
లండన్ : హైఎండ్ లగ్జరీ కార్లలో క్రేజీ ప్రోడక్ట్‌గా ఊరించిన బుగట్టి దివో రోడ్లపై పరుగులు తీసేందుకు రెడీ అయింది. అయితే 5 మిలియన్ యూరోలు (రూ 40 కోట్లు) ఖరీదు చేసే ఈ కారు ప్రపంచవ్యాప్తంగా కేవలం 40 మందికే అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం బుగట్టి చిరాన్ కారు యజమానులకే కళ్లుచెదిరే ఈ కారును సొంతం చేసుకునే అవకాశం కల్పించారు.
కాగా, లాంఛ్‌కు ముందే న్యూ దివో 40 యూనిట్లు బుక్ అయ్యాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఎనిమిది లీటర్ల క్వాడ్-టర్బో డబ్ల్యూ16 ఇంజన్ సామర్ధ్యం కలిగిన దివో కేవలం 2.4 సెకన్లలోనే 0-100 కిమీ వేగం పుంజుకుంటుంది. బుగట్టి న్యూ హైపర్‌కార్‌కు ఫ్రెంచ్ దిగ్గజ రేసింగ్ డ్రైవర్ అల్బెర్టో దివో పేరు కలిసివచ్చేలా దివో పేరును ఎంచుకున్నట్టు కంపెనీ వెల్లడించింది. అన్ని బుగట్టి కార్ల తరహాలోనే నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీపడకుండా రాజసం, సౌకర్యం ఉట్టిపడేలా అత్యంత లావిష్‌గా దివోను తీర్చిదిద్దామని కంపెనీ వర్గాలు తెలిపాయి.



Comments
Please login to add a commentAdd a comment