ఇది ప్రపంచంలోనే అత్యంత భారీ ట్రక్కు. అత్యంత శక్తిమంతమైన రిగ్ కలిగి ఉన్న ఈ ట్రక్కుకు రెండు డీజిల్ ఇంజిన్లు, 24 సిలిండర్లు ఉండటం విశేషం. దీని రిగ్ 3,974 హార్స్‌పవర్ శక్తితో పనిచేస్తుంది. ఇంత భారీగా ఉన్నప్పటికీ ఈ ట్రక్కు గంటకు 209 కిలోమీటర్ల గరిష్ఠవేగంతో దూసుకుపోగలదు.
అమెరికన్ ఆటోమొబైల్ ఇంజినీరు మైకేల్ హర్రా ఏడేళ్ల పాటు శ్రమించి, ‘థోర్–24’ పేరిట ఈ ట్రక్కును రూపొందించాడు. దీని నిర్మాణానికి 70 లక్షల డాలర్లు (రూ.58.03 కోట్లు) ఖర్చయింది. ఇందులో 40 అంగుళాల టీవీ, 1500 వాట్ ఆడియో సిస్టమ్ వంటి అదనపు హంగులు కూడా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment