ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్స్‌ | Flipkart No Kidding Days sale: Get discounts upto 80%, cashback offers and much more | Sakshi
Sakshi News home page

ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్స్‌

Published Sat, Mar 31 2018 9:35 AM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

Flipkart No Kidding Days sale: Get discounts upto 80%, cashback offers and much more - Sakshi

సాక్షి,ముంబై:  ఏప్రిల్‌ 1న  ఆన్‌లైన్‌ రీటైలర్‌ ఫ్లిప్‌కార్ట్‌లో మరోసారి డిస్కౌంట్‌ సేల్‌.   ఏప్రిల్‌ ఫూల్‌ కాదండీ.. నిజంగానే.. వినియోగదారులను  ఆకర్షించేందుకు ప్రత్యేక డిస్కౌంట్‌ సేల్‌ ప్రకటించింది.  నో కిడ్డింగ్‌  డేస్‌ సేల్‌  పేరుతో ప్రత్యేక తగ్గింపు ధరలను  వెల్లడించింది. ఏప్రిల్‌ 1, 2 తేదీల్లో  రెండు  రోజులపాటు ఈ ప్రత్యేక ధరలను ఆఫర్‌ చేస్తోంది. గృహోపకరణాలు, ఫర్నిచర్‌, గ్రూమింగ్ & హెల్త్‌కేర్‌ ఉత్పత్తులు, బేబీ కేర్, టాయ్స్, పర్సులు ఇలా వివిధ అంశాలపై డిస్కౌంట్లను అందిస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

గృహ, ఫర్నిచర్ విభాగంలో 80శాతం భారీ తగ్గింపు.  మొబైల్‌ యాక్ససరీస్‌ ధరలు రూ.99నుంచిప్రారంభం. లాక్మే, నివియా లాంటి సౌందర్య ఉత్పత్తులపై 70శాతం తగ్గింపు.  అంతేకాదు  ప్రైస్‌ క్రాష్‌ అవర్స్‌ పేరుతో నిర్దేశిత సమయంలో స్పెషల్‌ డిస్కౌంట్స్‌.. స్పెషల్‌ కాంబో ఆఫర్లు అందిస్తోది.  కొన్ని ప్రత్యేక ఉత్పత్తులనపు రెండు  కొనుగోలు చేస్తే 10శాతం, మూడు వస్తులను కొంటే 15శాతం డిస్కౌంట్‌ ప్రకటించింది. ఇంటర్నేషనల్ బ్రాండ్లకు చెందిన దుస్తులు, బూట్లు,  హ్యాండ్‌బాగ్స్‌ను రూ. 199 ప్రారంభ ధరకే అందిస్తోంది. ప్యూమా, లీ వంటి బ్రాండ్లలో  50 శాతం డిస్కౌంట్‌ అందుబాటులో ఉంది.   దీంతో పాటు ఫోన్‌ పే  ద్వారా జరిపే కొనుగోళ్లపై 15శాతం  తగ్గింపు అదనం. మరిన్ని వివరాలు ఫ్లిప్‌కార్ట్‌ అధికారిక వెబ్‌సైట్‌లో...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement