భారత మార్కెట్ కోసం తయారు చేసిన 12ఎం ఎలక్ట్రిక్ బస్సును స్విచ్ మొబిలిటీ సంస్థ ఆవిష్కరించింది. అలాగే, బ్రిటన్‌లో కొత్తగా టెక్నికల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ చైర్మన్ ధీరజ్ హిందుజా తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సులు, తేలికపాటి వాణిజ్య వాహనాలు మొదలైన వాటి తయారీపై భారత్, బ్రిటన్‌లో 300 మిలియన్ పౌండ్లు (సుమారు రూ. 2,980 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు స్విచ్ మొబిలిటీ వెల్లడించింది. తద్వారా 4,000 మంది పైచిలుకు నిపుణులకు ఉద్యోగాల కల్పన చేయనున్నట్లు పేర్కొంది.
చదవండి: హోండా ఎలక్ట్రిక్ టూ వీలర్స్
Comments
Please login to add a commentAdd a comment