Octavia
-
వచ్చేస్తోంది.. స్కోడా ఒక్టావియా
వెబ్‌డెస్క్: క్వాలిటీ, లగ్జరీ, డ్యూరబులిటీలకు మరో పేరైన స్కోడా నుంచి మరో కొత్త కారు మార్కెట్లోకి వస్తుంది. ఎంట్రీ లెవల్ లగ్జరీ సెడాన్‌గా విజయవంతమైన ఒక్టావియా ఫోర్త్ జనరేషన్ కారు లాంఛింగ్‌కి రెడీ అయ్యింది స్కోడా జూన్ 10న కరోనా వైరస్ సృష్టించిన కల్లోలంతో వ్యక్తిగత వాహనాలకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం కార్ల అమ్మకాల్లో జోరు తగ్గినప్పటికీ... కార్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సక్సెస్ ఫుల్ మోడల్ ఒక్టావియాలో ఫోర్త్ జనరేషన్ కారును మార్కెట్లోకి తెస్తోంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమైతే మేలోనే ఈ కారు మార్కెట్లోకి రావాల్సింది. కానీ లాక్డౌన్ కారణంగా జూన్ 10కి వాయిదా పడింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఉన్న స్కోడా యూనిట్లో ఈ కార్లు తయారవుతున్నాయి. ఓన్లీ పెట్రోల్ వెర్షన్ స్కోడా ఒక్టావియా ఫోర్త్ జనరేషన్ ఓన్లీ పెట్రోల్ వెర్షన్లోనే లభిస్తోంది. ఈ కారులో అమర్చిన 2 లీటర్ యూనిట్ పెట్రోల్ ఇంజన్ 188 బీహెచ్పీ శక్తిని అందిస్తుంది. పాత కారుతో పోల్చితే సైజ్‌లో కొంచెం పెద్దదిగా డిజైన్ చేశారు. పొడవులో 19 మిల్లీమీటర్లు, వెడల్పులో 15 మిల్లీమీటర్లు పెద్దదిగా ఉంటుంది. కారు ముందు భాగంలో ఆప్షనల్ మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, హారిజంటల్ ఫాగ్‌ల్యాంప్స్ ఇవ్వగా వెనుక వైపు టైల్‌ల్యాంప్ డిజైన్లోనూ మార్పులు చేశారు. స్కోడా మార్క్‌ని మరింత ఆకర్షణీయంగా తీర్చి దిద్దారు. ఒక్టావియా మోడల్ మార్కెట్‌కి వచ్చి 20 ఏళ్లు దాటగా ఇప్పటి వరకు లక్షకు పైగా కార్లు దేశవ్యాప్తంగా అమ్ముడయ్యాయి. -
ధర రూ.36 లక్షలు; ఆన్లైన్లోనే సేల్
సాక్షి, న్యూఢిల్లీ: స్కోడా ఆటో ఇండియా ఆక్టేవియా ఆర్ఎస్ 245 మోడల్లో లిమిటెడ్ ఎడిషన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ కారు ధరను రూ.35.99 లక్షలు(ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించామని కంపెనీ బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలిస్ తెలిపారు. ఈ కారుకు ఆన్లైన్ బుకింగ్‌లు వచ్చే నెల 1 నుంచి మొదలవుతాయని పేర్కొన్నారు. రూ. లక్ష చెల్లించి బుక్ చేసుకోవాలని, 200 కార్లను మాత్రమే అందుబాటులోకి తెచ్చామని వివరించారు. బుక్‌స్కోడాఆన్‌లైన్ వెబ్సైట్ ద్వారా మాత్రమే అమ్మకాలు జరుపుతామని తెలిపారు. ఈ కారును 2లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో రూపొందించామని, ఏడు గేర్ల ఆటోమేటిక్ డ్యుయల్–క్లచ్ ట్రాన్సిమిషన్ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. ఈ కారు వంద కిలోమీటర్ల వేగాన్ని 6.6 సెకన్లలోనే అందుకుంటుందని, గరిష్ట వేగం గంటకు 250 కి.మీ. ర్యాలీ గ్రీన్, రేస్ బ్లూ, కొరిడా రెడ్, మ్యాజిక్ బ్లాక్ మరియు కాండీ వైట్ అనే ఐదు రంగుల్లో లభిస్తుంది. -
మార్కెట్లో స్కోడా ఆక్టావియా కార్పొరేట్ ఎడిషన్ కారు
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ సంస్థ స్కోడా ఆటో ఇండియా తాజాగా తమ ప్రీమియం సెడాన్ కారు ఆక్టావియాలో కొత్త వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. ఆక్టావియా కార్పొరేట్ ఎడిషన్ పేరుతో విడుదల చేసిన ఈ కారు (పెట్రోల్ ఇంజిన్) ధర రూ. 15.49 లక్షలుగా (ఎక్స్ షోరూం) ఉంటుంది. ఇక డీజిల్ వేరియంట్ రేటు రూ. 16.99 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంటుందని కంపెనీ తెలిపింది. పెట్రోల్ వేరియంట్ లీటరుకు 16.7 కి.మీ. మైలేజినిస్తుంది. 8.1 సెకన్లలో గంటకు 0–100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 219 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. మరోవైపు డీజిల్ వేరియంట్ లీటరుకు 21 కి.మీ. మైలేజీనిస్తుంది. 8.4 సెకన్లలో గంటకు 0–100 కి.మీ. వేగాన్ని చేరుకోగలదు. గరిష్టంగా గంటకు 218 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. -
స్కోడా ఆక్టావియా లాంచ్.. ధర
న్యూఢిల్లీ: చెక్ రిపబ్లిక్కు చెందిన కార్ల తయారీ కంపెనీ స్కొడా కొత్త సెడాన్ ఆక్టావియా ను లాంచ్ చేసింది. భారతదేశంలో అత్యుత్తమంగా అమ్ముడుపోయిన సెడాన్ ఆక్టవియా కొత్త వెర్షన్‌ను గురువారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 15.49 లక్షల( ఆల్ ఇండియా ఎక్స్ షోరూం ధరలు) నుంచి ప్రారంభం కానున్నట్టు తెలిపింది.. పెట్రోల్ డీజిల్ ఇంజిన్ రెండు వెర్షన్లలో ఈ కారు అందుబాటులో ఉండనుంది. ముఖ్యంగా పెట్రోల్ లో 1.4 లీటర్, 1.8 లీటర్ల రెండు ఇంజిన్ ఎంపికలతో రూ. 15.49-20.89 లక్షల మధ్య ధరకే లభిస్తుంది. డీజిల్ 2-లీటర్ ఇంజన్‌తో నాలుగు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. వీటి రూ .16.9-22.89 లక్షల మధ్య ఉంటాయని కంపెనీ ప్రకటించింది. స్కొడా కీలకమై బ్రాండ్ ఆక్టవియా ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఆరు మిలియన్ యూనిట్లు అమ్ముడైంది. 2001లో భారతదేశంలోఎంట్రీ ఇచ్చినప్పటినుంచి 90,000 యూనిట్లు విక్రయించింది. జనవరి-జూన్‌లో 15 శాతం వృద్ధి సాధించిన కంపెనీ విక్రయాలను మరింత పెంచుకోనుందని స్కోడా ఆటో ఇండియా సేల్స్, సర్వీస్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ అశుతోష్ దీక్షిత్ చెప్పారు. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో స్కొడా ఆటో ఇండియా 7,576 యూనిట్లు విక్రయించినట్టు తెలిపారు. కొత్త ఉత్పత్తులతో ఈ ఏడాది 30 శాతం అమ్మకాలు పెరగాలని, తద్వారా ప్రీమియం సెగ్మెంట్లో మా స్థానం మరింత మెరుగు పరుస్తామని దీక్షిత్ వెల్లడించారు. కొత్త ఆక్టివియాలో హ్యాండ్స్-ఫ్రీ పార్కింగ్, ఐ బజ్ డ్రైవర్ ఫెటీగ్ ఎలర్ట్, ఎనిమిది ఎయిర్ బాగ్స్ లాంటి అదనపు ఫీచర్లతో కార్ లవర్స్ ను ఆకట్టుకోనుంది. కొత్త ఆక్టేవియా ఈ విభాగంలో టొయోటా కరోలా అల్టిస్ గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా. -
కార్ల కాలుష్యంపై ఫోక్స్‌వ్యాగన్‌కు భారత్ నోటీసులు
న్యూఢిల్లీ: ఆడిఏ6 , ఆక్టావియా తదితర డీజిల్ కార్ల నుంచి ప్రామాణిక స్థాయికి మించి కాలుష్యకారక వాయువులు వెలువడుతున్నాయని పరీక్షల్లో తేలడంతో జర్మన్ కార్ల దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్‌కు భారత్ నోటీసులు జారీ చేసింది. కంపెనీ వివరణతో పాటు సాంకేతిక అంశాలు మొదలైనవి కూడా ఇవ్వాలని సూచిం చినట్లు భారీ పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శి అంబుజ్ శర్మ తెలిపారు. ల్యాబొరేటరీల్లో పరీక్షలతో పోలిస్తే బైట రహదారిపై ఆడిఏ6, జెటా, ఆక్టావియా, ఆడిఏ4 డీజిల్ కార్లు అధికంగా కాలుష్య వాయువులు విడుదల చేస్తున్నాయని ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్(ఏఆర్ఏఐ) గుర్తిం చినట్లు చెప్పారు. ఏఆర్ఏఎ నోటీసులు అందాయని, నవంబర్ 30లోగా వివరణ ఇవ్వనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. కాలుష్య ప్రమాణ పరీక్షల నుంచి మోసపూరితంగా గట్టెక్కించే సాఫ్ట్వేర్.. ఫోక్స్‌వ్యాగన్ కార్లలో ఉందని తేలడం, దీంతో ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున వాహనాలను సంస్థ రీకాల్ చేయడం తెలి సిందే. కంపెనీపై అమెరికా దాదాపు 18 బిలియన్ డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంది. -
స్కోడా సూపర్బ్.. కొత్త వేరియంట్లు
న్యూఢిల్లీ: స్కోడా కంపెనీ ప్రీమియమ్ ఎగ్జిక్యూటివ్ సెడాన్ సూపర్బ్‌లో కొత్త వేరియంట్‌ను ఆవిష్కరించింది. ఈ కారు ధరలు రూ.18.87 లక్షల నుంచి రూ.25.2 లక్షల రేంజ్లో(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) నిర్ణయించామని స్కోడా ఆటో ఇండియా సీఎండీ సుధీర్ రావు తెలిపారు. ఈ కారు పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లలో లభిస్తుందని, హ్యుందాయ్ సొనాటా, టయోటా కామ్రి, హోండా అకార్డ్, ఫోక్స్‌వ్యాగన్ పసంట్లకు ఈ సూపర్బ్ గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ప్రత్యేకతలు..: సీ షేపు టెయిల్ ల్యాంప్‌లు, ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, ఏబీఎస్, ఈబీడీ, క్రూయిజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, 6-సీడీ ఛేంజర్, రియర్ పార్కింగ్ సెన్సర్లు, ఎలక్ట్రికల్లీ అడ్జెస్టబుల్ ఓవీఆర్ఎంలు, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఆరు స్పీకర్లతో కూడిన టచ్‌స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్, విశాలమైన క్యాబిన్ స్పేస్, 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్(డీజిల్ వేరియంట్లో ఆటోమాటిక్ వేరియంట్ కూడా), డే టైమ్ రన్నింగ్ ఎల్ఈడీలు, 3 స్పోక్ స్టీరింగ్ వీల్ తదితర ప్రత్యేకతలున్నాయి. ఫాబియాకు టాటా... ఫాబియా కార్ల ఉత్పత్తిని నిలిపేశామని, కానీ విక్రయాలను కొనసాగిస్తున్నామని సుధీర్ రావు వివరించారు. పుణేలో ఉన్న విక్రయానంతర సర్వీసుల కార్యాలయాన్ని మూసేశామని తెలిపారు. అయితే పూర్తిగా చిన్న కార్ల సెగ్మెంట్ నుంచి వైదొలగలేదని, మళ్లీ ఈ సెగ్మెంట్లోకి ప్రవేశిస్తామని వివరించారు.