టోర్నడో విధ్వంసం.. ఇళ్లు, భవనాలు నేలమట్టం.. దృశ్యాలు వైరల్‌ | Tornado Hit Village Of Bihucourt In Northern France Video Viral | Sakshi
Sakshi News home page

టోర్నడో బీభత్సంతో ఇళ్లు, భవనాలు నెలమట్టం.. వీడియో వైరల్‌

Published Mon, Oct 24 2022 3:20 PM | Last Updated on Mon, Oct 24 2022 3:20 PM

Tornado Hit Village Of Bihucourt In Northern France Video Viral - Sakshi

పారిస్‌: ఉత్తర ఫ్రాన్స్‌ ప్రాంతంలోని బిహుకోర్ట్‌ అనే గ్రామంలో మినీ టోర్నడో బీభత్సం సృష్టించింది. సుడిగాలి ధాటికి గ్రామంలోని పదుల సంఖ్యలో ఇళ్లు, భవనాలు ధ్వంసంమయ్యాయి. ఆ ప్రాంతంలో అకాలంగా వేడి వాతావరణం ఏర్పడి ఆ తర్వాత టోర్నడోగా మార్పు చెందినట్లు అధికారులు తెలిపారు. టోర్నడో విధ్వంసం దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 

బిహుకోర్టు గ్రామంపై గగనంలో ఆదివారం సాయంత్రం నల్లటి మేఘాలు కమ్ముకుని ఆ తర్వాత సుడిగాలి వీచినట్లు పలువురు సోషల్‌ మీడియాల్లో వీడియోలు షేర్‌ చేశారు. ఈ టోర్నడో బీభత్సంలో ఒకరు తీవ్రంగా గాయపడినట్లు పాస్‌ డీ కలాయిస్‌ ప్రాంత అధికార యంత్రాంగం తెలిపినట్లు రాయిటర్స్‌ వెల్లడించింది. ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొంది. కొన్ని సంవత్సరాలుగా టోర్నడోలు ఈ ప్రాంతాన్ని ధ్వంసం చేస్తున్నాయని అక్కడి ‍ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: పెళ్లైన మరుసటి రోజే డబ్బు, నగలతో వధువు పరార్‌.. వరుడికి ఫోన్‌ చేసి..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement