వనపర్తిటౌన్ : తాము బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని ఓ వ్యక్తి వనపర్తిలో ఇద్దరికి టోకరా వేశాడు. పిన్ నెంబర్ సాయంతో వారి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు లేగేశాడు. పోలీసుల కథనం ప్రకారం కొద్దిరోజులు క్రితం వల్లభ్ నగర్కు చెందిన విజయ్ కుమార్ కు ఓ వ్యక్తి ఫోన్ చేసి..తాము వనపర్తి ఐసీఐసీఐ బ్యాంకు నుంచ మాట్లాడుతున్నామని, మీ ఎటీఎం కార్డుపిన్, అకౌంట్ నెంబర్ చెప్పమని అడగటంతో విజయ్ కుమార్ చెప్పేశాడు. క్షణాల్లోనే అతని ఖాతా నుంచి రూ. 20 వేలు డ్రా చేసినట్లు మెసేజ్ వచ్చింది.
అదేకాలనీకి చెందిన మరో వ్యక్తి కృష్ణయ్యకు ఫోన్ రావడంతో పిన్ నెంబర్ చుప్పేశాడు. వెంటనే రూ.50 వేలు డ్రా అయినట్టు అతనికి మెసేజ్ వచ్చింది. ఈ ఘటనలపై బాధితులు బ్యాంకు అధికారులను సంప్రదించారు. తమ సిబ్బంది అలాంటి కాల్స్ చేయలేదని వారు స్పష్టం చేయటంతో పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సీతారామిరెడ్డి మంగళవారం తెలిపారు.