో వాడుతున్నారు. మన జిల్లా నుంచి కంటైనర్లలో విదేశాలకు ఎగుమతి చేసిన రొయ్యల నాణ్యతను అక్కడ పరీక్షించి వాటిలో యాంటీబయోటిక్స్ అవశేషాలు గుర్తిస్తే సరకును వెనక్కి తిప్పి పంపుతున్నారు. పంపే ముందు నాణ్యత పరీక్షించడం, రైతులు యాంటీ బయాటిక్స్ వాడకుండా అవగాహన కల్పించడం చేయకుండా తిప్పిపంపాక అధికార యంత్రాంగం అప్రమత్తమవుతుంది. గతంలో పలుమార్లు తిప్పిపంపిన విదేశాలు మన రొయ్యలను విదేశాలు వెనక్కి పంపడం కొత్త కాదు. ఏడాది క్రితం అమెరికా, యూరోపియన్ దేశాలు తిరస్కరించిన రొయ్యల్లో 11 కంటైనర్లు పశ్చిమగోదావరి జిల్లాకు చెందినవే. ఇటీవల అమెరికా, యూరప్ దేశాల నుంచి రాష్ట్రానికి 9 కంటైనర్ రొయ్యలు తిరిగి రాగా.. వీటిలో జిల్లాకు చెందిన కంటైనర్లు రెండు ఉన్నాయి. మత్స్యశాఖ జిల్లా సంయుక్త అధికారిణి ఎస్.అంజలి, ఎంపెడా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు ఈ కంటైనర్లు వచ్చిన విషయాన్ని ఈ నెల 6న ఆకివీడులో జరిగిన ఆక్వా సదస్సులో ప్రస్తావించారు. రొయ్యల సాగులో ఎంతో పురోగతి సాధిస్తున్నామని చెప్పుకుంటున్నా రొయ్యల్లోని యాంటీ బయాటిక్స్‌ను ముందుగా గుర్తించడంలో మనవద్ద ఉన్న సాంకేతికత అంతంతమాత్రమే. దశాబ్దంన్నర క్రితం మన రొయ్యల్లో యాంటీ బయోటిక్స్ అవశేషాలను గుర్తించిన ఆస్ట్రేలియా నేటికి దిగుమతి చేసుకోవడం లేదు. పరిజ్ఞానం అంతంతమాత్రమే రొయ్యల ఉత్పత్తిలో యాంటీబయోటిక్స్ అవశేషాలను గుర్తించే పరిజ్ఞానం మన వద్ద అంతంత మాత్రంగా ఉంది. పట్టుబడికి ముందు ఫ్రీ హార్వెస్ట్ టెస్ట్ (పీహెచ్‌టీ) చేస్తారు. ఎంపెడా ఆధ్వర్యంలో రాష్ట్రంలో 7 చోట్ల ఇలాంటి ప్రయోగశాలలున్నాయి. భీమవరం ఒకటి, నెల్లూరులో (లిక్విడ్ క్రొమిటోగ్రఫీ మాస్ స్పెక్ట్రోమెట్రిక్) ఒక ప్రయోగశాల ఉన్నాయి. యాంటీ బయోటిక్స్‌తో ముప్పు కొన్ని జాతుల సూక్ష్మజీవుల్ని ఉపయోగించి వాటి జీవన ప్రక్రియ ఆధారంగా తయారు చేసే రసాయనిక మందులే ఈ యాంటీ బయాటిక్స్. ఇవి మిగిలిన సూక్ష్మజీవుల పెరుగుదలను నియంత్రిస్తాయి. వాటి ప్రభావం 21 రోజుల వరకూ మాత్రమే ఉండాలి. ప్రస్తుత యాంటీబయోటిక్స్ ప్రభావం అంతకు మించి ఉంటున్నాయి. అలాంటి రొయ్యలు తినడంతో మానవ శరీరంలోకి యాంటీబయోటిక్స్ అవశేషాలు ప్రవేశిస్తున్నాయి. అలాంటి రొయ్యలతో రోగాలు ఫ్రీ క్లోరామ్ఫెనికాల్, ప్యూరాజోలిడాన్ తదితర మందుల వల్ల అప్లాస్టిక్ ఎనిమియా తరహా వ్యాధులు వస్తాయి. జీర్ణకోశంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఎముక మూలుగులో రక్త తయారీ ప్రక్రియ నిలిచిపోయి రక్తహీనతకు గురవుతాం. నిషేధిత యాంటీబయోటిక్స్ శరీరంలో ఉంటే మరే మందులు పనిచేయవు. ఒక్కోసారి క్యాన్సర్‌కు దారితీయవచ్చని వైద్య నిపుణులు ఇప్పటికే గుర్తించారు. అనుమతి లేకుండా.. రొయ్యలకు మేలు చేసేందుకు నీటిలో, మేతలో, చెరువు నేలలో వాడే ప్రోబయోటిక్స్ ఉన్నాయి. ఈ పేరు చెప్పి యాంటీబయోటిక్స్ అమ్మకాలు సాగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సరైన ప్రమాణాలు పాటించకుండా హేచరీల్లో రొయ్య పిల్లల ఉత్పత్తితో యాంటీబయోటిక్ అవశేషాలు బయటపడుతున్నాయి. పొలాల్లో పురుగుమందుల వాడకంతో వ్యర్థ జలాలు పంట కాల్వలు, బోదెల్లోకి ప్రవేశించడం, ఆ నీరు రొయ్యల చెరువులకు మళ్లించడంతో కూడా ఈ అవశేషాలు కనిపిస్తున్నట్లు గుర్తించారు. ఆక్వా ఉత్పత్తుల పెంపకంలో మొత్తం 20 రకాల యాంటీ బయోటిక్స్‌ను నిషేధించారు. 1. క్లోరామ్ఫెనికాల్ 2. నెట్రోప్యూరాన్స్, ప్యూరాజోలిడాన్, నెట్రోప్యూరాజోన్, ప్యూరాల్టోడాన్, నెట్రో ప్యూరాన్టాయిన్, ప్యూరైల్ ప్యూరామైడ్, నెప్యూరటల్, నెపురోగ్జిమ్, నైఫర్ప్రజైన్, వాటి నుంచి వచ్చే ఉత్పాదనలు 3. నియోమైసిన్ 4. నాలిడిక్సిక్ ఆసిన్ 5. సల్ఫా మిథాక్వోజిల్ 6. అరిస్టాలోకియా మొక్కల నుంచి తయారు చేసే మందు 7. క్లోరోఫాం 8. క్లోర్ప్రోమజైన్ 9. కోల్చిసిన్ 10. డాప్సోన్ 11. డైమిట్రీ డాజోల్ 12. మెట్రోనిడాజోల్ 13. రోనిడాజోల్ 14. ఇప్రానిడాజోల్ 15. ఇతర నైట్రోమిడాజోల్స్ 16. క్లెన్ బ్యుటరాల్ 17. డైఇథైల్ స్టిల్ బిన్స్టిరాల్ 18. సల్ఫోనమైడ్ 19. ఫ్లోరిక్వినోలోన్స్ 20. గ్లైకోపెప్టిడ్స్ -
బొక్కలేని ముక్క.. ఎంచక్కా!
సాక్షి, హైదరాబాద్ : మాంసం ప్రియులకు శుభవార్త.. ఎముక(బొక్క).. కొవ్వు లేని మాంసం త్వరలో మీ జిహ్వచాపల్యాన్ని తీర్చనుంది. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ(సీసీఎంబీ) శాస్త్రవేత్తలు ప్రయోగాత్మ కంగా టిష్యూ ఇంజనీరింగ్, జీనోమ్ ఎడిటింగ్ టెక్నాలజీ ఆధారంగా క్లీన్మీట్ తయారీకి శ్రీకారం చుట్టారు. ఈ సంవత్సరం చివరికి సుమారు టన్ను మాంసం అందుబాటులోకి రానున్నట్లు విశ్వస నీయంగా తెలిసింది. ఈ ప్రయోగం సఫలమై వినియోగదారులకు క్లీన్ మీట్ అందుబాటులోకి వస్తే మాంసం ప్రియులకు పండగేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎలా తయారు చేస్తారంటే.. మేక లేదా కోడి శరీరభాగాల నుంచి కణజాలాన్ని సేకరించి ప్రయోగశాలలో సంరక్షాలను అందజేసి ఈ విధానంలో మాంసాన్ని తయారు చేస్తారు. ఇది సాధారణ మాంసంలానే తాజాగా, రుచిగా ఉంటుందట. ధర కూడా సాధారణ మాంసం ఎంత ధర ఉంటుందో అంతే ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మాంసంలో సూక్ష్మ జీవ నాశకాలు(యాంటీ బయాటిక్స్), వృద్ధి హార్మోన్ల ఉనికి ఉండదని, దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ ఇండియా, సీసీఎంబీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ మాంసాన్ని ప్రయోగ శాలలో తయారు చేస్తున్నారు. ఈ మాంసంలో బ్యాక్టీరియా ఉనికి కూడా ఉండదని చెబుతుండటం గమనార్హం. రాజస్తాన్‌లో శాకాహారులే అధికం రాజస్తాన్‌లో శాకాహారులు అత్యధిక సంఖ్యలో ఉండటం విశేషం. ఆ రాష్ట్రంలో 73.2 శాతం మంది పురుషులు, 76.6 శాతం మంది మహిళలు శాకాహారులే. హరియాణాలో 68.5 శాతం మంది పురుషులు, 70 శాతం మంది మహిళలు.. పంజాబ్‌లో 65.5 శాతం మంది పురుషులు, 68 శాతం మంది స్త్రీలు శాకాహారాన్నే ఇష్టపడుతున్నారు. గ్రామీణ భారతీయుల్లో 6.4 శాతం మంది మటన్.. 21.7 శాతం మంది చికెన్.. 26.5 శాతం మంది చేపలు.. 29.2 శాతం మంది గుడ్లు తింటున్నట్లు ఎన్ఎస్ఎస్ఓ డేటా చెబుతోంది. పట్టణాల్లో 21 శాతం మంది మటన్.. 21 శాతం మంది చేపలు.. 27 శాతం మంది చికెన్.. 37.6 శాతం మంది గుడ్లను వినియోగిస్తున్నారట. జాతీయ స్థాయి సగటు కంటే అధికం.. జాతీయ స్థాయిలో ఏటా సరాసరిన ఒక్కో వ్యక్తి మాంసం వినియోగం 3.2 కిలోలుగా ఉంది. ప్రపంచ సరాసరి మాత్రం 38.7 కిలోలుగా ఉంది. అమెరికాలో అయితే ఏటా ఒక్కో వ్యక్తి 125 కిలోల మాంసాన్ని సరాసరిన వినియోగిస్తున్నట్లు తేలడం విశేషం. జాతీయ స్థాయి సగటు కంటే చికెన్ వినియోగం తెలంగాణలో అధికంగా ఉండటం విశేషం. జాతీయ స్థాయిలో ఏటా ఒక్కో వ్యక్తి సరాసరిన 3.2 కిలోల మాంసం, 65 గుడ్లను వినియోగిస్తుండగా.. తెలంగాణలో 6.5 కిలోల మాంసం.. 90 గుడ్లను వినియోగిస్తున్నారు. హైదరాబాద్ విషయానికి వస్తే ఏటా ఒక్కో వ్యక్తి సగటున 7.5 కిలోల మాంసం, 100 గుడ్లను లాగించేస్తున్నట్లు అంచనా. కృత్రిమ మాంసంతో ఉపయోగాలివే.. దేశంలో ఏటా పెరుగుతోన్న మాంసం డిమాండ్‌ను తీర్చవచ్చు. కొవ్వు, ఎముకలు లేకపోవడంతో పోషకాహారంలా ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ సమస్య ఉండదు. తక్కువ భూమి, నీరు వినియోగంతో ఈ మాంసాన్ని తయారుచేయవచ్చు. లక్షలాది మూగజీవులను చంపే అవసరం ఉండదు. గుడ్లు, చికెన్ వినియోగం పెరగాలి పోషక విలువలు అధికంగా ఉండే గుడ్ల వినియోగం ఏటా ఒక్కో వ్యక్తికి 118కి పెరగాలని జాతీయ పోషకాహార సంస్థ సూచించింది. చికెన్ వినియోగంలో సైతం జాతీయస్థాయి సగటు 15 కిలోలకు పెరగాల్సి ఉంది. – రంజిత్‌రెడ్డి, తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దేశంలో మాంసం వినియోగం ఇలా.. మాంసం వినియోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలుస్తోంది. మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. 2016–17 మధ్యకాలంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో అత్యధిక సంఖ్యలో మాంసాహారులు ఉన్నట్లు ఎన్ఎస్ఎస్ఓ(నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్) అధ్యయనంలో తేలింది. ఇందులోనూ.. పురుషుల్లో 98.8 శాతం, మహిళల్లో 98.6 శాతం మంది మాంసాహారులే. మాంసాహారులు ప్రధానంగా మటన్, చికెన్, చేపల వంటకాలనే ఇష్టపడుతున్నారు. మాంసాహారుల విషయంలో రెండో స్థానంలో నిలిచిన పశ్చిమబెంగాల్లో 98.7 శాతం, ఏపీలో 98.4 శాతం, ఒడిశాలో 97.7 శాతం, కేరళలో 97.4 శాతం మంది పురుషులు మాంసాహారులే. ఏటా తెలంగాణలో 4.47 లక్షల మెట్రిక్ టన్నులు, ఏపీలో 5.27 లక్షల మెట్రిక్ టన్నుల మాంసం ఉత్పత్తి అవుతోంది. -
విచ్చలవిడిగా వాడేస్తున్నారు
లండన్ : యాంటీబయాటిక్స్ వాడకం ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరుగుతుండటంతో ఇవి నిరుపయోగంగా మారతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో సంపన్నదేశాల్లో అధికంగా వాడే యాంటీబయాటిక్స్‌ను ఇప్పుడు పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విచ్చలవిడిగా వాడుతున్నారని 76 దేశాల్లో చేపట్టిన అథ్యయనంలో వెల్లడైంది. 2015లో రోజుకు ప్రపంచవ్యాప్తంగా 3500 కోట్ల డోసులు వాడారని ప్రిన్స్టన్ యూనివర్సిటీ చేపట్టిన అథ్యయనంలో తేలింది. గత 15 ఏళ్లలో యాంటీబయాటిక్స్ వాడకం 40 శాతం పెరిగింది. స్పెయిన్, గ్రీస్ దేశాల్లో యాంటీబయాటిక్స్ వాడకం ఎక్కువగా ఉండగా, భారత్, పాకిస్తాన్ వంటి ఆసియా దేశాల్లోనూ వీటి వాడకం గత 15 ఏళ్లలో విపరీతంగా పెరిగిందని పరిశోధకులు తెలిపారు. స్పెయిన్, గ్రీస్ దేశాల్లో ప్రిస్క్రిప్షన్ లేకుండానే యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తున్నారని పరిశోధన నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాక్టీరియాతో తలెత్తే ఇన్ఫెక్షన్లకు చికిత్సలో యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి ఉండగా, వైరస్ వల్ల వచ్చే చెవి ఇన్ఫెక్షన్లు, ఫ్లూ వంటి వాటికి సైతం అనవసరంగా యాంటీబయాటిక్స్‌ను ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. యాంటీబయాటిక్స్‌ను పరిమితుల మేరకే వాడాలని, అనవసరంగా వీటిని తీసుకుంటే అవి పనిచేయకపోగా ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయని పరిశోధనకు నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్ అంట్వెర్ప్ మైక్రోబయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ హెర్మన్ గూసెన్స్ చెప్పారు. యాంటీబయాటిక్స్ విచ్చలవిడి వాడకాన్ని నియంత్రించేందుకు మార్గాలను అన్వేషించాలని, తప్పని పరిస్థితుల్లోనే వీటిని వాడేలా మార్గదర్శకాలు రూపొందించాలని అథ్యయన నివేదిక రూపొందించిన అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్ ప్రతినిధి డాక్టర్ ఎలి క్లెన్ చెప్పారు. -
‘యాంటీ బయాటిక్’ బాంబు!
లండన్: బహుళజాతి ఫార్మాసూటికల్ సంస్థలు ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే మిలియన్ల కొద్దీ యాంటీ బయాటిక్స్‌ను భారత్‌లో అమ్ముతున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. వీటిని విచ్చలవిడిగా వాడటం ద్వారా వ్యాధికారక సూక్ష్మజీవులు యాంటి బయాటిక్స్‌ను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయని బ్రిటన్‌లోని క్వీన్ మేరీ వర్సిటీ ఆఫ్ లండన్ పరిశోధకులు తెలిపారు. బహుళజాతి ఫార్మా కంపెనీలు భారత్‌లో ఇష్టానుసారంగా యాంటీ బయాటిక్స్‌ను ఉత్పత్తి చేయకుండా నిలువరించడంలో ఔషధ నియంత్రణ సంస్థలు విఫలమయ్యాయన్నారు. ఈ అధ్యయనంలో భాగంగా 2007 నుంచి 2012 వరకూ భారత ఔషధ నియంత్రణ సంస్థ రికార్డులతో పాటు దేశవ్యాప్తంగా యాంటీ బయాటిక్స్ అమ్మకాల వివరాలను సేకరించినట్లు పరిశోధనలో పాల్గొన్న మెక్గెట్టిగన్ తెలిపారు. భారత్‌లో 118 రకాల ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ (ఎఫ్డీసీ)ను అమ్ముతున్నట్లు వెల్లడించారు. ఈ సంఖ్య అమెరికా, బ్రిటన్లలో కేవలం ఐదుగానే ఉందన్నారు. మొత్తం 118 రకాల ఎఫ్‌డీసీల్లో 63 శాతం డ్రగ్స్‌ను ఎలాంటి అనుమతులు లేకుండానే భారత్‌లో అమ్ముతున్నారని పేర్కొన్నారు. ఇందుకు విరుద్ధంగా మొత్తం 86 సింగిల్ డ్రగ్ ఫార్ములేషన్(ఎస్డీఎఫ్)ల్లో 93 శాతం మందులకు ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఉందన్నారు. -
భారీగా ధర తగ్గనున్న మందులు ఇవే..
న్యూఢిల్లీ: మన దైనందిన జీవితంలో ఉపయోగించే కొన్ని మందుల ధరలు భారీగా తగ్గనున్నాయి. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రై సింగ్ అథారిటీ (ఎన్‌పీపీఎ) తాజాగా నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. యాంటీబయాటిక్స్, యాంటీఇన్ఫ్క్టివ్స్, అనాల్జేసిక్స్, విటమిన్ మందులు, యాంటీఫంగల్ మందులతో కూడిన మొత్తం 100కుపైగా మందుల రేట్లు 3 శాతం మేర తగ్గనున్నాయి. దీంతో గత ఏడాది 4 శాతం పెరిగిన ఈ మందులు ప్రస్తుతం తిరిగి మామూలు ధరకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిర్ణయించిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని వీటికి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే ఏప్రిల్ 15లోగా ఎన్పీపీఏ తెలియజేయాలని ఎన్పీపీఏ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే మార్కెట్లోకి విడుదలై ఎక్కువ రేటును ముద్రించి ఉన్న మందుల డబ్బును సంబంధిత కంపెనీలు డీలర్లకు తిరిగి అందిస్తాయని తెలిపారు. కాగా భారతీయ ఫార్మాస్యూటికల్ మార్కెట్ విలువ లక్ష కోట్ల రూపాయలు. ఎన్పీపీఏ ప్రకటించిన జాబితాలో ఉన్న మందుల సంవత్సర ఆదాయం రూ.4,839కోట్లు కాగా, రేట్లు తగ్గిన కారణంగా రూ.647 కోట్ల ఆదాయన్ని కంపెనీలు కోల్పోనున్నాయి. వీటిలో కేవలం గుండె సంబంధిత వ్యాధుల మందులు రూ.250 కోట్లను కోల్పోనున్నట్టు తెలుస్తోంది.