vanaparti
-
ప్రియుడి ఇంటి ఎదుట ధర్నాకు దిగిన యువతి
-
ఎత్తు పెరగాలన్న ఆశతో..మృత్యు ఒడికి..
-
టీవీ ఆన్ చేస్తుండగా షాక్... మహిళ మృతి
కొత్తకొట: వనపర్తి జిల్లా కొత్తకోట మండలం బూత్కూరులో విషాదం చోటుచేసుకుంది. టీవీ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి గృహిణి మృతిచెందింది. వివరాలు.. సాయన్న, ఈశ్వరమ్మ (32) దంపతులు గ్రామంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో టీవీ ఆన్ చేసేందుకు ప్లగ్ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై ఈశ్వరమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి ఉన్నారు. -
బ్యాంకు అధికారినంటూ టోకరా
వనపర్తిటౌన్ : తాము బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని ఓ వ్యక్తి వనపర్తిలో ఇద్దరికి టోకరా వేశాడు. పిన్ నెంబర్ సాయంతో వారి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు లేగేశాడు. పోలీసుల కథనం ప్రకారం కొద్దిరోజులు క్రితం వల్లభ్ నగర్‌కు చెందిన విజయ్ కుమార్ కు ఓ వ్యక్తి ఫోన్ చేసి..తాము వనపర్తి ఐసీఐసీఐ బ్యాంకు నుంచ మాట్లాడుతున్నామని, మీ ఎటీఎం కార్డుపిన్, అకౌంట్ నెంబర్ చెప్పమని అడగటంతో విజయ్ కుమార్ చెప్పేశాడు. క్షణాల్లోనే అతని ఖాతా నుంచి రూ. 20 వేలు డ్రా చేసినట్లు మెసేజ్ వచ్చింది. అదేకాలనీకి చెందిన మరో వ్యక్తి కృష్ణయ్యకు ఫోన్ రావడంతో పిన్ నెంబర్ చుప్పేశాడు. వెంటనే రూ.50 వేలు డ్రా అయినట్టు అతనికి మెసేజ్ వచ్చింది. ఈ ఘటనలపై బాధితులు బ్యాంకు అధికారులను సంప్రదించారు. తమ సిబ్బంది అలాంటి కాల్స్ చేయలేదని వారు స్పష్టం చేయటంతో పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సీతారామిరెడ్డి మంగళవారం తెలిపారు. -
గాల్లోకి కాల్పులు జరిపిన గుర్తుతెలియని వ్యక్తులు
మహబూబ్‌నగర్ : గుర్తుతెలియని వ్యక్తులు గాల్లోకి కాల్పులు జరిపి ప్రజలను భయాందోళనలకు గురి చేశారు. ఈ సంఘటన గురువారం మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలం లాడెన్ నగర్ కాలనీలో జరిగింది. వివరాలు..అర్హులకు పెన్షన్ డబ్బు చెల్లించేందుకు గురువారం అధికారులు లాడెన్ నగర్ వెళ్లారు. కాగా, కాలనీలో గుర్తుతెలియని వ్యక్తులు అధికారులను అడ్డుకున్నారు. వారిని బెదిరించి తమ వద్ద నున్న తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో అధికారులు, కాలనీవాసులు భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. (వనపర్తి) -
వైఎస్సార్ ప్రజా నాయకుడు కాబట్టే..
-
గ్రామీణ బ్యాంకు చోరీకి విఫలయత్నం
-
టెన్త్ విద్యార్థినికి నీలిచిత్రాలు చూపిస్తున్న....
మహబూబ్‌నగర్: పాఠాలు చెప్పాల్సిన ప్రధానోపాధ్యాయుడు పశువుగా మారాడు.పదవ తరగతి విద్యార్థినికి నీలి చిత్రాలు చూపిస్తూ తన కోరిక తీర్చాల్సిందిగా వత్తిడి చేశాడు. మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలోని సాందీపని ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న జానకిరాంరెడ్డి తన స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. తన కోరిక తీరిస్తే స్కూల్ ఫీజులు, పరీక్ష ఫీజులు తనే చెల్లిస్తానంటూ వేధించసాగాడు. ఉపాధ్యాయుడి వేధింపుల గురించి ఆ విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పింది. వారు పాఠశాల వద్దకు వచ్చేసరికి ఉపాధ్యాయుడు పరారైనాడు. స్థానిక విద్యార్థి సంఘాలు నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కఠినంగా శిక్షించాలని ఆందోళనకు దిగాయి. . పోలీసులు కేసు నమోదు చేస్తామనిహామీ ఇవ్వడంతో విద్యార్థి సంఘాలు నిరసన విరమణ చేశాయి. **