బీజింగ్: చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. 'వివో నెక్స్' పేరుతో ఈ డివైస్‌ను విడుదల చేసింది. ఫుల్-స్క్రీన్ డిస్‌ప్లేతో మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ముఖ్యంగా ఆ స్మార్ట్‌ఫోన్‌లో పాప్ అప్ సెల్ఫీ కెమెరా ప్రధాన ఫీచర్‌గా నిలవనుంది. అత్యధిక స్టోరేజ్ కెపాసిటీతో ప్రీమియర్ వెర్షన్‌గా వివో నెక్స్ ఎస్, వివో నెక్స్ ఏ పేరుతో మరో స్టాండర్డ్ వెర్షన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. జోవి ఇంటెలిజెంట్ వాయిస్ అసిస్టెంట్, మరింత అభివృద్ధిపరచిన ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో ఈ ఇన్నోవేటివ్ వివో స్మార్ట్‌ఫోన్ నెక్స్ నయా ట్రెండ్‌ను సృష్టించనుందని టెక్ పండితులు భావిస్తున్నారు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు బ్లాక్, రెడ్ కలర్స్‌లో లభ్యం. చైనాలో వీటి ధర మన కరెన్సీ ప్రకారం సుమారు 53వేల రూపాయలు( ప్రీమియం వెర్షన్)గా ఉంది. త్వరలోనే భారత మార్కెట్లో కూడా వీటిని లాంచ్ చేయనుందని అంచనా.
వివో నెక్స్ ఫీచర్లు
6.59 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 845 ఎస్‌ఓసీ ప్రాసెసర్
8జీబీ ర్యామ్
256జీబీ స్టోరేజ్
12+5 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా
8ఎంపీ సెల్ఫీ కెమెరా
4000ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్‌చార్జ్
Comments
Please login to add a commentAdd a comment