యాపిల్ స్మార్ట్‌వాచ్ పోయే ప్రాణాల్ని నిలబెట్టింది. ఓ వ్యక్తి అనారోగ్యం కారణంగా ఇంట్లో అచేతన స్థితిలో పడిపోయినట్లు యాపిల్‌వాచ్ గుర్తించింది. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎమర్జెన్సీ నెంబర్‌కి కాల్ చేసి ప్రమాదంలో ఉన్న బాధితుడి ప్రాణాలు కాపాడి ప్రాణదాతగా నిలిచింది. ఇంతకి ఏం జరిగిందంటే?
అమెరికాకు చెందిన జోష్ ఫర్మాన్ టైప్ 1 డయాబెటిస్‌తో బాధపడుతున్నాడు. ఈ తరుణంలో ఓ రోజు ఇంట్లో ఉన్న ఫర్మాన్‌లో బ్లడ్ షుగర్ లెవల్స్ పూర్తిగా తగ్గి నిలుచున్న చోటే కుప్పకూలిపోయాడు. నోటి నుంచి మాటలేదు. శరీరంలో చలనం లేదు. ఆ సమయంలో అతనిని రక్షించేందుకు ఇంట్లో ఎవరూ లేరు. కానీ ఆయన ఇష్టపడి చేతికి పెట్టుకున్న యాపిల్‌వాచ్ ప్రాణాల్ని నిలబెడుతుందని ఊహించలేకపోయాడు.
ఫర్మాన్ కింద పడిపోవడంతో అప్రమత్తమైన యాపిల్‌వాచ్ వెంటనే 911కి (ఎమర్జెన్సీ నెంబర్)కి కాల్ చేసింది. అవతలి నుంచి 911 ఆపరేటర్ ఏం జరిగిందని అడిగే ప్రయత్నం చేస్తున్నా ఫలితం లేకపోయింది. యాపిల్‌వాచ్‌లో ఉన్న జీపీఎస్ ట్రాకర్ సాయంతో అంబులెన్స్ సిబ్బంది స్వల్ప వ్యవధిలో ఫర్మాన్ ఇంటికి చేరుకున్నారు. అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస‍్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలపగా.. ప్రాణపాయ స్థితిలో ఉన్న తనని యాపిల్‌వాచ్ కాపాడిందని సంతోషం వ్యక్తం చేశాడు.
అంతా రెప్పపాటులో
ఈ సందర్భంగా తనకు ఎదురైన ఘటనని మీడియాతో పంచుకున్నాడు. ‘ఫోన్‌లో మా అమ్మతో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఫోన్‌నెంబర్లని స్టోర్ చేశా. నేను ఆపస్మారక స్థితిలో పడిపోవడంతో ముందుగా 911కి కాల్ చేసింది. నేను ప్రమాదంలో ఉన్నానని మా అమ్మకి సమాచారం వెళ్లడం, ఆమె కూడా అంబులెన్స్‌కి కాల్ చేసి ఆరోగ‍్యం గురించి చెప్పడం.. వైద్యులు నా ప్రాణాలు కాపాడడం అంతా ఇలా రెప్పపాటులో జరిగిపోయింది’ అని అన్నారు.
ప్రాణపాయ స్థితిలో ఉంటే
ఫర్మాన్‌లా ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటే కాపాడడంలో స్మార్ట్‌వాచ్‌లు ఎప్పుడూ ముందుంటాయని మరోసారి నిరూపించాయి. యాపిల్‌తో పాటు ఇతర స్మార్ట్‌వాచ్‌లలో గుండె లయ తప్పడం, ఇతర అత్యవవసర వైద్య సేవలు అందేలా చూడడం, వినియోగదారులు స్వయంగా ఆపరేట్ చేయకపోయినా.. స్మార్ట్‌వాచ్‌లు వాటి పనిని సక్రమంగా నిర్వర్తిస్తాయి.
ప్రాణాంతకమైన అనారోగ్య సమస్యల్ని గుర్తించి
దీంతో పాటు వాచ్‌లలో ఉన్న ఫాల్ డిటెక్షన్ ఫీచర్‌తో పాటు రక్తంలో షుగర్ లెవెల్స్‌ను ట్రాక్ చేయడానికి, ఇన్సులిన్ ఇంజెక్షన్ల కోసం రిమైండర్‌లను సెట్ చేయడానికి, ప్రాణాంతకమైన డయాబెటిక్ కీటోయాసిడోసిస్ సంకేతాలను పర్యవేక్షించడానికి ఉపయోగపడుతుంది.
చదవండి👉 కోడింగ్ పోటీల్లో 67,000 మందిని ఓడించి.. మైండ్ బ్లోయింగ్ ప్యాకేజీ ఆఫర్‌తో!
Comments
Please login to add a commentAdd a comment