
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్ జిల్లా బంటారంలో దారుణం జరిగింది. చెత్తకుప్పలో అప్పుడే పుట్టిన పసికందును పడేసిన ఘటన మండల కేంద్రంలో కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు పసికందును చెత్తకుప్పలో పడేసినట్లు స్థానికులు పేర్కొన్నారు. పసికందును గుర్తించిన అక్కడి వారు బయటకు తీశారు. చికిత్స నిమిత్తం తాండూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నవజాత శిశువు గొంతుపై బలంగా కొట్టినట్లు, తీవ్రంగా గాయపరిచినట్లు డాక్టర్లు చెప్పారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment