రాయల్ ఎన్‌ఫీల్డ్ ‘డిస్పాచ్ రైడర్స్’ లిమిటెడ్ ఎడిషన్ 200 బైక్‌లు 26 నిమిషాల్లో అమ్ముడయ్యాయి...
రాయల్ ఎన్‌ఫీల్డ్ డిస్పాచ్ రైడర్స్ ఘనత
న్యూఢిల్లీ: రాయల్ ఎన్‌ఫీల్డ్ ‘డిస్పాచ్ రైడర్స్’ లిమిటెడ్ ఎడిషన్ 200 బైక్‌లు 26 నిమిషాల్లో అమ్ముడయ్యాయి. మేలో ఆవిష్కరించిన ఈ డిస్పాచ్ రైడర్స్ బైక్‌లను ఆన్‌లైన్‌లోనే విక్రయానికి పెట్టామని రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రెసిడెంట్ రుద్రతేజ్ సింగ్ చెప్పారు. ఈ బైక్‌ల ధర రూ.2.16 లక్షల(ఆన్ రోడ్, ఢిల్లీ)ని పేర్కొన్నారు. ఐషర్ గ్రూప్‌కు చెందిన ఈ కంపెనీ ప్రస్తుతం బుల్లెట్, థండర్‌బర్డ్, క్లాసిక్, కాంటినెంటల్ జీటీ బైక్‌లను విక్రయిస్తోంది.
హీరో టూవీలర్ విక్రయాలు @ 66 లక్షలు
జంషెడ్పూర్: గత ఆర్థిక సంవత్సరంలో 66 లక్షల టూవీలర్లను విక్రయించామని హీరో మోటొకార్ప్ బుధవారం తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం అమ్మకాలతో పోల్చితే ఆరు శాతం వృద్ధి సాధించామని కంపెనీ సీనియర్ ఏరియా మేనేజర్(సేల్స్), జార్ఖండ్ విక్రమ్ కులకర్ణి చెప్పారు.