
ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ మరో సేల్‌తో ముందుకు వచ్చింది. ఆగస్ట్ 6 నుంచి ఆగస్ట్ 10 వరకు గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ ఆఫర్ సేల్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.
నాలుగు రోజుల పాటు జరిగే ఈ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్‌లో స్మార్ట్ ఫోన్‌లు, ఎల్‌జీ ఓఎల్‌ఈడీ టీవీలు, రిఫ్రిజిరేటర‍్లపై ఆఫర్లు అందిస్తున్నట్లు అమెజాన్ ప్రతినిధులు వెల్లడించారు. ఇక ఈ సేల్‌లో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు అదనంగా 10శాతం డిస్కౌంట్ పొందవచ్చు. 60 రకాలైన ప్రొడక్ట్‌లు లాంచ్ కానున్న ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్‌లు, యాక్ససరీస్‌పై 40శాతం డిస్కౌంట్‌కే కొనుగోలు చేసే అవకాశం లభిస్తుండగా.. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు రూ. 6,599కే కొనుగోలు చేయొచ్చు. మొబైల్ ఉపకరణాలు రూ.69 నుంచి ప్రారంభం కానున్నాయి.
ల్యాప్‌టాప్ కొనుగోలుదారులు రూ.40,000 వరకు డిస్కౌంట్, హెడ్‌ఫోన్‌లపై 75శాతం వరకు డిస్కౌంట్, ట్యాబ్స్‌పై 45శాతం డిస్కౌంట్, స్మార్ట్‌వాచ్‌లపై 70శాతం డిస్కౌంట్ ఉంటుందని అమెజాన్ తెలిపింది. అదనంగా టీవీలు,ఉపకరణాలపై 60 శాతం, ప్రీమియం టీవీలు 50 శాతం డిస్కౌంట్ ధరలో లభిస్తాయి.ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఆఫర్‌తో పాటు మొబైల్ ఫోన్ కొనుగోళ్లపై నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్ పొందవచ్చు.