హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేఘా ఇంజినీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌కు (ఎంఈఐఎల్) చెందిన ఎలక్ట్రిక్ వాహన రంగ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ హైడ్రోజన్‌తో నడిచే బస్‌ను తయారు చేసింది. రిలయన్స్ భాగస్వామ్యంతో ఈ వాహనాన్ని రూపొందించినట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. ఏడాదిలోగా వాణిజ్యపరంగా వీటి ఉత్పత్తి ప్రారంభించాలని ఒలెక్ట్రా లక్ష్యంగా చేసుకుంది.
పూర్తి ఇంధన సామర్థ్యంతో 400 కిలోమీటర్ల వరకు ప్రయాణించడం బస్ ప్రత్యేకత. బస్ పైభాగంలో టైప్–4 హైడ్రోజన్ సిలిండర్లను ఏర్పాటు చేశారు. 12 మీటర్ల పొడవు ఉన్న ఈ బస్సులో డ్రైవర్ సీటు కాకుండా ప్రయాణికులకోసం 32–49 సీట్లు ఏర్పాటు చేయవచ్చు. హైడ్రోజన్ నింపడానికి 15 నిమిషాలు పడుతుంది.
(ఇదీ చదవండి: సింథటిక్ వజ్రాల ల్యాబ్.. ఎక్కడో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment