హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఉన్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ తాజా గా కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు(కేఎస్‌ఆర్టీసీ) 25 ఈ–బస్‌లను సరఫరా చేసింది.
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై విధానసౌధ ఆవరణలో ఈ బస్సులను సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో కంపెనీ తయారీ బస్‌లు సేవలు అందిస్తున్నాయని ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ సీఎండీ కె.వి.ప్రదీప్ తెలిపారు. 1,100 పైగా ఈ–బస్‌లు 10 కోట్ల కిలోమీటర్లకు పైగా ప్రయాణించాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment