Hindujas
-
హిందూజ గ్రూప్ ఫ్యామిలీకి జైలు శిక్ష.. అంతా ఉత్తదే!
హిందూజా కుటుంబానికి ఎటువంటి జైలు శిక్ష పడలేదని వారికి సంబంధించిన అధికార ప్రతినిధి తెలిపారు. హిందూజా గ్రూప్ చైర్మన్ ప్రకాశ్ హిందుజా, ఆయన భార్య కమల్ హిందూజా, కుమారుడు అజయ్, కోడలు నమ్రత తమ జెనీవా నివాసంలో పనిచేసే భారతీయ వలసదారు సిబ్బందిని వేధించారంటూ స్విస్ కోర్టులో పిటిషన్ వేయగా కోర్టు వారికి జైలు శిక్ష విధించినట్లు వార్తలు వచ్చాయి. అయితే హిందూజా కుటుంబంలోని నలుగురు సభ్యులను జైల్లో పెట్టలేదని, వారిపై మానవ అక్రమ రవాణా అభియోగాలను కోర్టు కొట్టివేసినట్లు హిందూజా అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ‘స్విస్ పౌరులైన హిందూజా కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు కమల్, ప్రకాశ్ హిందూజా, నమ్రత, అజయ్ హిందూజాలకు ఎలాంటి జైలుశిక్ష, నిర్బంధం విధించలేదు’ అని పేర్కొన్నారు.మిగిలిన అభియోగాల్లో దిగువ కోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో తాము అపీల్ చేసినట్లు హిందూజా ప్రతినిధి తెలిపారు. "స్విస్ చట్టాల ప్రకారం.. అత్యున్నత న్యాయస్థానం తుది తీర్పు వచ్చేంత వరకు నిర్దోషిత్వ భావన చాలా ముఖ్యమైనది కాబట్టి దిగువ కోర్టు తీర్పు పనిచేయదు" అని వివరించారు. తమకు అర్థం కాని స్టేట్ మెంట్లపై సంతకాలు చేయించారని బాధిత సిబ్బంది కోర్టులో ప్రకటించారని, హిందుజా కుటుంబం తమను గౌరవంగా, హుందాగా, కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారని వారంతా సాక్ష్యం చెప్పారని వివరించారు. స్విస్ న్యాయ ప్రక్రియపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, సత్యం గెలుస్తుందని పేర్కొన్నారు. -
భారత్ కోసం ప్రత్యేక ఎలక్ట్రిక్ బస్సులు
భారత మార్కెట్ కోసం తయారు చేసిన 12ఎం ఎలక్ట్రిక్ బస్సును స్విచ్ మొబిలిటీ సంస్థ ఆవిష్కరించింది. అలాగే, బ్రిటన్‌లో కొత్తగా టెక్నికల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ చైర్మన్ ధీరజ్ హిందుజా తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సులు, తేలికపాటి వాణిజ్య వాహనాలు మొదలైన వాటి తయారీపై భారత్, బ్రిటన్‌లో 300 మిలియన్ పౌండ్లు (సుమారు రూ. 2,980 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు స్విచ్ మొబిలిటీ వెల్లడించింది. తద్వారా 4,000 మంది పైచిలుకు నిపుణులకు ఉద్యోగాల కల్పన చేయనున్నట్లు పేర్కొంది. చదవండి: హోండా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ -
రెండో స్థానానికి హిందూజాలు
సండే టైమ్స్ ఈ ఏడాది బ్రిటన్ కుబేరుల జాబితా మూడు నుంచి ఏడో స్థానానికి లక్ష్మీ మిట్టల్ 302వ స్థానంలో ఎలిజబెత్ రాణి లండన్: బ్రిటన్ ఈ ఏడాది కుబేరుల జాబితాలో హిందూజాల కుటుంబం మొదటిస్థానం నుంచి రెండో స్థానానికి పడిపోయింది. సండే టైమ్స్ రూపొందించిన ఈ ఏడాది ధనవంతుల జాబితాలో ఉక్రెయిన్‌కు చెందిన లెన్ బ్లావత్నిక్ 1,317 కోట్ల పౌండ్లతో అగ్రస్థానానికి చేరుకున్నారు. లోహాలు, చమురు, సంగీత ముద్రణ, డిజిటల్ మీడియాల్లో ఆయన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న శ్రీచంద్, గోపీచంద్ హిందూజాల కుటుంబం 1,300 కోట్ల పౌండ్లతో రెండో స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. సండే టైమ్స్ రిచ్ లిస్ట్ వివరాల ప్రకారం.. గత ఏడాది జాబితాలో మూడవ స్థానంలో ఉన్న ఉక్కు సామ్రాట్ లక్ష్మీ ఎన్. మిట్టల్ ఈ ఏడాది జాబితాలో ఏడవ స్థానానికి పడిపోయారు. ఆయన సంపద 920 కోట్ల పౌండ్లుగా ఉంది. లార్జ్ స్వరాజ్‌పాల్ 220 కోట్ల పౌండ్ల సంపదతో 47వ స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది ఆయన సంపద 20 కోట్ల పౌండ్లు పెరిగింది. బ్రిటన్‌లో వెయ్యి మంది అత్యంత ధనవంతులైన వ్యక్తుల, కుటుంబాల సంపద గత పదేళ్లలో దాదాపు రెట్టింపై 54,700 కోట్ల పౌండ్లకు చేరింది. ఈ వెయ్యిమందిలో 35 శాతం మంది భారత మూలాలున్న సంతతి వారే. ఈ ఏడాది జాబితాలో ఐదుగురు భారత సంతతి కొత్త వ్యక్తులకు స్థానం దక్కింది. ఇన్వెస్ట్మెంట్ నిపుణుడు ఆశీష్ టక్కర్, పారిశ్రామికవేత్త గౌతమ్ థాపర్లు 217వ ర్యాంకులో ఉన్నా రు. వీరి ఒక్కొక్కరి సంపద 50 కోట్ల పౌండ్లు. ఆహార పరిశ్రమకు చెందిన రంజిత్, బల్జిందర్ బోపారన్లు 16 కోట్ల పౌండ్ల సంపదతో 608వ స్థానంలో నిలిచారు. సండే టైమ్స్ ఈ తరహా జాబితాను మొదటిసారిగా 1989లో రూపొందించింది. ఈ తొలి జాబితాలో ఎలిజెబెత్ టూ రాణి అగ్రస్థానంలో ఉన్నారు. కాగా ఈ ఏడాది ఆమె సంపద కోటి పౌండ్లు వృద్ధి చెంది 34 కోట్ల పౌండ్లకు చేరినప్పటికీ టాప్ 300 కుబేరుల్లో స్థానం దక్కలేదు. ఆమె 302వ స్థానంతో సరిపెట్టుకోవలసివచ్చింది.