visakhapatnam Meteorological Department
-
టీచర్ అవతారమెత్తిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి (ఫోటోలు)
-
అధరహో...సిరులు కురుపిస్తున్న చింత
సాక్షి,పాడేరు: చింతపండు గిరిజనుల ఇంట సిరులు కురిపిస్తోంది. ఈ ఏడాది మంచి ధర లభించింది. ప్రైవేట్ వ్యాపారులు, జీసీసీ సిబ్బంది పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలోని పాడేరు డివిజన్లో 11 మండలాలు, రంపచోడవరం డివిజన్ పరిధిలో మారెడుమిల్లి ప్రాంతంలో వ్యాపారం జోరుగా సాగుతోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో చింతపండు దిగుబడి ఆశాజనకంగా ఉంది. గిరిజన ప్రాంతాల్లోని చింతపండుకు మైదాన ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది. జీసీసీ సిబ్బంది, ప్రైవేట్ వ్యాపారులు పోటాపోటీగా కొనుగోలు చేస్తున్నారు. దిగుబడి చివరిదశకు చేరుకోవడంతో కొనుగోలులో పోటీ నెలకొంది. గిరిజన సహకార సంస్థ ఈ ఏడాది కిలో రూ.32.40 మద్దతు ధరతో భారీగా కొనుగోలు చేస్తోంది. గత ఏడాది చింతపల్లి, పాడేరు డివిజన్ల పరిధిలో సుమారు 120 టన్నుల వరకు జీసీసీ కొనుగోలు చేసింది. మార్చి నెల సీజన్ ప్రారంభంలో కిలో రూ.25 నుంచి రూ.30 వరకు వ్యాపారులు కొనుగోలు చేయగా, జీసీసీ రూ.32.40కు కొనుగోలు చేసింది. మార్కెట్లో పోటీగా ఎక్కువగా ఉండడంతో వ్యాపారులు కూడా ధరను పెంచారు. ప్రస్తుతం ప్రైవేట్ వ్యాపారులు చింతపండు నాణ్యతను బట్టి కిలో రూ.35 నుంచి రూ.40 వరకు కొనుగోలు చేస్తున్నారు.అయితే తూకంలో మాత్రం తేడాలు ఉండడంతో మోసపోతున్నామని గిరిజన రైతులు వాపోతున్నారు. సంతల్లో విక్రయాలు పలువురు గిరిజనులు తాము సేకరించిన చింతపండును సంతల్లో విక్రయిస్తున్నారు. దేవరాపల్లి, పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు సంతల్లో చింతపండును భారీగా విక్రయించారు. ప్రైవేటు వ్యాపారులు,స్థానిక ప్రజలు 15 కిలోల బరువు తూగే చింతపండు బుట్టను రూ.500 నుంచి రూ.500 వరకు కొనుగోలు చేశారు. భారీగా కొనుగోలు గిరిజన సహకార సంస్థ అన్ని వారపుసంతల్లో చింతపండును భారీగా కొనుగోలు చేస్తోంది. గత ఏడాది కొనుగోలు చేసిన చింతపండు నిల్వలు కోల్డ్ స్టోరేజీలో ఉన్నప్పటికీ ఈ ఏడాది గిరిజనులకు గిట్టుబాటు ధర కల్పించే లక్ష్యంతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. పాడేరు డివిజన్లో 230 క్వింటాళ్లు, చింతపల్లిలో 100 క్వింటాళ్లు కొనుగోలు చేశాం. ఈ నెలలో లక్ష్యం మేరకు చింతపండును కొనుగోలు చేస్తాం. గిరిజనులంతా జీసీసీ సంస్థకు సహకరించాలి. – కురుసా పార్వతమ్మ, జీసీసీ డీఎం,పాడేరు -
స్థిరంగా అల్పపీడనం
మహారాణిపేట (విశాఖ దక్షిణ): తమిళనాడు, శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం కొమరిన్, ఉత్తర శ్రీలంక పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఉంది. దీనికి అనుబంధంగా విస్తరించిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది రాగల 48 గంటల్లో ఆగ్నేయ అరేబియా సముద్ర ప్రాంతానికి ప్రవేశించి పశ్చిమ దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. ఆ తరువాత 48 గంటల్లో ఉత్తర వాయువ్యంగా ప్రయాణించి మరింత బలపడుతుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొమరిన్, ఉత్తర శ్రీలంక పరిసర ప్రాంతాల నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తాంధ్ర తీరం వరకు మన్నార్ గల్ఫ్, తమిళనాడు తీర ప్రాంతం మీదుగా సముద్ర మట్టం వద్ద ఉపరితల ద్రోణి వ్యాపించి ఉంది. ఈ ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కాగా, తిరుమలలో సోమవారం వేకువజాము నుంచి మధ్యాహ్నం వరకు కుండపోత వర్షం కురిసింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని జలాశయాలలో నీటిమట్టం పెరుగుతోంది. -
ఏపీకి తప్పనున్న వాయుగుండం ముప్పు!
మహారాణిపేట (విశాఖ దక్షిణ): తూర్పు, మధ్య ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. రానున్న 12 గంటల్లో ఇది పశ్చిమ, వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారి.. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో వాయువ్య బంగాళాఖాతం మీదుగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత 2, 3 రోజుల్లో ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్రభావం ఏపీపై పెద్దగా ఉండకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో ఉత్తరాంధ్రలో ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీరం వెంబడి గంటకు 45–55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. -
బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం
మహారాణిపేట (విశాఖ దక్షిణ): రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న 48 గంటల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. రాష్ట్రంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. ఈ నెల 28న ఉత్తర బంగాళాఖాతం, పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఈ ప్రభావం వల్ల పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. -
దేశంలో నైరుతి నిష్క్రమణ మొదలు
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య భారతం (పశ్చిమ రాజస్థాన్, పంజాబ్ పరిసర ప్రాంతాల నుంచి) నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సాధారణంగా ఈ నెల 20 నాటికి రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించేవి. కానీ.. ఈ ఏడాది రుతుపవనాల రాక కాస్త ఆలస్యం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి అక్టోబర్ మొదటి వారం నుంచి వీటి నిష్క్రమణ ఉంటుందని అధికారులు తెలిపారు. నైరుతి నిష్క్రమణం ప్రారంభం కావడంతో.. ఈశాన్య రుతుపవనాల కాలం మొదలైందని చెప్పారు. అక్టోబర్ రెండో వారంలో ఇవి రాష్ట్రంలోకి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. ఈశాన్య రుతుపవనాలతో సీమ, దక్షిణ కోస్తాలో విస్తారంగా వర్షాలు ► ఈశాన్య రుతుపవనాల కారణంగా రాయలసీమ, దక్షిణ కోస్తాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ► రానున్నది తుపాన్ల కాలమనీ.. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో తుపానులు ఏర్పడే సూచనలున్నాయని అంటున్నారు. ► రాష్ట్రంలో ఈ నైరుతి కాలంలో ఇప్పటివరకు సాధారణం కంటే 43 శాతం అధిక వర్షపాతం నమోదైందని తెలిపారు. నేడు రాయలసీమకు భారీ వర్ష సూచన ► ఏపీ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా మీదుగా ఉపరితల ద్రోణి 3.1 కిమీ ఎత్తు వరకూ కొనసాగుతోంది. ► అదేవిధంగా దక్షిణ ఆంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 4.5 నుంచి 5.8 కి.మీ ఎత్తులో ఉంది. ► దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం సీమలో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది. -
కోస్తాకు నేడు వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర ఒడిషా, పశ్చిమ బెంగాల్ తీరాల్ని ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది క్రమంగా జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తర మధ్యప్రదేశ్ వైపు కదులుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కిమీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు ఉత్తర–దక్షిణ ద్రోణి రాయలసీమ నుంచి దక్షిణ తెలంగాణ వరకూ 0.9 కిమీ ఎత్తులో ఉంది. వీటి ప్రభావంతో రాగల రెండు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. గురువారం ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో గరివిడిలో 4 సెంమీ, పూసపాటిరేగ, కళింగపట్నం, భీమిలి, అమలాపురంలో 3 సెంమీ వర్షపాతం నమోదైంది. -
నేడు, రేపు విస్తారంగా వర్షాలు
సాక్షి,అమరావతి/సాక్షి విశాఖపట్నం/అనంతపురం అగ్రికల్చర్/మోతుగూడెం/కొరిటెపాడు (గుంటూరు): రాష్ట్రంలో మరో రెండు రోజులు (సోమవారం, మంగళవారం) విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ, విశాఖ వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపాయి. ► ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయి. ఉత్తర కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉంది. ► ఉత్తర బంగాళాఖాతంలో 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. ► ఈ నెల 18 వరకు మత్స్యకారులను సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. ► గత 24 గంటల్లో కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవగా.. రాయలసీమలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ► భారీ వర్షాలకు తూర్పుగోదావరి జిల్లా డొంకరాయి జలాశయం ప్రధాన డ్యామ్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. గోదావరి పరీవాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు సూచించారు. కృష్ణా జిల్లాలో పెసర పంటకు నష్టం ► కృష్ణా జిల్లాలో నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడు మండలాల పరిధిలో ఈ ఏడాది సుమారు 10 వేల ఎకరాలకు పైగా పెసర పంట సాగు చేశారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెసర పంట నేలవాలింది. రోజుల తరబడి నీటిలో ఉండటంతో పెసరకాయలకు మొలకలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్నేరుకు వరద పెరిగింది. పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ తల్లి ఆలయ సమీపంలోని గృహాల్లోకి వరదనీరు చేరింది. ► కంచికచర్ల మండలంలో కస్తవ, లక్ష్మయ్య, ఏనుగు గడ్డ, నల్లవాగులు పొంగాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. గండేపల్లి లంక భూముల్లో పత్తి, జామాయిల్, వరి పొలాలన్నీ నీటమునిగాయి. -
నేడు ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని ఇక్కడి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిమీ ఎత్తులో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో.. ► ఉత్తర కోస్తా జిల్లాల్లో ఆదివారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని అధికారులు వెల్లడించారు. దక్షిణ కోస్తా, రాయలసీమలో రానున్న రెండ్రోజుల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయన్నారు. ► తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశముండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. ► ఉత్తర బంగాళాఖాతంలో 19న మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ► రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల ఉధృతి దృష్ట్యా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు సూచించారు. ► సహాయక చర్యల కోసం రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపించామని.. ఎన్డీఆర్ఎఫ్ బృందాలనూ సిద్ధం చేశామన్నారు. ‘ముసురు’కున్న రాష్ట్రం పలు జిల్లాల్లో వర్షాలు ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి. విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ముసురేసింది. గడిచిన 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా, రాయలసీమలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. వరరామచంద్రాపురంలో 10 సెంమీ, కూనవరంలో 8, కుక్కునూరు, వేలేరుపాటు, చింతూరులో 6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
అక్కడ వారికి హెచ్చరిక!
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉరుములతో కూడిన వర్షం పడింది. విశాఖపట్నం, అనకాపల్లి, గాజువాక, పాయకరావు పేట, నక్కపల్లి తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. విశాఖను మబ్బులు కమ్మేయడంతో మధ్యాహ్నం మూడు గంటలకే చీకటి వాతావరణం ఏర్పడింది. ఈశాన్య విదర్భ పరిసరాల్లో 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం వ్యాపించడంతో కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు తో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ తెలిపారు. (‘ఆ ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుంది’) రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయన్నారు. విశాఖతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా ఇలాంటి వాతావరణమే ఏర్పడింది. విశాఖ, విజయనగరంలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందని విపత్తు నిర్వాహణ శాఖ తెలిపింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని సూచించింది. (అండగా నిలిచారు..రుణపడి ఉంటాం) -
విస్తరించిన నైరుతి.. 24 గంటల్లో వెదర్ ఇలా!
సాక్షి, విశాఖపట్నం : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బంగ్లాదేశ్‌లోని పెని వద్ద తీరాన్ని దాటి బలహీనపడింది. దీంతో ప్రస్తుతం బంగ్లాదేశ్ తీరం వద్ద తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతం అయింది. జార్ఖండ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉంది. దీంతో రాగల 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురవవచ్చునని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా తీరం వెంబడి గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో నైరుతి దిశగా బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో పూర్తిగా.. ఒడిశాలో కొంతభాగం వరకు రుతుపవనాలు విస్తరించాయి. మహారాష్ట్రలో కొంతభాగం వరకు రుతుపవనాలు వ్యాపించాయి. -
మరో 24 గంటలపాటు వర్షాలు
విశాఖపట్నం : ఉత్తర తమిళనాడు తీరంపై బలమైన తీవ్రవాయుగుండం కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ మంగళవారం వెల్లడించింది. ఇది క్రమేణ బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది. అయితే మరో 24 గంటలపాటు దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు పడతాయని... కొన్ని చోట్ల అయితే భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. ఉత్తర కోస్తాలోనూ చెదురుమదురు వర్షాలు పడతాయని పేర్కొంది. అయితే దక్షిణ కోస్తాలో గంటకు 50 -55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని... అలాగే ఉత్తర కోస్తాలో గంటకు 45 - 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. కాగా అన్ని ప్రధాన ఓడరేవుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక అలాగే కొనసాగుతున్నట్లు చెప్పింది.