స్కోడా ఆక్టేవియా ఆర్ఎస్ 245
సాక్షి, న్యూఢిల్లీ: స్కోడా ఆటో ఇండియా ఆక్టేవియా ఆర్‌ఎస్ 245 మోడల్‌లో లిమిటెడ్ ఎడిషన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ కారు ధరను రూ.35.99 లక్షలు(ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించామని కంపెనీ బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలిస్ తెలిపారు. ఈ కారుకు ఆన్‌లైన్ బుకింగ్‌లు వచ్చే నెల 1 నుంచి మొదలవుతాయని పేర్కొన్నారు. రూ. లక్ష చెల్లించి బుక్ చేసుకోవాలని, 200 కార్లను మాత్రమే అందుబాటులోకి తెచ్చామని వివరించారు. బుక్‌స్కోడాఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే అమ్మకాలు జరుపుతామని తెలిపారు. ఈ కారును 2లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో రూపొందించామని, ఏడు గేర్ల ఆటోమేటిక్ డ్యుయల్–క్లచ్ ట్రాన్సిమిషన్ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. ఈ కారు వంద కిలోమీటర్ల వేగాన్ని 6.6 సెకన్లలోనే అందుకుంటుందని, గరిష్ట వేగం గంటకు 250 కి.మీ. ర్యాలీ గ్రీన్, రేస్ బ్లూ, కొరిడా రెడ్, మ్యాజిక్ బ్లాక్ మరియు కాండీ వైట్ అనే ఐదు రంగుల్లో లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment