Kurla
-
ఆర్టీసీ బస్సు బీభత్సం.. జనాలపైకి దూసుకెళ్లి..
ముంబై: కుర్లాలోని ఎస్జీ బార్వేరోడ్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిలవ్వడంతో పాదచారులపై దూసుకెళ్లినట్లు సమాచారం. మృతులను శివమ్ కశ్యప్ (18), కనీజ్ ఫాతిమా (55), అఫీల్ షా (19), అనమ్ షేక్ (20)లు మరణించారు. 29మంది గాయపడ్డారు. ఐదారు ఆటోలు, 10 ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. సోమవారం సాయంత్రం 9.30 గంటల సమయంలో హౌసింగ్ కాలనీలో బృహన్ ముంబయి ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్)కు చెందిన కుర్లా- అంధేరి రైల్వే స్టేషన్ మధ్య నడిచే రూట్ నంబర్ 332 బస్సుగా గుర్తించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు బస్సు డ్రైవర్ సంజయ్ మోర్(43)ని అరెస్ట్ చేశారు. సహాయక చర్యల్ని ముమ్మరం చేపట్టారు. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బస్సు బ్రేకులు ఫెయిలవ్వడంతో జరిగిన ప్రమాద తీవ్రతను చూసిన స్థానికులు ఉగ్రదాడి తరహాలో ఉండడంతో భయాందోళనకు గురయ్యారు. పలువురు ప్రాణ భయంతో పారిపోయారు. పరిస్థితిని అదుపు చేసేందుకు క్విక్ రెస్పాన్స్ టీమ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది రంగంలోకి దిగారు.బృహన్ ముంబయి ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్)కు చెందిన బస్సు కుర్లా స్టేషన్ నుంచి అంధేరికీ వెళ్తుండగా బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగినట్టు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. అయితే ఆ బస్సు డ్రైవర్ సంజయ్ మోర్ కాంట్రాక్ట్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. బస్సు ప్రమాదానికి గల కారణాల్ని గుర్తించేందుకు ఆర్టీఓ అధికారి రవి గైక్వాడ్ నిపుణుల బృందం రంగంలోకి దిగింది.జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ సత్యనారాయణ చౌదరి స్వయంగా కుర్లా పోలీస్ స్టేషన్లో డ్రైవర్‌ను విచారించారు. సంజయ్ మోర్‌ను వైద్య పరీక్షల నిమిత్తం జేజే ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు. ఇదీ చదవండి : నా డెత్ లేఖ సుప్రీం కోర్టుకు చేరాలి -
ఆటోలో వచ్చాడని.. మాల్‌లోకి నో ఎంట్రీ!
ముంబై: అదో పెద్ద షాపింగ్ మాల్. అందులోకి వెళ్లాలంటే కాస్త స్టేచర్ ఉండాలన్నది ఆ మాల్ యజమానుల నిబంధన. అయితే ఈ నిబంధన ఎక్కడా లేదు. ఆ మాల్‌కు ఆటోలో వెళ్లిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు వింత అనుభవం ఎదురైంది. ఆటోలో వచ్చాడని మాల్ సిబ్బంది లోపలకు రానివ్వలేదు. ముంబై శివారు ప్రాంతం కుర్లాలో వికాస్ తివారీ (28) అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ కుటుంబ సభ్యులతో కలసి దీపావళి పండగకు షాపింగ్ చేసేందుకు మాల్‌కు వెళ్లాడు. వికాస్ సోదరుడు సంతోష్‌కు ఆటో ఉంది. ఆయన ఆటోలోనే వికాస్.. తన భార్య, సోదరుడి భార్య, పిల్లలను తీసుకుని ఫోయెనిక్స్ మార్కెట్‌సిటీ మాల్‌కు వెళ్లాడు. మాల్ లోపలకి ఆటో వెళ్తుండగా సెక్యూరిటీ గార్డు గట్టిగా కేకలు వేస్తూ వారిని అడ్డుకున్నాడు. మాల్ లోపల ఆటోలను పార్కింగ్ చేసేందుకు అనుమతి లేదని అభ్యంతరం చెప్పాడు. ఈ మాట వినగానే షాకయ్యానని వికాస్ చెప్పాడు. ఆటోలను లోపలకు అనుమతించబోమని ఎక్కడ రాశారని గార్డును ప్రశ్నిస్తూనే, ఈ తతంగాన్ని మొబైల్‌తో వీడియో తీశానని తెలిపాడు. గార్డు తనను సెక్యూరిటీ క్యాబిన్లోకి తీసుకెళ్లాడని, అక్కడున్న గార్డులు వీడియో తీయవద్దంటూ అభ్యంతరం వ్యక్తం చేశారని వికాస్ చెప్పాడు. మొదట్లో భయపడినా, తన భద్రత కోసం వీడియో తీశానని తెలిపాడు. ఆటోలను లోపలకు అనుమతించరాదన్న నిబంధన ఉందని గార్డులు ఎవరూ చెప్పలేదని, వాగ్వాదం జరగడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారని చెప్పాడు. పోలీసులు వచ్చి విషయం తెలుసుకుని నవ్వారని, ఫిర్యాదు ఇవ్వాల్సిందిగా తనకు సూచించినట్టు తెలిపాడు. అయితే తనతో ఉన్న కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదని వికాస్ చెప్పాడు. ప్రతి రోజు ఆటో డ్రైవర్లు వందలామందిని మాల్స్‌కు తీసుకెళ్తుంటారని, అయితే ఆటోలను లోపలకు ఎందుకు అనుమతించరని ప్రశ్నించాడు. వికాస్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ముంబై పోలీసులకు దృష్టికి తీసుకెళ్లాడు. -
ఈ రెండు స్టేషన్లలోనే ఆత్మహత్యలు అధికం
సాక్షి, ముంబై : నగరంలోని కుర్లా, ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్లలో ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తేలింది. దీంతో వీటిని ‘సూసైడ్ హాట్‌స్పాట్స్’గా పేర్కొంటున్నారు. శివారు రైలుపట్టాలపై ప్రతిరోజూ దాదాపు 10 మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 2013 నుంచి ఇప్పటివరకు దాదాపు 79 మంది ఎదురుగా వస్తున్న రైలు కింద పడి తనువు చాలించారు. సెంట్రల్, వెస్టర్న్ పరిధిలోని 127 రైల్వేస్టేషన్లలో పలువురు నగరవాసులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వీరిలో అత్యధిక శాతం మంది కుర్లా, ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్లనే ఎంచుకుంటున్నారు. రైల్వే పోలీసులు ఇందుకు సంబంధించి అందజేసిన గణాంకాల మేరకు.. 2013లో 62 మంది ఆత్మహత్యలకు పాల్పడగా ఇందులో 51 మంది పురుషులు, 11 మంది మహిళలు ఉన్నారని తేలింది. అయితే ఓ వ్యక్తి మాత్రం ఆత్మహత్య చేసుకోబోతూ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. వీటిలో సగానికిపైగా కేసులు కుర్లా, ముంబై సెంట్రల్ స్టేషన్లలోనే నమోదయ్యాయి. అయితే ఈ ఏడాది మాత్రం ఆత్మహత్యలకు సంబంధించిన కేసులు తక్కువగానే నమోదయ్యాయని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ముంబై సెంట్రల్లో మొత్తం ఐదుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు. కుర్లాలో ఎనిమిది మంది ఆత్మహత్య చేసుకోగా వీరిలో ఏడుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 17 ఆత్మహత్యల కేసులు నమోదయ్యాయి. ఆత్మహత్యలు చేసుకోవడానికి ఈ రెండు స్టేషన్లనే ఎందుకు ఎక్కువగా ఎంచుకుంటున్నారని అధికారులను మీడియా ప్రశ్నించగా దూరప్రాంతాల రైళ్లు ఎక్కువగా రావడమేనని వారు అభిప్రాయపడ్డారు.