ఓలా స్కూటర్‌ నుంచి లిమిలెడ్‌ ఎడిషన్‌.. కాషాయరంగులో అదిరిపోయింది ! | Ola Introduced Gerua Limited edition Scooter | Sakshi
Sakshi News home page

ఓలా నుంచి కొత్త స్కూటర్‌.. రెండు రోజులే అమ్మకాలు

Published Tue, Mar 15 2022 8:30 AM | Last Updated on Tue, Mar 15 2022 12:02 PM

Ola Introduced Gerua Limited edition Scooter - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఓలా ఎలక్ట్రిక్‌ ఎస్‌1 ప్రో స్కూటర్‌ తదుపరి విక్రయాలు మార్చి 17, 18న మొదలు కానున్నాయి. ఏప్రిల్‌ నుంచి డెలివరీలు ఉంటాయి. గ్లాసీ ఫినిష్‌తో స్పెషల్‌ ఎడిషన్‌ గెరువా రంగుతో స్కూటర్‌ను ప్రవేశపెట్టనున్నట్టు కంపెనీ తెలిపింది. ఆ రెండు రోజుల్లో మాత్రమే ఈ రంగు వాహనం లభిస్తుందని వివరించింది. ఇప్పటికే బుక్‌ చేసుకున్న కస్టమర్లు 17న, కొత్త వారు 18న కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. ఎస్‌1 ప్రో ఇప్పటికే 10 రంగుల్లో లభిస్తుంది. హోలి పండుగ నేపథ్యంలో ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు ఓలా సీఈవో భవీష్‌ అగర్వాల్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement