సాక్షి,ముంబై: కొత్త సంవత్సరం సందర‍్భంగా చైనా మొబైల్ కంపెనీ వివో బంపర్ ఆఫర్ ప్రకటించింది. న్యూఫోన్, న్యూ ఆఫర్ పేరుతో కేవలం రూ.101 చెల్లించు అంటూ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ ఆఫర్ డిసెంబర్ 20నుంచి జనవరి 21, 2019 వరకు అందుబాటులో ఉండనుంది.
ఈ ఆఫర్ ద్వారా ఆన్ నెక్స్, వి11 ప్రొ, వి11, వై 95, వై 83, వై 81(4జీ) స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేసుకోవచ్చు. మొదట 101రూపాయలు చెల్లించి నిర్దేశిత స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అనంతరం ఫోన్ విలువ మొత్తాన్ని ఆరు సులభ వాయిదాలలో చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీబీ, క్యాపిటల్ ఫస్ట్ లాంటి సంస్థల ద్వారా ఫైనాన్సింగ్ సదుపాయం ఉంది.
#NewPhoneNewYou Pay just INR 101 and own a new Vivo smartphone. Start this new year on the right note - with the right phone. Know more https://t.co/wzYDFH67Bg pic.twitter.com/ifZJsEzUwv
— Vivo India (@Vivo_India) December 24, 2018
Comments
Please login to add a commentAdd a comment