చెత్తకుప్పలో ఆడ శిశువు | New born baby found in dust bin at mahabubnagar bus stand | Sakshi
Sakshi News home page

చెత్తకుప్పలో ఆడ శిశువు

Published Fri, May 29 2015 2:33 PM | Last Updated on Wed, Oct 17 2018 3:53 PM

New born baby found in dust bin at mahabubnagar bus stand

మహబూబ్‌నగర్ : ఐదు రోజుల వయసున్న ఓ ఆడ శిశువును చెత్తకుప్పలో వదిలేశారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా బస్టాండ్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న చెత్తకుప్పలో ఐదు రోజుల ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు ఈ రోజు ఉదయం వదిలి వెళ్లారు. కాగా బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణీకులకు శిశువు ఏడుపు వినిపించడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారిని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. చిన్నారి తల్లిదండ్రుల ఆచూకీ కోసం ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement