
సాక్షి, కర్నూలు : కర్నూలు జిల్లాలో భూమి నుంచి వస్తున్నవింత శబ్దాలు, పొగలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. హాలహర్వి మండలం, యంకె పల్లిలో భూమి నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో స్థానికుల్లో కలవరం మొదలైంది. భారీ శబ్ధాలతో ఆకాశం ఎత్తుకు పొగలు ఎగిసి పడ్డాయి. ఊహించని పరిణామంతో స్థానికులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు.
అసలు ఎందుకు ఇలా జరుగుతుందో అర్థంకాక స్థానికులు ఆందోళనకు గురయ్యారు. బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో రైతులు పొలం పనులు చేసుకునేందుకు వెళ్లగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న అధికారులు వచ్చేలోపే పొగలు మాయమయ్యాయి. పచ్చని పంట పొలాల్లో రేగిన అగ్గిపై అధికారులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment