weather center warning
-
ఏపీలో పిడుగులతో వర్షాలు
అమరావతి, సాక్షి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయుగుండంగా మారి.. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రభావంతో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరిస్తోంది.రేపటి నుంచి ఏపీపై వాయుగుండం ప్రభావం కనిపించనుంది. రాష్ట్రంలో మూడు రోజులపాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 28, 29న నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి.తీరప్రాంతాల్లో 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. దక్షిణ కోస్తాలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు.. కోస్తాంధ్రలో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కోస్తాంధ్ర రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచించారు. -
రెడ్ అలర్ట్.. తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు
హైదరాబాద్, సాక్షి: ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాబోయే మూడు రోజులు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.తెలంగాణలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దాదాపుగా తెలంగాణ రాష్ట్రమంతటా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములతో కూడిన వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30-40 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఖమ్మం, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని పలు చోట్ల ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి.బంగాళాఖాతంలో దక్షిణ భాగంలో అల్పపీడనం ఏర్పడింది. దానికి అనుబంధంగా ఉత్తరం వైపు మరో అల్పపీడనం ఏర్పడింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
ఏపీ: మూడు రోజులు భారీ వర్షాలు
సాక్షి, అమరావతి: రాబోయే మూడు రోజుల్లో ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రాలో నేడు, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నేడు, రేపు, ఎల్లుండి రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నైరుతి రుతుపవనాల విస్తరణ దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, రాయలసీమలోని కొన్నిప్రాంతాలు, తమిళనాడులోని చాలా ప్రాంతాలు, నైఋతి బంగాళాఖాతం మరియు తూర్పు మధ్య బంగాళాఖాతంలో మొత్తం ప్రాంతాలు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరి కొన్ని ప్రాంతాలు, వాయువ్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలు, ఈశాన్య బంగాళాఖాతంలో మరి కొన్ని ప్రాంతాలలోనికి నైరుతి రుతుపవనాలు విస్తరించాయని విజయవాడ వాతావరణ కేంద్రం తెలిపింది. మధ్య అరేబియా సముద్రం, గోవా, కొంకన్ లో కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలో మరియు రాయలసీమలో మరికొన్ని ప్రాంతాలు, తమిళనాడులో మిగిలిన ప్రాంతాలు, కోస్తా ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలు, మధ్య బంగాళాఖాతం మరియు ఉత్తర బంగాళాఖాతంలో మరి కొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతదేశంలో కొన్ని ప్రాంతాలలోనికి నైరుతి రుతుపవనాలు రాగల 2 నుండి 3 రోజులలో విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. తదుపరి రెండు రోజులలో మహారాష్ట్ర, కర్ణాటక లో మరికొన్ని ప్రాంతాలు, తెలంగాణలో కొన్ని ప్రాంతాలు, కోస్తా ఆంధ్రాలో మరికొన్ని ప్రాంతాలు.. బంగాళాఖాతం, ఈశాన్య భారతదేశం లో మిగిలిన ప్రాంతాలు, సిక్కిం, ఒరిస్సా, గాంగేటిక్ పశ్చిమబెంగాల్ లో కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తూర్పు మధ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకొని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతాలలో మధ్య ట్రోపోస్పియర్ స్థాయిలు ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని.. దీని ప్రభావం వలన రాగల 48 గంటలో తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. -
ఏపీ: మూడు రోజులు భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాల ఆగమనానికి సంకేతంగా రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రాగల 2 రోజుల్లో మధ్య అరేబియా సముద్రం, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంతోపాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకూ రానున్నాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి ప్రభావంతో రానున్న నాలుగు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఉత్తర కోస్తాలో నేటి నుంచి 3 రోజుల పాటు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. గడిచిన 24 గంటల్లో యానాం, అనకాపల్లిలో 4 సెంమీ వర్షపాతం నమోదైంది. -
అక్కడ వారికి హెచ్చరిక!
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉరుములతో కూడిన వర్షం పడింది. విశాఖపట్నం, అనకాపల్లి, గాజువాక, పాయకరావు పేట, నక్కపల్లి తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. విశాఖను మబ్బులు కమ్మేయడంతో మధ్యాహ్నం మూడు గంటలకే చీకటి వాతావరణం ఏర్పడింది. ఈశాన్య విదర్భ పరిసరాల్లో 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం వ్యాపించడంతో కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు తో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ తెలిపారు. (‘ఆ ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుంది’) రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయన్నారు. విశాఖతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా ఇలాంటి వాతావరణమే ఏర్పడింది. విశాఖ, విజయనగరంలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందని విపత్తు నిర్వాహణ శాఖ తెలిపింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని సూచించింది. (అండగా నిలిచారు..రుణపడి ఉంటాం) -
వీడని వర్షం
రాష్ట్రమంతటా ఎడతెరపి లేని వాన ♦ నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు ♦ హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు ♦ భద్రాచలం వద్ద 22 అడుగులకు గోదావరి సాక్షి నెట్వర్క్/హైదరాబాద్: రాష్ట్రంలో వానల జోరు బుధవారమూ కొనసాగింది. పలు జిల్లాల్లో వరుసగా నాలుగో రోజూ వానలు పడ్డాయి. అల్పపీడనం కారణంగా గురు, శుక్రవారాల్లో కూడా రాష్ట్రంలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి వెల్లడించారు. ఆ తర్వాత కూడా మరో రెండ్రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ‘‘అల్ప పీడనం పశ్చిమ దిశగా వెళ్తుండటంతో ఆదిలాబాద్, కుమ్రం భీం, నిర్మల్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో 6.5 సెం.మీ., దోమకొండలో 6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. 40 ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి’’అని తెలిపారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రానికి రాష్ట్రవ్యాప్తంగా అబ్జర్వేటరీలు లేక వర్షపాత వివరాలు ఒక రోజు ఆలస్యంగా వెల్లడవుతున్నాయి. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలంలో కుండపోత కురిసింది. కామారెడ్డి పట్టణంలోనూ మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వాగులు ఉప్పొంగి పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. ఏటూరునాగారం మండలం రామన్నగూడెం, రాంనగర్ గ్రామాల మధ్య లో లెవల్ కాజ్వే పై నుంచి జీడి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రామన్నగూడెం నుంచి గర్భిణిని రాంనగర్ వద్ద జీడి వాగు దాటించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో 4 సె.మీ., జోగుళాంబ గద్వాల జిల్లాలో అలంపూర్ మండలంలో అత్యధికంగా 3 సెం.మీ. వర్షం నమోదైంది. మరోవైపు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. నాలుగు నెలలుగా నీరులేక వెలవెలబోయిన గోదారి ఒక్కసారిగా నిండుకుండలా మారింది. ఏటూరునాగారం మండలం ముల్లకట్ట వద్ద రెండు కిలోమీటర్ల మేరకు వరదనీరు పుష్కర ఘాట్, పూసురు ఒడ్డును తాకుతోంది. బుధవారం సాయంత్రం ఐదింటి వరకు 6.74 మీటర్ల నీటి మట్టం నమోదైంది. రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి 6.8 మీటర్లకు చేరింది. గురువారం నాటికి మరింత పెరిగేలా ఉంది. ఇంద్రావతి నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో భద్రాచలం వద్ద కూడా గోదావరికి వరద పెరుగుతోంది. 22 అడుగుల మేరకు నీరు చేరింది. తాలిపేరు ప్రాజెక్ట్‌లోకి వరదనీరు బుధవారం నుంచి తగ్గుముఖం పట్టింది. 14 గేట్లను ఎత్తి 28 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.