కరీంనగర్: దట్టమైన నల్లటి మబ్బులు రావడం, ఒకేసారి భారీగా వర్షం కురవడం.. ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఏకంగా మేఘాలు నేలకు దిగితే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా?
అచ్చం ఇలాంటి దృశ్యమే ఒకటి కరీంనగర్లో శుక్రవారం ఆవిష్కృతమైంది. పైనుంచి నల్లటి మబ్బుల్లోంచి ఒక తాడులాగ మేఘం కిందకు దిగింది. చూడటానికి చిన్నపాటి టోర్నడోలా కనిపించిన ఈ దృశ్యాన్ని కొందరు ఔత్సాహికులు తమ కెమెరాలలో బంధించారు.