
పూర్తిగా దగ్ధమైన కారు
సాక్షి, నాగులుప్పలపాడు: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం బ్యాంకు ఉద్యోగి అతి తెలివి తేటలు ప్రదర్శించి అడ్డంగా దొరికిపోయాడు. తన కారును తానే తగలబెట్టుకొని ఇన్సూరెన్స్ డబ్బులు కాజేయాలనే దుర్బిద్ధితో పోలీసులకు చిక్కిపోయాడు. పోలీసులు, బీఆర్‌వో వివరాల మేరకు నాగులుప్పలపాడు ఆంధ్రాబ్యాంకులో క్యాషియర్‌గా పని చేస్తున్న సుబ్రమణ్యేశ్వర శర్మకు సంబంధిచిన ఇండికా కారు నాగులుప్పలపాడు–ఇంకొల్లు రోడ్డులో రేగులగుంట సమీపంలో ఈ నెల 7వ తేది రాత్రి 9 గంటల సమయంలో తగలబడింది.
ఈ ప్రమాదంలో కారుకు సంబంధించిన నెంబరు ప్లేటు ఛాయిస్ నంబరుతో పాటు కారు కూడా పూర్తిగా దగ్ధమయింది. దీనిపై గ్రామ వీఆర్వో సురేష్ విచారించగా మంటల్లో తగలబడిన కారు ఆంధ్రాబ్యాంకుకు చెందిన ఉద్యోగి సుబ్రమణ్యేశ్వరశర్మగా తేలింది. ఈ ఘటనపై ఆదివారం కేసు నమోదు చేసిన పోలీసులు ఉద్యోగిని పిలిచి తమదైన శైలిలో విచారించగా తానే ఇన్సూరెన్సు కోసం తగలబెట్టుకున్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం.