అమెరికాలో టోర్నడో తుపాను భారీ విధ్వంసం సృష్టించింది. టెక్సాస్ రాష్ట్రంలోని పాన్‌హ్యాండిల్ పట్టణం పెర్రిటన్‌లో టోర్నడో ధాటికి అయిదుగురు మృతి చెందారు. దాదాపు 100 మంది స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చేరారు. మృతుల్లో 11 బాలుడు, 60 ఏళ్ల వయస్సున ఇద్దరు మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు. అక్కడి కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 5 గంటల తర్వాత టోర్నడో తుపాను టెక్సాస్, ఫ్లోరిడా ప్రాంతాన్ని తాకినట్లు అమరిల్లోలోని నేషనల్ వెదర్ సర్వీస్ పేర్కొంది.
సమాచారం అందుకున్న అత్యవసర సేవల అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ ఆపరేషన్ సేవలు ముమ్మరంగా సాగుతున్నాయని పెర్రిటన్ ఫైర్ చీఫ్ పాల్ డచర్ తెలిపారు. సుడిగాలి కారణంగా టెక్సాస్‌లో 200 ఇళ్లు ధ్వంసమవ్వగా.. మొబైల్ హోమ్‌లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. దీంతో ప్రజలు నిరాశ్రయులయ్యారు. భారీ వృక్షాలు నెలకొరిగాయి. వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
టెక్సాస్, లూసియానా, మిస్సిస్సిప్పి, ఫ్లోరిడా, ఓక్లహోమాలో సుమారు 50 వేల గృహాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో అంధకారంలో మగ్గుతున్నారు. పెర్రిటన్‌లో ముగ్గురు వ్యక్తులు మరణించారని, పలువురు గాయపడ్డారని స్థానిక మీడియా పేర్కొంది. సుడిగాలి తీవ్రతకు గురువారం ఫ్లోరిడా పాన్‌హ్యండిల్‌లో ఇంటిపై చెట్టు కూలడంతో ఒకరు మరణించారని తెలిపింది.
చదవండి: ఐరాసలో యోగా వైట్‌హౌస్‌లో విందు
Comments
Please login to add a commentAdd a comment