సాక్షి, న్యూఢిల్లీ : మొబైల్ తయారీదారు వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. జెడ్ సిరీస్‌లో భాగంగా వివో జెడ్ 1 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం తీసుకొచ్చింది. 11 జూలై 11వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా వివో జెడ్1 ప్రొ లభ్యం కానుంది. మూడు వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఏఐ ఆధారితి ట్రిపుల్ రియర్ కెమెరా, డెడికేటెడ్ గేమ్ మోడ్, పంచ్ హోల్ డిజైన్ తదితర ముఖ్య పీచర్లతోపాటు స్నాప్‌డ్రాగన్ 712 సాక్‌తో తీసుకొస్తున్న తొలి మొబైల్ ఇదని వివో స్ట్రాటజీ డైరెక్టర్ నిపుణ మార్య ప్రకటించారు.
వివో జెడ్ 1 ప్రొ ఫీచర్లు
ఆండ్రాయిడ్ 9
స్నాప్‌డ్రాగన్ 712 సాక్
8+16+2ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా
32 ఎంపీ సెల్ఫీ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
4జీబీ ర్యామ్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ. 14,999
6జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ ధర రూ. 16,999
6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ రూ. 18,999 ధరల్లో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో వుంటుంది. సోనిక్‌బ్లూ, సోనిక్ బ్లాక్, మిర్రర్‌బ్లాక్ కలర్స్‌లో లభ్యం.
Comments
Please login to add a commentAdd a comment