సాక్షి, ముంబై : వివో ఇండియా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఎస్ సిరీస్‌లో తొలి స్మార్ట్‌ఫోన్‌గా వివో ఎస్1 పేరుతో దీన్ని లాంచ్ చేసింది. అంతేకాదు దేశంలో వివో ఎస్ సిరీస్‌కు నటుడు సారా అలీ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. స్కైలైన్ బ్లూ, డైమండ్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి తీసుకొచ్చినట్టు వివో ప్రొడక్ట్ మేనేజర్ అంకిత్ మల్హోత్రా ప్రకటించారు.
వివో ఎస్ 1లో 16 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 499 ప్రైమరీ సెన్సార్, అల్ట్రా-వైడ్-యాంగిల్ ఎఫ్ / 2.2 లెన్స్‌తో 8 ఎంపీ సెకండరీ సెన్సార్ 5 ఎంపీ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అమర్చింది. స్మార్ట్ బటన్ కూడా ఉంది, ఇది సింగిల్ ట్యాప్‌లో గూగుల్ అసిస్టెంట్‌ను, డబుల్ ట్యాప్ జోవి ఇమేజ్ రికగ్నిజర్‌ను ఓపెన్ చేస్తుంది. 4 జీబీ ర్యామ్/ 128 జీబీస్టోరేజ్, 6జీబీ ర్యామ్/ 64జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్,/128 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ లభించనుంది. అయితే 4 జీబీ వేరియంట్ గురువారం నుంచే అమ్మకానికి సిద్ధం.
వివో ఎస్ 1 ఫీచర్లు
6.80 అంగుళాల స్క్రీన్
1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 9 పై
ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో పి 65 సాక్
19.5: 9 కారక నిష్పత్తిసూపర్ అమోలెడ్ ప్యానల్
ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
32 ఎంపీ సెల్పీ కెమెరా
16+ 8+ 5 ఎంపీ ట్రిపుల్ కెమెరా
6 జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్
4 500 ఎంఏహెచ్ బ్యాటరీ
ధరలు
4 జీబీ వేరియంట్ ధర రూ. 17,990
6 జీబీ ర్యామ్, 64/జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,990 ,
6 జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ధర రూ. 19,990
వివో కొత్త స్మార్ట్‌ఫోన్ వివో ఎస్ 1
Published Wed, Aug 7 2019 6:28 PM | Last Updated on Wed, Aug 7 2019 7:13 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment