ప్రజాపాలన విజయోత్సవంలో సీఎం రేవంత్
వాహన కాలుష్యానికి కళ్లెం వేసేలా చర్యలు
రెండేళ్లలో నగరంలో అన్నీ ఎలక్ట్రిక్ బస్సులే
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు ఢిల్లీ తరహా దుస్థితి రాకుండా వాహన కాలుష్యానికి కళ్లెం వేసే చర్యలు చేపడుతు న్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీలో విపరీతంగా కాలు ష్యం పెరిగి ఆ నగరం చివరకు నివాసయోగ్యం కాని నగరాల జాబితాలో చేరేలా ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని హైదరా బాద్‌కు భవిష్యత్తులో ఆ పరిస్థితి రాకుండా ఎలక్ట్రిక్ వాహనా లను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. వచ్చే రెండేళ్లలో హైదరా బాద్‌లోని ఆర్టీసీ డీజీల్ బస్సులను ఓఆర్‌ఆర్ ఆవలకు తరలించి వాటి స్థానంలో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులు తిప్పుతా మని అన్నారు.
డీజిల్ ఆటోల విషయంలో కూడా ఇదే పద్ధతి అవ లంబించే ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం ప్రజాపాలన ఏడాది విజయో త్సవాల్లో భాగంగా ఐమ్యాక్స్ సమీపంలోని హెచ్‌ఎండీఏ మైదానంలో రవాణా శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఏడాది కాలంలో రవాణా శాఖ, ఆర్టీసీ సాధించిన విజయాలతో కూడిన బ్రోచర్లను ఆవిష్కరించారు. ఫొటో ఎగ్జిబిషన్, ట్రాఫిక్ నియమాలపై చిన్నారులు ఏర్పాటు చేసిన నమూనాలను, ఎలక్ట్రిక్ వాహనాలను పరిశీలించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడారు.
ఆర్టీసీ పునరుజ్జీవంలో ‘మహాలక్ష్మి’ కీలకం
‘మూసీ పునరుజ్జీవం కూడా కాలుష్య నివారణ చర్యల్లో భాగ మే. దీనికి అందరూ సహకరించాలి. నష్టాల ఆర్టీసీ పునరుజ్జీ వంలో మహాలక్ష్మి పథకం కీలకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటి కే ఆ పథకంతో 115 కోట్లమంది ఉచితంగా ప్రయాణించటంద్వారా రూ.4 వేల కోట్ల వరకు ఆదా చేసుకున్నారు. ఒక్కో మహిళ సగటున ప్రతినెలా రూ.7 వేల వరకు ఆదా చేసుకుంటూ ఆ మొత్తాన్ని కుటుంబ అవసరాలకు వాడుకునే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ సాధనలో ఆర్టీసీ కార్మికులది కీలక భూమిక. వారి సంక్షేమం, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. ఒకే ఏడాదిలో 55,143 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశాం.
ఏ రాష్ట్రంలో కూడా ఈ ఘనత సాధించలేదు. నరేంద్ర మోదీ, కేసీఆర్‌లు వచ్చి కావాలంటే లెక్కపెట్టుకోవచ్చు. ఒక్క తల తగ్గినా క్షమాపణ కోరేందుకు సిద్ధం..’ అని సీఎం సవాల్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్థంగా మారిన ఆర్టీసీని తమ ప్రభుత్వం గాడిలో పెడు తూ లాభాల బాట పట్టిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. కాగా తొలిసారి రవాణా శాఖ కోసం ఏర్పాటు చేసిన లోగోను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. మహాలక్ష్మీ పథకంతో మహిళలకు రూ.3,902.31 కోట్ల మేర ఆదా అయినదానికి గుర్తుగా అంత విలువతో ముద్రించిన భారీ నమూనా చెక్కును మహిళా ప్రయాణికులకు సీఎం అందించారు.
మహిళలు ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి ఎదగాలి
⇒ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
⇒ సీఎంతో కలిసి ఇందిరా మహిళాశక్తి బజార్ల ప్రారంభం
మాదాపూర్ (హైదరాబాద్): మహిళలు ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. గురువారం రాత్రి మాదాపూర్‌లోని శిల్పారామంలో ఇందిరా మహిళాశక్తి బజార్లను సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలకు సాధికారత కల్పిస్తేనే దేశ ప్రగతి సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో మహిళలకు ప్రాధాన్యత పెంచడం అభినందనీయమని, క్యాంటీన్ల ఏర్పాటు వినూత్న ఆలోచన అని పేర్కొన్నారు. ఎస్‌హెచ్‌జీల మహిళలతో మాట్లాడితే.. వారు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించినట్లు తెలుస్తోందని, వారిని మరింతగా ప్రోత్సహించాలని సూచించారు.
అదానీ, అంబానీలతో ఆడబిడ్డల పోటీ: సీఎం
కొత్త సంవత్సరంలో ఉమ్మడి జిల్లాల్లో లక్ష మంది ఆడబిడ్డలతో సమావేశాలు నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈనెల 9వ తేదీన సచివాలయంలో లక్ష మంది మహిళల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాల్లో (ఎస్‌హెచ్‌జీలు) 65 లక్షల మంది ఉన్నారని, వీరిని కోటి మందిని చేయాలని మంత్రి సీతక్క, సీఎస్ శాంతికుమారికి సూచించారు. మీరంతా కలిసి కోటి మంది సభ్యులను చేస్తే ఆ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు.
ఇందిరా మహళాశక్తి క్యాంటీన్ల నిర్వహణ, రాబోయే రోజుల్లో సోలార్ పవర్ నిర్వహణ తదితర కార్యక్రమాలతో అదానీ, అంబానీలతో పోటీ పడేలా మహిళలను తీర్చిదిద్దుతామని రేవంత్ చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, గవర్నర్ సతీమణి సుధా జిష్ణుదేవ్ వర్మ, మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment