లండన్: అమెరికన్ నటీమణులు కిమ్ కర్దాషియన్, బియాన్స్ నావెల్స్, బ్రిటన్ మోడల్ విక్టోరియా బెక్‌హామ్, పాప్ గాయని షకీరా ఈ ఏడాది అత్యంత శక్తిమంతమైన 50 మంది తల్లుల జాబితాలో నిలిచారు. ‘మోస్ట్ పవర్‌ఫుల్ మామ్స్-2014’ పేరుతో ‘వర్కింగ్ మదర్’ మ్యాగజైన్ రూపొందించిన ఈ జాబితాలో క్రిస్టినా ఆగ్వీలిరా, కెర్రీ వాషింగ్టన్, టీనా ఫే, అమీ పోలర్, శాండ్రా బులాక్ వంటి సెలబ్రిటీలూ చోటు దక్కించుకున్నారు.
కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే వృత్తిపరంగా అత్యుత్తమ సామర్థ్యం చాటడం, వృత్తి జీవితాన్ని, మాతత్వ జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రతిభ కనపర్చడం వంటి అంశాల ఆధారంగా స్ఫూర్తిదాయకమైన మహిళలతో ఈ జాబితాను రూపొందించినట్లు మ్యాగజైన్ వర్గాలు వెల్లడించాయి.