
అదిరిపోయే ఫొటో.. ‘అసలు’ మ్యాటరేంటి!
పనిలో ఉంటే ఎంత పెద్ద ఉపద్రవం ముంచుకొచ్చినా తన భర్త పట్టించుకోడని ఓ కెనడా మహిళ గర్వంగా చెబుతోంది. థియునిస్ వెస్సెల్స్, సిసిలియా వెస్సెల్స్ దంపతులు స్థానికంగా నివాసం ఉంటున్నారు. ఇటీవల ఓ భయంకరమైన టోర్నడో వారి ఇంటి ఆవరణాన్ని చుట్టుముట్టింది. అదే సమయంలో భర్త థియునిస్ తనకేం సంబంధం లేదన్నట్లుగా ఇంటి ఆవరణలోని గడ్డిని యంత్రంతో కట్ చేస్తున్నాడు. అతని భార్య సిసిలియాకు ఓ ఆలోచన తట్టింది. భర్త వెనకాల టోర్నడోను సెల్‌ఫోన్ కెమెరాతో క్లిక్ మనిపించింది. ఆ ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా విపరీతమైన లైక్స్, షేర్లను సంపాదించుకుంది.
టోర్నడో ఉన్న విషయం తనకు తెలుసునని.. తనకు గడ్డి కట్ చేయడమే ముఖ్యమన్నాడట థియునిస్. అందుకే ఉపద్రవంపై ఓ కన్నేసి.. హ్యాపీగా తన పని చేసుకున్నట్లు భర్త తనతో చెప్పాడని సిసిలియా వివరించింది. తన తల్లికి మాత్రమే ఈ ఫొటోను ట్యాగ్ చేశానని, మెల్లిమెల్లిగా సోషల్ మీడియాలో ఇది వైరల్‌గా మారిందని ఫొటో స్టోరీని సిసిలియా వెల్లడించింది. ఫొటోలో మాత్రం ఇంటి పక్కనే ఉన్నట్లుగా కనిపించినా.. టోర్నడో దూరంగా ఏర్పడిందని కొందరు కామెంట్ చేయగా.. ఏది ఏమైతేనేం ఫొటో మాత్రం సూపర్బ్ అంటూ మరికొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.