
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ సంస్థ స్కోడా ఆటో ఇండియా తాజాగా తమ ప్రీమియం సెడాన్ కారు ఆక్టావియాలో కొత్త వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. ఆక్టావియా కార్పొరేట్ ఎడిషన్ పేరుతో విడుదల చేసిన ఈ కారు (పెట్రోల్ ఇంజిన్) ధర రూ. 15.49 లక్షలుగా (ఎక్స్ షోరూం) ఉంటుంది. ఇక డీజిల్ వేరియంట్ రేటు రూ. 16.99 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంటుందని కంపెనీ తెలిపింది.
పెట్రోల్ వేరియంట్ లీటరుకు 16.7 కి.మీ. మైలేజినిస్తుంది. 8.1 సెకన్లలో గంటకు 0–100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 219 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. మరోవైపు డీజిల్ వేరియంట్ లీటరుకు 21 కి.మీ. మైలేజీనిస్తుంది. 8.4 సెకన్లలో గంటకు 0–100 కి.మీ. వేగాన్ని చేరుకోగలదు. గరిష్టంగా గంటకు 218 కి.మీ. వేగాన్ని అందుకోగలదు.