డబుల్ యుద్ధ విమానాలతో ఉగ్రవాదులపైకి.. | Britain doubles warplanes in fight against IS | Sakshi
Sakshi News home page

డబుల్ యుద్ధ విమానాలతో ఉగ్రవాదులపైకి..

Published Sun, Dec 6 2015 11:08 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 PM

డబుల్ యుద్ధ విమానాలతో ఉగ్రవాదులపైకి..

డబుల్ యుద్ధ విమానాలతో ఉగ్రవాదులపైకి..

లండన్: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్పై తానుసైతం అంటూ సమరశంఖం పూరించిన బ్రిటన్ వరుద దాడులతో ఉగ్రవాదులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సిరియాలోని ఉగ్రవాదులకు నిలువ నీడ లేకుండా చేసేందుకు వ్యూహం అమలుచేస్తోంది. అందులో భాగంగా తొలుత ఒకే యుద్ధ విమానంతో దాడులు బ్రిటన్ తాజాగా దానికి మరో యుద్ద విమానాన్ని జత చేసింది.

ప్రస్తుతం టైపూన్స్, టోర్నడో అనే పేరుతో ఉన్న డబుల్ యుద్ధ విమానాలను సిరియాలో ఉగ్రవాద స్థావరలపై మోహరింపజేసింది. ఈ విమానాలు తమ ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన సాయంతో ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేస్తున్నాయి. బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్కు చెందిన టైఫూన్ ఫైటర్ జెట్ విమానాలు సిరియా, ఇరాక్ లోని ఉగ్రవాద స్తావరాలపై తొలిసారి దాడులకు దిగాయా. సిప్రస్ లోని అక్రోతిరి అనే ప్రాంతంలోనూ ఒమర్ ప్రాంతంపైనా ఈ విమానాలు దాడులు చేశాయని  బ్రిటన్ సైనికాధికారులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement