సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాల ఆగమనానికి సంకేతంగా రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రాగల 2 రోజుల్లో మధ్య అరేబియా సముద్రం, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంతోపాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకూ రానున్నాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
నైరుతి ప్రభావంతో రానున్న నాలుగు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఉత్తర కోస్తాలో నేటి నుంచి 3 రోజుల పాటు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. గడిచిన 24 గంటల్లో యానాం, అనకాపల్లిలో 4 సెంమీ వర్షపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment