బ్యూరీగార్డ్: అమెరికాలోని అలబామా రాష్ట్రాన్ని టోర్నెడో వణికిస్తోంది. ఆగ్నేయ అలబామాలో టోర్నెడో ధాటికి 23 మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. తుపాను ధాటికి జార్జియా, దక్షిణ కరోలినా, ఫ్లోరిడా ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. డ్రోన్ల సాయంతో ప్రాణాలతో ఉన్న వారిని గుర్తించి కాపాడుతున్నామని చెప్పారు. గాయపడిన చాలా మందిని ఆస్పత్రులకు తరలించారు.
టోర్నెడోల ప్రభావం అలబామాలో ఎక్కువగా ఉంది. టోర్నెడో ధాటికి పలు చోట్ల ఇళ్లు నేలకూలాయి. వందల సంఖ్యలో చెట్లు నెలకొరిగాయి. టోర్నెడో కారణంగా గంటకు 170 మైళ్ల వేగంతో గాలులు వీచాయని జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. సహాయక కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హామీయిచ్చారని అలబామా గవర్నర్ తెలిపారు.
టోర్నెడో బీభత్సం
Comments
Please login to add a commentAdd a comment