49 మందికే రామ్‌ మందిర్‌ వాచ్‌.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే! | Jacob And Co Launches Limited Edition Ram Mandir Watch | Sakshi
Sakshi News home page

రామ్‌ మందిర్‌ వాచ్‌.. 49 మాత్రమే ఉన్నాయ్‌.. కొనాలంటే ఎంతుండాలో తెలుసా?

Published Sun, Jul 28 2024 4:29 PM | Last Updated on Sun, Jul 28 2024 5:39 PM

Jacob And Co Launches Limited Edition Ram Mandir Watch

స్విస్ వాచ్ తయారీదారు జాకబ్ & కో భారతదేశంలోని దాని రిటైలర్ భాగస్వామి ఎథోస్ వాచ్ బోటిక్స్ సహకారంతో 'రామ్ జన్మభూమి ఎడిషన్ వాచ్' లాంచ్ చేసింది. ఈ వాచ్ కేవలం 49 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. దీని ధర 41000 డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 34,00,000.

జాకబ్ & కో లాంచ్ చేసిన ఈ వాచ్ ఈ వాచ్‌లో అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరం, రాముడు, హనుమంతుని నమూనాలు ఉన్నాయి. ఇది కుంకుమపువ్వు రంగులో ఉంది. దీనికి కేవలం 49మంది మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది.

భారతీయ సంస్కృతికి నిదర్శనంగా సంస్థ ఈ వాచ్ లాంచ్ చేసింది. ఈ వాచ్‌లో 9 గంటల వద్ద రామ మందిరం, 2 గంటల వద్ద రాముడు, 4 గంటల వద్ద హనుమంతుడు ఉండటం చూడవచ్చు. ఈ వాచ్ కలర్ ఆధ్యాత్మికతకు ప్రతీకగా చెబుతున్నారు. దీనిని ప్రధానంగా సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ప్రతిధ్వనించేలా రూపొందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement