సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉరుములతో కూడిన వర్షం పడింది. విశాఖపట్నం, అనకాపల్లి, గాజువాక, పాయకరావు పేట, నక్కపల్లి తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. విశాఖను మబ్బులు కమ్మేయడంతో మధ్యాహ్నం మూడు గంటలకే చీకటి వాతావరణం ఏర్పడింది. ఈశాన్య విదర్భ పరిసరాల్లో 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం వ్యాపించడంతో కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు తో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ తెలిపారు.
(‘ఆ ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుంది’)
రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయన్నారు. విశాఖతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా ఇలాంటి వాతావరణమే ఏర్పడింది. విశాఖ, విజయనగరంలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందని విపత్తు నిర్వాహణ శాఖ తెలిపింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని సూచించింది. (అండగా నిలిచారు..రుణపడి ఉంటాం)
Comments
Please login to add a commentAdd a comment