సాక్షి, న్యూఢిల్లీ : డిజిటల్ లావాదేవీలను పెంచేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. డిజిటల్ ద్వారా చెల్లింపులు చేపట్టే వినియోగదారులకు ఎంఆర్‌పీపై డిస్కౌంట్ ఇచ్చే ప్రతిపాదనకు రెవెన్యూ విభాగం తుదిమెరుగులు దిద్దుతోంది. ఈ డిస్కాంట్‌ను గరిష్టంగా రూ 100గా నిర్ణయించనున్నారు. ఇక డిజిటల్ పద్ధతిలో లావాదేవీలు నిర్వహించే వ్యాపారులకు టర్నోవర్ పరిమాణం ఆధారంగా క్యాష్‌బ్యాక్‌ను వర్తింపచేయనున్నారు.
మే 4న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగే జీఎస్‌టీ కౌన్సిల్ భేటీ ముందు ఈ ప్రతిపాదనలను ఆర్థిక శాఖ సిద్ధం చేస్తోంది. ప్రధాని కార్యాలయంలో ఇటీవల జరిగిన సమావేశంలో డిజిటల్ లావాదేవీలను పెంచేందుకు ఈ తరహా ప్రోత్సాహకాలు ప్రకటించాలనే అంశంపై విస్తృతంగా చర్చించారు. ఇక డిజిటల్ లావాదేవీలు నిర్వహించే వ్యాపారులకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలనేదానిపైనా భారీ కసరత్తు జరిగింది. డిజిటల్ లావాదేవీలు చేపట్టే వ్యాపారులకు టర్నోవర్‌పై నిర్థిష్ట మొత్తంలో క్యాష్‌బ్యాక్ ప్రకటించడానికే రెవిన్యూ విభాగం మొగ్గుచూపినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment