అప్పుడే పుట్టిన శిశువును చెత్తకుప్ప పాలు చేశారు. కాప్రా మున్సిపాలిటీ పరిధిలో ఈఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్: అప్పుడే పుట్టిన శిశువును చెత్తకుప్ప పాలు చేశారు. కాప్రా మున్సిపాలిటీ పరిధిలో ఈఘటన చోటుచేసుకుంది. హెచ్‌బీ కాలనీలో గల చెత్తకుప్పలో శనివారం ఉదయం స్థానికులకు పసికందు ఏడుపు వినిపించింది. వెళ్లి చూడగా చిత్తుకాగితాల మధ్య చుట్టి ఉన్న మగశిశువు ఏడుస్తోంది. దీంతో వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వారు శిశువును వెంటనే 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.