
మెక్సికోను ఊపేసిన టోర్నడో
మెక్సికో: మరోసారి టోర్నోడోలు ఉగ్రరూపం దాల్చాయి. ఉత్తర మెక్సికో ప్రాంతంపై అది విరుచుకుపడటంతో మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు స్పష్టం చేశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ప్రజా రక్షణ జాతీయ సమన్వయ కర్త తెల్విసా పుత్నే ఈ ఘటనపై మాట్లాడుతూ.. చనిపోయిన వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నారని తెలిపారు.
సియుడాడ్ యాకునా అనే పట్టణంపై టోర్నడో విరుచుకుపడిందని ఇది 5.30 గంటల నుంచి 6.10 వరకు కొనసాగిందని దీని ప్రభావంతో మొత్తం 88 మంది తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. అలాగే, 229 చెట్లు నేల కూలయాని, 300 ఇళ్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని, మరో 1,500 ఇళ్లు ధ్వంసమయ్యాయని వివరించారు. బలంగా వీచిన గాలి కారణంగా వాహనాలన్ని కూడా ఒక చోట కుప్పగా పడిపోయాయని, పరిస్థితి భీతావాహంగా తయారైందని తెలిపారు.