సుడిగాలి శివాలు
- విశాఖలో పిడుగుపాటుకు ఇద్దరు, షెడ్ కూలి ఒకరు గాయాలపాలు
- నేలకొరిగిన చెట్లు.. తెగిపడ్డ విద్యుత్ వైర్లు
- నిలిచిన విద్యుత్ సరఫరా.. అంధకారంలో నగరం
సాక్షి, విశాఖపట్నం : వాన కురిసి ఊరట లభిస్తుందని ఆశ పడితే, పెనుగాలి హడలెత్తించింది. మండే ఎండ నుంచి కాస్త సేద తీరుదామనుకుంటే సుడిగాలి చెలరేగి కలవరపెట్టింది. గురువా రం సాయంత్రం నగరంలో, శివారు ప్రాంతాల్లో హోరుగాలుల కారణంగా జన జీవనం అస్తవ్యస్తమయింది. రో జంతా ఎండ భయపెడితే, సాయంత్రానికి మబ్బులు కమ్మి సాంత్వన లభించింది. అంతలోనే ఈదురుగాలుల బీభత్సంతో నగరం చిరుగుటాకులా వణికిపోయింది.
ఈ గాలుల ప్ర తాపానికి పలు చోట్ల చెట్లు నేలకొరిగా యి. విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. పద్మనాభం, మధురవాడ, భీమిలి, సాగర్‌నగర్, హెచ్‌బీకాలనీ, వాల్తేరు తదితర ప్రాంతాల్లో 40కిపైగా విద్యుత్ స్తంభా లు నేలకొరిగాయి. సాగర్‌నగర్, హెచ్‌బీ కాలనీతోపాటు ఐదు చోట్ల ట్రాన్స్‌ఫార్మర్ల పీఠాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలపై చెట్లు కూలడంతో.. కార్లు, ఆటోలు భారీగా ధ్వంసమయ్యాయి.
ఉష్ణోగ్రతలే కారణం
ఈదురు గాలుల బీభత్సానికి ఉష్ణోగ్రతల్లో పెరుగుదలే కారణమని వాతావరణ నిఫుణులు చెప్తున్నారు. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల గాలులు వేడెక్కి తేలికై పైకి వెళ్లడం.. అక్కడ చల్లబడి నేలకుదిగే సమయంలో జరిగిన చర్య ల వల్ల ఈ పరిస్థితి ఏర్పడినట్టు పేర్కొన్నారు. గురువారం నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 42.6 డిగ్రీలుగా నమోదయింది. ఈ వేసవిలో ఈ స్థాయి ఉష్ణోగ్రత నగరంలో ఇదే ప్రథమమని వా తావరణ నిఫుణులు చెప్తున్నారు. ఉష్ణోగ్రతల వల్ల సాయంత్రం క్యూములోనింబస్ మేఘాలు ఓ చోట చేరి.. వీటి కి గాలి తోడైతే.. బీభత్సం తప్పదంటున్నారు. రానున్న రెండు రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు ఇలాగే ఉంటాయని పేర్కొన్నారు.