
గాల్లోకి కాల్పులు జరిపిన గుర్తుతెలియని వ్యక్తులు
మహబూబ్‌నగర్ : గుర్తుతెలియని వ్యక్తులు గాల్లోకి కాల్పులు జరిపి ప్రజలను భయాందోళనలకు గురి చేశారు. ఈ సంఘటన గురువారం మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలం లాడెన్ నగర్ కాలనీలో జరిగింది. వివరాలు..అర్హులకు పెన్షన్ డబ్బు చెల్లించేందుకు గురువారం అధికారులు లాడెన్ నగర్ వెళ్లారు. కాగా, కాలనీలో గుర్తుతెలియని వ్యక్తులు అధికారులను అడ్డుకున్నారు. వారిని బెదిరించి తమ వద్ద నున్న తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో అధికారులు, కాలనీవాసులు భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు.
(వనపర్తి)